పాట్నాలోని రాజేంద్ర నగర్ రైల్వే స్టేషన్లో ఆందోళన చేస్తున్న విద్యార్థులు (Photo - ANI)
RRB NTPC Results | ఇటీవల విడుదల అయిని రైల్వే RRB-NTPC పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, కోపోద్రిక్తులైన వందలాది మంది అభ్యర్థులు సోమవారం పాట్నాలోని రాజేంద్ర నగర్ రైల్వే స్టేషన్లో గందరగోళం సృష్టించారు. దీంతో మొగల్సరాయ్-పాట్నా రైల్వే సెక్షన్లో కొన్ని గంటలపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
ఇటీవల విడుదల అయిని రైల్వే RRB-NTPC పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, కోపోద్రిక్తులైన వందలాది మంది అభ్యర్థులు సోమవారం పాట్నాలోని రాజేంద్ర నగర్ రైల్వే స్టేషన్లో గందరగోళం సృష్టించారు. దీంతో మొగల్సరాయ్-పాట్నా రైల్వే సెక్షన్లో కొన్ని గంటలపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అభ్యర్థుల నిరసన కారణంగా, తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్, సంపూర్ణ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌తో సహా అర డజను రైళ్ల ఆపరేషన్ రద్దు చేశారు. అంతే కాకుండా ఫిబ్రవరి 23న జరగనున్న రైల్వే గ్రూప్-డీ (Group -D) పరీక్షకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉందని.. ఇలాంటి సమయంలో రెండుసార్లు గ్రూప్ డి పరీక్ష రాయాలని రైల్వే బోర్డు పేర్కొనడంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చి సమస్య పరిష్కరించకుంటే రైల్వే ట్రాక్ (Railway Track) ను దిగ్బంధం చేస్తామని ఆందోళన చేస్తున్న విద్యార్థులు తెలిపారు.
Nalanda, Bihar: Students who appeared for Railway Recruitment Board's Non-Technical Popular Categories exam 2021 protested at Bihar Sharif railway station alleging discrepancies in the results pic.twitter.com/9w0ajSBAef
బీహార్‌లో పలు చోట్ల నిరసనలు.. బీహార్ (Bihar) లోని అనేక నగరాల్లో రైల్వే రిక్రూట్మెంట్పై అసంతృప్తితో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీనిపై సయువ హల్లా బోల్' వ్యవస్థాపకుడు, జాతీయ అధ్యక్షుడు అనుపమ్ రైల్వే మంత్రి అశ్వ ని వైష్ణవ్‌కు లేఖ కూడా రాశారు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షలో 1-20 చోప్పున అభ్యర్థులను ఎంపిక చేయాలని, అంతే కాకుండా ఆర్ఆర్బీ గ్రూప్-డీ కి సంబంధించి సీబీటీ-2 పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అభ్యర్థుల న్యాయమైన డిమాండ్లనుడ్ల పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం రైల్వే రిక్రూట్మెంట్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అనుపమ్ అన్నారు.
ఐదుగంటల పాటు రాకపోకలకు అంతరాయం.. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ (RRB NTPC) ఫలితాల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అభ్యర్థులు సోమవారం మధ్యా హ్నం నుంచి రైల్వే ఎన్టీపీసీ అభ్యర్థులు రాజేంద్ర నగర్ స్టేషస్టే న్లో గుమిగూడారు. దీంతో ఈ మార్గంలో సుమారు 5 గంటలపాటు రైలు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పాట్నా డీఎం చంద్రశేఖర్సింగ్, ఎస్ఎస్పీ మానవ్జీత్సింగ్ ధిల్లాన్ అక్కడికి చేరుకొని ఆందోళన కారులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన మాటను లెక్క చేయకుండా అభ్యర్థులు చాలా సేపు ఆందోళన చేశారు.
అసలు విషయం ఏమిటి?
ఇటీవల ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితంపై అసంతృప్తితోప్తి విద్యార్థులు రైల్వే బోర్డుపైర్డు ట్విట్టర్ (Twitter) లో క్యాంపెయిన్ చేస్తున్నారు. నోటిఫికేషన్లో పేర్కొన్న వారి కంటే తక్కువ మందిన అభ్యర్థులను ఎంపిక చేశారని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే బోర్డు నిర్ణయం వల్ల లక్షల్లో అభ్యర్థులు నష్టపోయారని వారు పేర్కన్నారు. అయితే రైల్వే బోర్డు మాత్రం నిబంధనల ప్రకారమే అభ్యర్థుల ఎంపిక జరిగినట్టు చెబుతోంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.