రైల్వే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. 35,277 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ(NTPC) పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్(RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలోని నిరుద్యోగులంతా ఈ నోటిఫికేషన్ కోసం వారం రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తం 1,30,000 పోస్టుల్ని భర్తీ చేస్తామని ఆర్ఆర్‌బీ ప్రకటించింది. ఇప్పుడు 35,277 NTPC పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. అన్ని రీజియన్ల RRB అధికారిక వెబ్‌సైట్లల్లో నోటిఫికేషన్ చూడొచ్చు. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రెయిన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ అప్రెంటీస్, స్టేషన్ మాస్టర్‌తో పాటు ఇతర పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. విద్యార్హతలు, పోస్టుల వివరాల కోసం కింద ఉన్న టేబుల్ చూడండి.
Read this: Link PAN: బ్యాంక్ అకౌంట్‌కి పాన్ లింక్ చేస్తేనే ఐటీఆర్ రీఫండ్
మీరు ముందుగా ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలోనే NTPC నోటిఫికేషన్ లింక్ కనిపిస్తుంది.
NTPC నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేస్తే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, డీటెయిల్డ్ నోటిఫికేషన్ లింక్స్ కనిపిస్తాయి.
ముందుగా డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి పూర్తిగా చదవాలి.
ఆ తర్వాత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.
Read this: పవర్ బ్యాంక్ కొంటున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యే తేదీ: 01-03-2019
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగింపు: 31-03-2019
అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ...
1.ఆన్‌లైన్ (Net Banking/ Credit Card/ Debit Card/UPI)- 05.04.2019
2. ఎస్‌బీఐ చాలాన్: 05.04.2019 మధ్యాహ్నం 3 గంటల వరకు.
3. పోస్ట్ ఆఫీస్ చాలాన్: 05.04.2019 మధ్యాహ్నం 3 గంటల వరకు.
అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ: 12.04.2019 అర్థరాత్రి 23.59 గంటల వరకు.
Read this: Personal Finance: క్రెడిట్ కార్డులు ఎక్కువున్నాయా? సిబిల్ స్కోర్‌కు ముప్పేనా?
ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టులకు తగిన అర్హతలు ఉంటేనే అప్లై చేయాలి.
అభ్యర్థులు ఏదైనా ఒక ఆర్ఆర్‌బీ రీజియన్ మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది.
మీరు ఒకటి కన్నా ఎక్కువ ఆర్ఆర్‌బీలు ఎంచుకుంటే అప్లికేషన్ తిరస్కరించబడుతుంది.
దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదువుకోవాలి.
ఈ ఏడాది మొత్తం 1,30,000 ఖాళీలను ఆర్ఆర్‌బీ భర్తీ చేయనుంది. అందులో 1,00,000 లెవెల్-1 పోస్టులు. మిగతా 30,000 వేర్వేరు కేటగిరీల పోస్టులు. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ(NTPC), పారామెడికల్ స్టాఫ్, మినిస్టీరియల్‌తో పాటు వేర్వేరు కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేయనుంది ఆర్ఆర్‌బీ. NTPC పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన RRB... పారామెడికల్ స్టాఫ్ పోస్టులకు మార్చి 4న, ఆర్ఆర్‌బీ మినిస్టీరియల్, ఇతర కేటగిరీల ఖాళీలకు మార్చి 8న, ఆర్ఆర్‌బీ లెవెల్-1 పోస్టులకు మార్చి12న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తుంది. పారామెడికల్ స్టాఫ్‌లో స్టాఫ్ నర్స్, హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్, ఫార్మాసిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ సూపరింటెండెంట్ లాంటి పోస్టులు, ఆర్ఆర్‌బీ మినిస్టీరియల్, ఇతర కేటగిరీల్లో స్టెనోగ్రాఫర్, చీఫ్ లా అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేటర్(హిందీ) పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు.
Photos: రెడ్‌మీ నోట్ 7 ప్రో రిలీజ్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
PM-Kisan scheme: ఏప్రిల్ 1న రైతుల అకౌంట్‌లోకి మరో రూ.2,000... ఆధార్ తప్పనిసరి కాదు
LIC-IDBI: ఇక ఐడీబీఐ బ్యాంకుల్లో ఎల్ఐసీ పాలసీలు, ప్రీమియం చెల్లింపులు
FAME II Scheme: ఎలక్ట్రిక్ కార్లు, బైకులకు భారీ సబ్సిడీ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.