RRB NTPC Jobs: రైల్వే జాబ్స్... సికింద్రాబాద్‌ జోన్‌లో 3234 పోస్టుల వివరాలు...

RRB NTPC Recruitment 2019 | మొత్తం 1,30,000 పోస్టుల్ని భర్తీ చేస్తామని ఆర్ఆర్‌బీ ప్రకటించింది. ఇప్పుడు 35,277 NTPC పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. అన్ని రీజియన్ల RRB అధికారిక వెబ్‌సైట్లల్లో నోటిఫికేషన్ చూడొచ్చు... సికింద్రాబాద్ జోన్‌లో మొత్తం 3234 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 14, 2019, 9:56 PM IST
RRB NTPC Jobs: రైల్వే జాబ్స్... సికింద్రాబాద్‌ జోన్‌లో 3234 పోస్టుల వివరాలు...
ఇండియన్ రైల్వేస్
  • Share this:
RRB NTPC Notification:  రైల్వే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త అంటూ ఏకంగా లక్షా 30 వేల పోస్టుల భర్తీ చేయబోతున్నట్టు ప్రకటించింది రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్టు (RRB). ఇందులో భాగంగా తొలి విడగా నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలో (NTPC) 35,277 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని నిరుద్యోగులంతా ఈ నోటిఫికేషన్ కోసం చాలా రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తం 1,30,000 పోస్టుల్ని భర్తీ చేస్తామని ఆర్ఆర్‌బీ ప్రకటించింది. ఫిబ్రవరి 28నే ఈ నోటిఫికేషన్ విడుదలవుతుందని ప్రకటించినా...దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఓ రోజు ఆలస్యంగా 35,277 NTPC పోస్టుల నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 1న రాత్రి విడుదలైన ఈ నోటిఫికేషన్‌కు అప్లై చేద్దామని ఆతృతగా ఓపెన్ చేసిన వారికి నిరాశే ఎదురైంది. ముందుగా 4 గంటలకు నోటిఫికేషన్ వస్తుందని ప్రకటించిన అధికారులు, ఆ తర్వాత 6 గంటలకని టైమ్ మార్చారు. ఆరు దాటి, ఎనిమిది, తొమ్మిది అయినా అదే టైమ్ చూపించడంతో నిరుత్సాహానికి గురి అయ్యారు యువత.

అన్ని రీజియన్ల RRB అధికారిక వెబ్‌సైట్లల్లో నోటిఫికేషన్ చూడొచ్చని ప్రకటించింది ఆర్‌ఆర్బీ. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రెయిన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ అప్రెంటీస్, స్టేషన్ మాస్టర్‌తో పాటు ఇతర పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. విద్యార్హతలు, పోస్టుల వివరాలను విడుదల చేసింది. అయితే సికింద్రాబాద్ జోన్‌లో ఉన్నది 3234 పోస్టులే. అంటే పూర్తి నోటిఫికేషన్‌లో ఇది 10 శాతం కంటే తక్కువే. అందులోనూ వివిధ కేటగిరీల్లో పోగా ఒక్కో పోస్టుకు వందల మంది పోటీపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

RRB NTPC Notification 2019 released, 35,277 NTPC posts Secunderabad Zone, rrb new jobs, ntpc railway recruitment 2019, Railway Recruitment Board, Junior Clerk cum Typist, Accounts Clerk cum Typist, Trains Clerk, Commercial cum Ticket Clerk, Traffic Assistant, Goods Guard, Senior Commercial cum Ticket Clerk, Senior Clerk cum Typist, Junior Account Assistant cum Typist, Commercial Apprentice, Station Master, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్, ఆర్ఆర్‌బీ లెవెల్-1, నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ, ఎన్‌టీపీసీ, పారామెడికల్ స్టాఫ్, మినిస్టీరియల్‌, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రెయిన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ అప్రెంటీస్, స్టేషన్ మాస్టర్‌
రైల్వే రిక్రూట్‌‌మెంట్ బోర్డు

సికింద్రాబాద్ జోన్‌లో ఉన్న మొత్తం పోస్టులు వివరాలు ఇవి...
గ్రూప్ ఏ: అర్హత ఇంటర్/తత్సమానం RRB NTPC 2019 Job Vacancy
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 130 పోస్టులు
అకౌంట్స్ క్లర్ కమ్ టైపిస్ట్ (లెవెల్ 2): 66 పోస్టులుజూనియర్ టైమ్ కీపర్ (లెవెల్ 2): ఖాళీలు లేవు
ట్రైన్స్ క్లర్ (లెవెల్ 2): 29 పోస్టులు
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్ (లెవెల్ 3): 630 పోస్టులు

గ్రూప్ బీ: అర్హత డిగ్రీ/తత్సమానం RRB NTPC 2019 Job Vacancy
ట్రాఫిక్ అసిస్టెంట్ (లెవెల్ 4): ఖాళీలు లేవు
గూడ్స్ గార్డ్ (లెవెల్ 5): 858 పోస్టులు
సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్ (లెవెల్ 5): 466 పోస్టులు
సీనియర్ క్లర్ కమ్ టైపిస్ట్ (లెవెల్ 5): 124 పోస్టులు
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (లెవెల్ 5): 89 పోస్టులు
సీనియర్ టైమ్ కీపర్ (లెవెల్ 5): ఖాళీలు లేవు
కమర్షియల్ అప్రెంటిస్ (లెవెల్ 6): ఒక్క పోస్టు
స్టేషన్ మాస్టర్ (లెవెల్ 6): 841 పోస్టులు

RRB NTPC Notification: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగింపు: 31-03-2019
అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 05.04.2019
RRB NTPC Notification 2019 released, 35,277 NTPC posts Secunderabad Zone, rrb new jobs, ntpc railway recruitment 2019, Railway Recruitment Board, Junior Clerk cum Typist, Accounts Clerk cum Typist, Trains Clerk, Commercial cum Ticket Clerk, Traffic Assistant, Goods Guard, Senior Commercial cum Ticket Clerk, Senior Clerk cum Typist, Junior Account Assistant cum Typist, Commercial Apprentice, Station Master, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్, ఆర్ఆర్‌బీ లెవెల్-1, నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ, ఎన్‌టీపీసీ, పారామెడికల్ స్టాఫ్, మినిస్టీరియల్‌, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రెయిన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ అప్రెంటీస్, స్టేషన్ మాస్టర్‌
దేశంలో అతిపెద్ద నెట్‌వర్క్‌గా రికార్డు క్రియేట్ చేసింది ఇండియన్ రైల్వే...

ఈ ఏడాది మొత్తం 1,30,000 ఖాళీలను ఆర్ఆర్‌బీ భర్తీ చేయనుంది. అందులో 1,00,000 లెవెల్-1 పోస్టులు. మిగతా 30,000 వేర్వేరు కేటగిరీల పోస్టులు. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ(NTPC), పారామెడికల్ స్టాఫ్, మినిస్టీరియల్‌తో పాటు వేర్వేరు కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేయనుంది ఆర్ఆర్‌బీ. NTPC పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన RRB... పారామెడికల్ స్టాఫ్‌ పోస్టులకు మార్చి 4న, ఆర్ఆర్‌బీ మినిస్టీరియల్, ఇతర కేటగిరీల ఖాళీలకు మార్చి 8న, ఆర్ఆర్‌బీ లెవెల్-1 పోస్టులకు మార్చి12న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తుంది. పారామెడికల్ స్టాఫ్‌లో స్టాఫ్ నర్స్, హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్, ఫార్మాసిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ సూపరింటెండెంట్ లాంటి పోస్టులు, ఆర్ఆర్‌బీ మినిస్టీరియల్, ఇతర కేటగిరీల్లో స్టెనోగ్రాఫర్, చీఫ్ లా అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేటర్(హిందీ) పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు.
Published by: Ramu Chinthakindhi
First published: March 14, 2019, 9:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading