హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RRB NTPC Exams: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అభ్యర్థులకు అలర్ట్... మీ దరఖాస్తు చెక్ చేసుకోండి

RRB NTPC Exams: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అభ్యర్థులకు అలర్ట్... మీ దరఖాస్తు చెక్ చేసుకోండి

RRB NTPC Exams: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అభ్యర్థులకు అలర్ట్... మీ దరఖాస్తు చెక్ చేసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

RRB NTPC Exams: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అభ్యర్థులకు అలర్ట్... మీ దరఖాస్తు చెక్ చేసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

RRB NTPC Recruitment 2020 | ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు అలర్ట్. ముఖ్యమైన నోటీసు జారీ చేసింది ఆర్ఆర్‌బీ.

  రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB 35,000 పైగా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్-NTPC పోస్టుల్ని భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది ఫిబ్రవరిలో ఈ నోటిఫికేషన్ విడుదలైనా ఇప్పటివరకు పలు కారణాల వల్ల పరీక్షలు జరగలేదు. డిసెంబర్‌లో ఈ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్టు ఇప్పటికే అధికారికంగా ఆర్ఆర్‌బీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ముఖ్యమైన నోటీసును అభ్యర్థులకు జారీ చేసింది ఆర్ఆర్‌బీ. ఎన్‌టీపీసీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అప్లికేషన్స్‌ని పరిశీలించే ప్రక్రియ పూర్తైందని ఆర్ఆర్‌బీ ప్రకటించింది. 1,26,30,88 మంది అభ్యర్థులు ఎన్‌టీపీసీ పోస్టులకు దరఖాస్తు చేశారు. అయితే అభ్యర్థులు తమ దరఖాస్తుల స్టేటస్‌ను చెక్ చేసుకోవాలని ఆర్ఆర్‌బీ కోరుతోంది. పరీక్ష రాయడానికి దరకాస్తు అనుమతించారా, లేదా తిరస్కరించారా అన్న స్టేటస్‌ను అభ్యర్థులు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ దరఖాస్తు తిరస్కరిస్తే ఎందుకు రిజెక్ట్ అయిందో కారణాలను కూడా వివరిస్తుంది ఆర్ఆర్‌బీ.

  IBPS Clerk Jobs: మొత్తం 2557 బ్యాంకు జాబ్స్... ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఖాళీలు

  ECIL Jobs 2020: ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... హైదరాబాద్‌లో ఖాళీలు

  ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అభ్యర్థులు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుకు చెందిన అధికారిక వెబ్‌సైట్‌లోనే తమ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ లాంటి వివరాలు ఎంటర్ చేసి స్టేటస్ తెలుసుకోవాల్సి ఉంటుంది. స్టేటస్ లింక్ 2020 సెప్టెంబర్ 21న యాక్టివేట్ అవుతుంది. స్టేటస్ విండో 2020 సెప్టెంబర్ 30న క్లోజ్ అవుతుంది. అభ్యర్థులు అంతలోపే తమ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది తాత్కాలిక జాబితానే. అభ్యర్థులు తమ అప్లికేషన్ స్టేటస్ చూసిన తర్వాత దరఖాస్తు తిరస్కరణకు గురైతే సరైన వివరాలను ఆర్ఆర్‌బీకి సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పరీక్ష రాసేందుకు అవకాశం లభించొచ్చు.

  SBI Jobs 2020: ఎస్‌బీఐలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల... ఖాళీల వివరాలు ఇవే

  DRDO Jobs 2020: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో జాబ్స్... నేరుగా ఇంటర్వ్యూ

  అభ్యర్థుల దరఖాస్తులు రిజెక్ట్ కావడానికి పలు కారణాలు ఉంటాయి. ఫోటోలు సరిగ్గా లేకపోవడం వల్ల దరఖాస్తు రిజెక్ట్ అవుతుంది. ఆర్ఆర్‌బీ సూచించిన విధంగా కాకుండా సెల్ఫీలు, గ్రూప్ ఫోటోలు, మొబైల్ ఫోటోలను అప్‌లోడ్ చేస్తే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. సంతకం సరిగ్గా లేకపోయినా, అప్లికేషన్ సగమే ఫిల్ చేసినా దరఖాస్తు రిజెక్ట్ చేస్తారు. ఇక విద్యార్హతలు లేనివాళ్లు అప్లై చేస్తే పరీక్ష రాసేందుకు అనుమతించరు. నోటిఫికేషన్‌లో వెల్లడించిన వయస్సు కన్నా ఎక్కువ ఉన్నవారు అప్లై చేసినా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఒకే వ్యక్తి రెండు మూడుసార్లు అప్లికేషన్స్ సబ్మిట్ అన్ని దరఖాస్తుల్ని తిరస్కరిస్తుంది ఆర్ఆర్‌బీ. ఇక అంతకుముందే డిబార్ అయిన అభ్యర్థులు మళ్లీ అప్లై చేస్తే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఇలా అప్లికేషన్ రిజెక్ట్ కావడానికి అనేక కారణాలు ఉంటాయి.

  Jobs: హైదరాబాద్, వైజాగ్‌లోని బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో జాబ్స్... మరో 3 రోజులే ఛాన్స్

  Police Jobs: టెన్త్ పాసైనవారికి 1522 కానిస్టేబుల్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

  ఒకవేళ అన్ని వివరాలు సరిగ్గానే ఉన్నా దరఖాస్తు రిజెక్ట్ అయితే అభ్యర్థులు ఆర్ఆర్‌బీని సంప్రదించిన మళ్లీ వివరాలు అప్‌డేట్ చేయొచ్చు. ఈ వెసులుబాటు వల్ల పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోకుండా ఉంటారు. అందుకే ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసిన అభ్యర్థులందరూ తప్పనిసరిగా తమ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలి. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ, గ్రూప్ డీ పరీక్షలు డిసెంబర్ 15 నుంచి జరగనున్నాయి. పూర్తి షెడ్యూల్‌ను త్వరలో వెల్లడించనుంది బోర్డు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, Exams, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railway Apprenticeship, Railways, RRB

  ఉత్తమ కథలు