హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railways jobs: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన భారతీయ రైల్వే

Railways jobs: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన భారతీయ రైల్వే

Railways jobs: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన భారతీయ రైల్వే
(ప్రతీకాత్మక చిత్రం)

Railways jobs: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన భారతీయ రైల్వే (ప్రతీకాత్మక చిత్రం)

RRB NTPC CBT 1 | ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షలపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఈ ఎగ్జామ్స్‌పై క్లారిటీ ఇచ్చింది భారతీయ రైల్వే.

  రైల్వే ఉద్యోగం నిరుద్యోగుల కల. నిరుద్యోగుల ఆశలకు తగ్గట్టుగానే ప్రతీ ఏటా వేలాది పోస్టుల్ని భర్తీ చేస్తూ ఉంటుంది భారతీయ రైల్వే. ఇండియన్ రైల్వేస్‌కు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు-RRB వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా వేలాది పోస్టుల్ని భర్తీ చేస్తూ ఉంటుంది. గతేడాది ఆర్ఆర్‌బీ 35,208 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్-NTPC పోస్టులతో అతిపెద్ద నోటిఫికేషన్ సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌కు దేశవ్యాప్తంగా 1,26,30,885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారంతా ఏడాదిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఈపాటికి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీ 1 పూర్తయ్యేది. కానీ ఇంతలో కరోనా వైరస్ సంక్షోభం బ్రేక్ వేసింది. దీంతో నియామక ప్రక్రియకు ఆటంకాలు తప్పట్లేదు.

  మొత్తం 1,26,30,885 మంది అభ్యర్థులు ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్ష ఎప్పుడు ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కరోనా వైరస్ భయాలు నెలకొన్నాయి. సోషల్ డిస్టెన్సింగ్ ముఖ్యమైపోయింది. ఇలాంటి సమయంలో 1,26,30,885 మంది అభ్యర్థులకు పరీక్ష నిర్వహించడమనేది భారతీయ రైల్వేకు అతిపెద్ద సవాల్ కానుంది. ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చే అభ్యర్థుల సంఖ్యను తగ్గించాలని కాబట్టి ఎక్కువ సెంటర్లు కేటాయించాల్సి వస్తుంది. అంతేకాదు... పరీక్షా కేంద్రాల దగ్గర శానిటైజేషన్ లాంటివి తప్పనిసరి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆచరణ సాధ్యమైన వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నామని భారతీయ రైల్వే ప్రకటించింది.

  అయితే ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షలు ఎప్పుడు ఉంటాయన్న విషయాన్ని రైల్వే ప్రకటించలేదు. పరీక్షలకు సంబంధించిన సమాచారం అభ్యర్థులకు ఎస్ఎంఎస్, ఇమెయిల్‌లో అందుతుందని రైల్వే ప్రకటించింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే ఫాలో కావాలని రైల్వే సూచించింది. ఇక 2018 సంవత్సరానికి సంబంధించి 64,371 అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ పోస్టుల్ని విజయవంతంగా భర్తీ చేసినట్టు రైల్వే ప్రకటించింది.

  Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఇవి కూడా చదవండి:

  RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే...

  SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 431 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే


  Jobs: కేంద్రీయ కృషి వికాస్ సంస్థాన్‌లో 2167 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, Exams, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railway Apprenticeship, Railways, RRB

  ఉత్తమ కథలు