RRB NTPC RESULTS RAILWAY TEST RESULTS WITH IN A WEEK KNOW RESULT PATTERN AND CUT OFF DETAILS EVK
RRB NTPC Results: వారం రోజుల్లో రైల్వే పరీక్ష ఫలితాలు.. రిజల్ట్ పాటర్న్.. కట్ ఆఫ్ వివరాలు
ప్రతీకాత్మక చిత్రం
RRB NTPC Results: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నిర్వహించిన నాన్-టెక్నికల్ కేటగిరీ (NTPC) రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి పరీక్ష ఫలితాలు వారం రోజుల్లో వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రిజల్ట్ వెల్లడించే విధానం.. కట్ ఆఫ్ ఎంత ఉంటుందో అంచనా..
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నిర్వహించిన నాన్-టెక్నికల్ కేటగిరీ (NTPC) రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి పరీక్ష ఫలితాలు వారం రోజుల్లో వెలువడనున్నాయి. సీబీటీ-2కి సంబంధించి పరీక్ష తేదీల సమాచారానికి సంబంధించిన నోటిఫికేషన్ (Notification) ఇప్పటికే విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం జనవరి 15, 2022న ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీ-1 ఫలితాలు విడుదల చేయనుంది. కేవలం వారం రోజుల్లో ఫలితాలు రానున్నాయి. ఈ ఫలితాలను బోర్డు ఒక స్పెషల్ నార్మలైజేషన్ ఫార్ములాను ఉపయోగించి ఈ ఫలితాలను (NTPC 2021 Results) విడుదల చేయనుంది. (పరీక్ష నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి). వేర్వేరు రోజుల్లో వేర్వేరు షిఫ్టులలో జరిగే పోటీ పరీక్షలకు (Competitive Exams) ఈ నార్మలైజేషన్ ఫార్ములాను ఉపయోగిస్తుంటారు. ఈ టెక్నిక్ సహాయంతో ప్రతి షిఫ్ట్‌లో పరీక్ష రాసిన అభ్యర్థుల ఫలితాలకు బోర్డు సమానమైన వెయిటేజీని ఇస్తుంది.
కటాఫ్ ఎలా ఉంటుంది?
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌లోని ప్రతి జోన్‌కు కేటగిరీ వారీగా విడివిడిగా కటాఫ్ నిర్ణయిస్తారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 68 నుంచి 72 మార్కుల మధ్య కటాఫ్ ఉంటుందని భావిస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 62 నుంచి 65 మధ్య, ఓబీసీ అభ్యర్థులకు 60 నుంచి 63 మధ్య కటాఫ్ ఉండే అవకాశం ఉంది.
ఎస్సీ కేటగిరీకి 50 నుంచి 54, ఎస్టీ అభ్యర్థులకు 48 నుంచి 52 వరకు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పరీక్షకు హాజరైన వారు రిజిస్టర్డ్ నంబర్/రోల్ నంబర్, పాస్‌వర్డ్/పుట్టిన తేదీ వంటి వివరాలతో లాగిన్ అయ్యి రిజల్ట్ చూసుకోవచ్చు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు సీబీటీ–2 నిర్వహిస్తారు. ఇతర వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇప్పటి వరకు పరీక్షకు సంబంధించిన సమాచారం..
- CBT-1 పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఆగస్టు 16న విడుదల చేసింది.
- అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపేందుకు ఆగస్టు 23, 2021 వరకు గడువు ఇచ్చింది.
- దాదాపు 1.9 కోట్ల మంది అభ్యర్థులు RRB NTPC CBT-1 పరీక్షకు హాజరయ్యారు.
- CBT-1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే తదుపరి రౌండ్‌కు ఎంపిక అవుతారు.
- వీరు CBT-2 పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.
- CBT-1 ఫలితాలు జనవరి 15, 2022 న విడుదల చేశారు.
ఎన్‌టీపీసీ పరీక్షలో పోస్టులు ఇవే..
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్స్ కమ్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్, కమర్షియల్ అప్రెంటిస్, భారతీయ రైల్వేలోని వివిధ జోనల్ రైల్వేలు, ప్రొడక్షన్ యూనిట్లలో స్టేషన్ మాస్టర్ పోస్టులకు ఈ పరీక్షను ఆర్‌ఆర్‌బీ నిర్వహించింది. మొత్తం 35,208 ఖాళీల భర్తీకి ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ జరుగుతోంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.