హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RRB NTPC Results 2021: ఈ నెల‌లో ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఫ‌లితాలు.. ఇలా చెక్ చేసుకోండి

RRB NTPC Results 2021: ఈ నెల‌లో ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఫ‌లితాలు.. ఇలా చెక్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దాదాపు సంవ‌త్స‌రం నుంచి నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) పరీక్ష రాసి ఫ‌లితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డ‌నుంది. ఈ నెల‌లో ఎన్​టీపీసీ ప్రిలిమినరీ ఫలితాలను విడుదల చేయనున్నట్లు స‌మాచారం. రైల్వే ఎన్​టీపీసీ కింద దాదాపు 35 వేల పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్​ఆర్​బీ 2019లో నోటిఫికేషన్​ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి ...

  నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) పరీక్ష రాసిన అభ్యర్థులకు అదిరిపోయే గుడ్​న్యూస్​ చెప్పింది రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB). ఎన్​టీపీసీ ప్రిలిమినరీ ఈ నెలలో ప్రకటించాలని బోర్డు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. . రైల్వే ఎన్​టీపీసీ కింద దాదాపు 35 వేల పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్​ఆర్​బీ 2019లో నోటిఫికేషన్​ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్​కు నిరుద్యోగుల నుంచి మంచి స్పందన వచ్చింది. సుమారు కోటి మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.  దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం, దానికి కరోనా తోడవ్వడంతో పరీక్షల నిర్వహణ ఆలస్యం అయ్యింది. దీంతో, 2020 డిసెంబర్ 28 నుంచి 2021 జూలై 31 మధ్య దశల వారీగా పరీక్షలు నిర్వహించారు.

  అయితే జూలై 31న 7 ఫేజ్​లలో దేశవ్యాప్తంగా ఈ ఎన్​టీపీసీ సీబీటీ–1ను పూర్తి చేశారు. ఆ వెంటనే ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు. వాటిని సరిచేసి ఫైనల్​కీని కూడా విడుదల చేశారు. ఇక, వచ్చే వారంలో ఫలితాలను విడుదల చేసేందుకు ఆర్​ఆర్​బీ సిద్దమవుతోంది. ఈ ఫలితాలను అభ్యర్థులు తమ ప్రాంతీయ రైల్వే జోన్​ వెబ్‌సైట్​ ద్వారా చెక్ చేసుకోవచ్చు. సికింద్రాబాద్ జోన్​ పరిధిలోని తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు- www.rrbusenderabad.nic.in వెబ్​సైట్​ ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు.

   National Employment Policy: ఏమిటీ జాతీయ ఉపాధి విధానం..? త్వ‌ర‌లో నిపుణుల క‌మిటీ ఏర్పాటుకు ప్ర‌భుత్వ యోచ‌న


  కటాఫ్​ ఎలా ఉంటుంది?

  రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌లోని ప్రతి జోన్‌కు కేటగిరీ వారీగా విడివిడిగా కటాఫ్​ నిర్ణయిస్తారు. కంప్యూటర్ బేస్డ్​ ఎగ్జామ్​ (సీబీటీ)–1లో అభ్యర్థి పొందాల్సిన కనీస అర్హత మార్కులనే కటాఫ్​ మార్కులుగా పరిగణిస్తారు. అయితే, భారీ మొత్తంలో అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరైన కారణంగా కేటగిరీ వారి కటాఫ్​ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  -  జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 68 నుంచి 72 మార్కుల మధ్య కటాఫ్ ఉంటుందని భావిస్తున్నారు.

  - ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థులకు 62 నుంచి 65 మధ్య, ఓబీసీ అభ్యర్థులకు 60 నుంచి 63 మధ్య కటాఫ్ ఉండే అవకాశం ఉంది.

  -  ఎస్సీ కేటగిరీకి 50 నుంచి 54, ఎస్​టీ అభ్యర్థులకు 48 నుంచి 52 వరకు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  CMIE Survey: అక్టోబ‌ర్‌లో 54.6 ల‌క్ష‌ల మంది ఉద్యోగాలు కోల్పోయారు.. సీఎమ్ఐఈ స‌ర్వే


  పరీక్షకు హాజరైన వారు రిజిస్టర్డ్ నంబర్/రోల్ నంబర్, పాస్‌వర్డ్/పుట్టిన తేదీ వంటి వివరాలతో లాగిన్ అయ్యి రిజల్ట్​ చూసుకోవచ్చు. షార్ట్​లిస్ట్​ అయిన అభ్యర్థులకు సీబీటీ–2 నిర్వహిస్తారు. ఇతర వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

  ఫ‌లితాలు తెలుసుకొనేందుకు వెబ్‌సైట్ వివ‌రాలు

  Chennai – www.rrbchennai.gov.in

  Patna – www.rrbpatna.gov.in

  Bhubaneshwar – www.rrbbbs.gov.in

  Bilaspur – www.rrbbilaspur.gov.in

  Secunderabad – www.rrbsecunderabad.nic.in

  Bhopal – www.rrbbpl.nic.in

  Chandigarh – www.rrbcdg.gov.in

  Ranchi – www.rrbranchi.gov.in

  Gorakhpur – www.rrbguwahati.gov.in

  Siliguri – www.rrbsiliguri.org

  Thiruvananthapuram – www.rrbthiruvananthapuram.gov.in

  Siliguri – www.rrbsiliguri.org

  Thiruvananthapuram – www.rrbthiruvananthapuram.gov.in

  RRB Jammu – www.rrbjammu.nic.in

  Malda – www.rrbmalda.gov.in

  Kolkata – www.rrbkolkata.gov.in

  Muzaffarpur – www.rrbmuzaffarpur.gov.in

  Ahmedabad – www.rrbahmedabad.gov.in

  RRB Guwahati – www.rrbguwahati.gov.in

  Allahabad – www.rrbald.gov.in

  Published by:Sharath Chandra
  First published:

  Tags: India Railways, Railway jobs, Results, RRB

  ఉత్తమ కథలు