Home /News /jobs /

RRB NTPC EXAMS STAGE 2 BEGINS KNOW WHATS NEXT FOR RAILWAY RECRUITMENT PROCESS KNOW HERE GH VB

RRB NTPC: ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ స్టేజ్‌ 2 పరీక్షలు ప్రారంభం.. రిక్రూట్‌మెంట్‌ తర్వాత దశ ఏంటో తెలుసుకోండి..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నిర్వహిస్తున్న RRB NTPC రెండవ దశ పరీక్ష మే 9 నుంచి ప్రారంభమైంది. పరీక్షలు మే 10న ముగుస్తాయి. పే లెవల్ 6, 4 గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT)ను బోర్డు నిర్వహిస్తోంది.

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నిర్వహిస్తున్న RRB NTPC రెండవ దశ పరీక్ష మే 9 నుంచి ప్రారంభమైంది. పరీక్షలు మే 10న ముగుస్తాయి. పే లెవల్ 6, 4 గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT)ను బోర్డు నిర్వహిస్తోంది. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (NTPC)లో టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్, ట్రైన్స్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, స్టేషన్ మాస్టర్ మొదలైన వాటితో సహా 35,281 ఖాళీ పోస్టులను రిక్రూట్ చేయడానికి ఈ పరీక్ష జరుగుతోంది. ఈ ఖాళీలు వివిధ జోనల్ రైల్వేలు(Zonal Railways), భారతీయ రైల్వేల(Indian Railway) ఉత్పత్తి యూనిట్లలో ఉన్నాయి.

* 1.26 కోట్ల మంది దరఖాస్తు
RRB NTPC పరీక్షకు 1.26 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొదటి దశ లేదా CBT 1లో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే రెండవ స్థాయికి చేరుకోగలరు. రెండవ దశను క్లియర్ చేసిన తర్వాత, అభ్యర్థులు ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్‌కు హాజరు కావాలి. తుది ఎంపిక కోసం అభ్యర్థులు తప్పనిసరిగా RRB NTPC CBT-2 పరీక్ష అన్ని దశలలో అర్హత సాధించాల్సి ఉంటుంది.

పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి, అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులను స్కోర్ చేయాలి. అయితే OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు కనీసం 30 శాతం మార్కులు అవసరం, SC అభ్యర్థులకు కూడా కనీస మార్కులు 30 శాతం, ST అభ్యర్థులకు 25 శాతం అవసరం. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రిజర్వ్ చేసిన ఖాళీల భర్తీ కాకపోతే పీడబ్ల్యూబీడీ అర్హత కోసం ఈ మార్కుల శాతాలు 2 శాతం సడలించే అవకాశం ఉంది.

Defence Job Aspirants: ఉద్యోగాల భర్తీకి డిమాండ్‌.. ట్విట్టర్‌లో ‘#జస్టిస్ ఫర్ డిఫెన్స్ స్టూడెంట్స్’ యాష్ ట్యాగ్‌ ట్రెండింగ్‌!


* వెరిఫికేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్స్
ప్రవేశానికి ఒరిజినల్‌ ID, అడ్మిట్ కార్డ్ తీసుకెళ్లాలి. పుట్టిన తేదీ రుజువుకు ఆధారం, విద్యార్హత మార్కు షీట్ (10వ/12వ/గ్రాడ్యుయేషన్)లు, కుల ధృవీకరణ పత్రాలు (SC/ST/OBC), మైనారిటీ కమ్యూనిటీ డిక్లరేషన్ (అనుబంధం-V), ఆదాయ ధ్రువీకరణ పత్రం, PWD ప్రూఫ్ సర్టిఫికెట్లు, ఎక్స్-సర్వీస్‌మెన్ సర్టిఫికెట్లు (వర్తిస్తే), ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటే NOC(నో అబ్జెక్షన్ సర్టిఫికేట్), 12 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ట్రాఫిక్ అప్రెంటిస్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మెడికల్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలి.

రెండు దశలు అవసరం..
RRB NTPC 2022 రెండో దశ పరీక్షా సరళిలో జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి 50 ప్రశ్నలు, గణితం, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, రీజనింగ్‌, మేధస్సు నుంచి ఒక్కొక్కటి 35 ప్రశ్నలు ఉంటాయి. వీటికి మొత్తం 90 నిమిషాల సమయం ఉంటుంది. RRB NTPC CBT 2 కట్ ఆఫ్ జోన్ వారీగా ఉంటుంది. RRB NTPC స్టేజ్ 1 పరీక్షలు 2020 డిసెంబర్ 28 నుంచి 2021 జూలై 15 వరకు ఏడు దశల్లో నిర్వహించారు. దాదాపు 35,000 ఖాళీల నియామకాల కోసం పరీక్షలు జరిగాయి. దాదాపు 1 కోటి మంది ఉద్యోగార్ధులలో దాదాపు 2.25 లక్షల మంది అభ్యర్థులు CBT-1 పరీక్షలో విజయం సాధించినట్లు ప్రకటించారు.

ఇంతకు ముందు RRB పరీక్ష సింగిల్ ఫేజ్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియగా ఉండేది. అయితే గత ఏడాది మాత్రమే భారతీయ రైల్వే దీనిని రెండు దశల ప్రక్రియకు మార్చింది. దీంతో అభ్యర్థుల నుంచి నిరసన వ్యక్తమైంది. FAQలను (తరచుగా అడిగే ప్రశ్నలు) జారీ చేస్తూ, కోటి కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు ఉన్న సందర్భంలో, అర్హులను ఎంపిక చేసేందుకు రెండు-దశల CBT అవసరమని ప్రభుత్వం వివరించింది.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, India Railways, Railway recruitment, Rrb ntpc

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు