RRB NTPC Exams: మొత్తం 35,277 ఎన్‌టీపీసీ పోస్టులు... పరీక్ష తేదీలపై సస్పెన్స్

RRB NTPC Recruitment 2019 Exam Date | మొత్తం 35,277 ఎన్‌టీపీసీ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఆర్ఆర్‌బీ. వాటిలో 10,628 ఇంటర్ లేదా 12వ తరగతి పాసైనవారికి, 24,649 పోస్టుల్ని డిగ్రీ పాసైనవారికి కేటాయించింది.

news18-telugu
Updated: September 12, 2019, 3:04 PM IST
RRB NTPC Exams: మొత్తం 35,277 ఎన్‌టీపీసీ పోస్టులు... పరీక్ష తేదీలపై సస్పెన్స్
RRB NTPC Exams: మొత్తం 35,277 ఎన్‌టీపీసీ పోస్టులు... పరీక్ష తేదీలపై సస్పెన్స్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB ఈ ఏడాది మార్చిలో 35,277 నాన్ టెక్నికల్ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్-NTPC పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అంతా షెడ్యూల్ ప్రకారం జరిగిపోయి ఉంటే ఈపాటికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-1 పూర్తవ్వాల్సింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఎన్‌టీపీసీ సీబీటీ-1 పరీక్షలు ఉంటాయని నోటిఫికేషన్‌లో వెల్లడించింది ఆర్ఆర్‌బీ. కానీ ఇప్పటివరకు ఎన్‌టీపీసీ సీబీటీ-1 నిర్వహించలేదు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్. కనీసం పరీక్ష తేదీలను కూడా ప్రకటించలేదు. అయితే ఈ పరీక్ష తేదీలు ఇంకా ఆలస్యం కావచ్చన్న వార్తలొస్తున్నాయి. అయితే ఎన్‌టీపీసీ సీబీటీ-1 షెడ్యూల్‌పై ఆర్ఆర్‌బీ అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ప్రస్తుతం ఆర్ఆర్‌బీ జేఈ, ఆర్ఆర్‌బీ ఏఎల్‌పీ టెక్నీషియన్ పరీక్షల నిర్వహణలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు బిజీగా ఉంది. ఈ పరీక్షలు పూర్తయ్యాక అంటే అక్టోబర్‌లో ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీ-1 నిర్వహించే అవకాశాలున్నాయి. ఒకవేళ అక్టోబర్‌లో పరీక్షలు నిర్వహించేటట్టైతే సెప్టెంబర్ చివరి వారంలోనే ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ 2019 అడ్మిట్ కార్డులు విడుదలయ్యే అవకాశముంది.

Read This: RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే...

మొత్తం 35,277 ఎన్‌టీపీసీ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఆర్ఆర్‌బీ. వాటిలో 10,628 పోస్టుల్ని ఇంటర్ లేదా 12వ తరగతి పాసైనవారికి, 24,649 పోస్టుల్ని డిగ్రీ పాసైనవారికి కేటాయించింది. ఆర్ఆర్‌బీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్, కమర్షియల్ అప్రెంటీస్ అండ్ స్టేషన్ మాస్టర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్.

Photos: రిలయెన్స్ ట్రెండ్స్‌ ప్రారంభోత్సవంలో రకుల్ ప్రీత్ సింగ్ సందడి



ఇవి కూడా చదవండి:

RRB Alert: రైల్వే ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు... ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీRailway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి...

DRDO Jobs: డీర్‌డీఓలో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ
Published by: Santhosh Kumar S
First published: September 12, 2019, 12:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading