RRB NTPC Recruitment 2019 : RRB NTPC పోస్టుల సంఖ్య పెంపు.. అప్లై చేసినవారు ఇలా చేయండి..

RRB NTPC Recruitment 2019 | తాజాగా మళ్లీ 66 పోస్టులను పెంచుతున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది RRB. ఈ ప్రకటనతో 236 ఖాళీగా ఉన్న పోస్టులు 302కి చేరాయి. ఈ మార్పుకు సంబంధించిన సమాచారాన్ని అభ్యర్థులకు తెలియజేసేలా ఇప్పటికే ఈమెయిల్, ఎస్ఎమ్ఎస్ ద్వారా తెలియజేసినట్లు రైల్వే బోర్డు తెలిపింది. దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ కోసం rrbajmer.gov.in.అనే వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

news18-telugu
Updated: May 17, 2019, 1:07 PM IST
RRB NTPC Recruitment 2019 : RRB NTPC పోస్టుల సంఖ్య పెంపు.. అప్లై చేసినవారు ఇలా చేయండి..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 17, 2019, 1:07 PM IST
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఫిబ్రవరి 28న దేశంలోని వివిధ రైల్వేజోన్ల పరిధిలో నాన్ టెక్నికల్ పాపురల్ కేటగిరి(ఎన్టీపీసీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, ఇందులో ముందుగా 69 పోస్టులను తొలగిస్తున్నట్లు ఆర్‌ఆర్‌బీ ప్రకటించింది. తాజాగా ఇప్పుడు మళ్లీ 66 పోస్టులను పెంచుతున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటనతో 236 ఖాళీగా ఉన్న పోస్టులు 302కి చేరాయి. ఈ మార్పుకు సంబంధించిన సమాచారాన్ని అభ్యర్థులకు తెలియజేసేలా ఇప్పటికే ఈమెయిల్, ఎస్ఎమ్ఎస్ ద్వారా తెలియజేసినట్లు రైల్వే బోర్డు తెలిపింది. దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ కోసం rrbajmer.gov.inఅనే వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దీనికనుగుణంగా ఈ రీజియన్ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థులు ప్రిఫరెన్స్ మార్చుకోవాల్సి ఉంటుంది.

అఫిషియల్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పోస్టుల భర్తీ కోసం మార్చి 1నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమై ఏప్రిల్ 12 వరకూ కొనసాగింది. ఈ పోస్టుల భర్తీకి సంబందించిన CBT ఎగ్జామ్ త్వరలోనే జరగనుంది. ఈ పరీక్ష జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో జరగునుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...