RRB NTPC Jobs : తగ్గిన ఎన్టీపీసీ పోస్టుల సంఖ్య.. అప్లై చేసినవారు ప్రిఫరెన్స్ మార్చుకోవాలి..

RRB NTPC Jobs| దేశంలోని వివిధ రైల్వే జోన్ల పరిధిలో నాన్‌టెక్నికల్ పాపులర్ కేటగిరీ(ఎన్టీపీసీ) పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య తగ్గింది. దీంతో అభ్యర్థులు తమ ప్రిఫరెన్సెస్ మార్చుకోవాల్సి ఉంటుందని RRB సూచిస్తోంది.

news18-telugu
Updated: April 21, 2019, 4:41 PM IST
RRB NTPC Jobs : తగ్గిన ఎన్టీపీసీ పోస్టుల సంఖ్య.. అప్లై చేసినవారు ప్రిఫరెన్స్ మార్చుకోవాలి..
పోస్టుల సంఖ్య తగ్గించిన ఆర్‌ఆర్‌బీ
news18-telugu
Updated: April 21, 2019, 4:41 PM IST
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఫిబ్రవరి 28న దేశంలోని వివిధ రైల్వే జోన్ల పరిధిలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి(ఎన్టీపీసీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 35,277 పోస్టులను భర్తీ చేయనున్నట్లు బోర్డు ప్రకటించింది. అయితే, ఈ పోస్టులనుంచి అలహాబాద్ రీజియన్ పరిధిలోని డీజిల్ లోకోమోటివ్ వర్క్స్(డీఎల్‌డబ్ల్యూ) విభాగంలో 69 పోస్టులకు తొలగిస్తున్నట్లు ఆర్‌ఆర్‌బీ పేర్కొంది. దీనికనుగుణంగా ఈ రీజియన్ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థులు ప్రిఫరెన్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పుకు సంబంధించిన సమాచారాన్ని అభ్యర్థులకు తెలియజేసేలా ఇప్పటికే ఈమెయిల్, ఎస్ఎమ్ఎస్ ద్వారా తెలియజేసినట్లు రైల్వే బోర్డు తెలిపింది.

అయితే.. నాన్‌టెక్నికల్ పాపులర్ కేటగిరీస్(ఎన్టీపీసీ) పోస్టుల సంఖ్య 69 తగ్గడంతో అలహాబాద్ రీజియన్పరిధిలోని మొత్తం పోస్టుల సంఖ్య 4099 నుంచి 4030కి తగ్గగా.. అన్ని రీజియన్లతో కలిపి మొత్తం పోస్టులు 35,277 నుంచి 35,208కి చేరాయి.

First published: April 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...