లక్షలాది మంది పోటీ పడే పరీక్షలలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ (RRB NTPC) పరీక్ష ఒకటి, ఇందులో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB లు) వివిధ స్థాయిల పరీక్షల ద్వారా నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) పోస్టులలో ఖాళీలను భర్తీ చేయడానికి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. కాగా, ఇపుడు ఆర్ఆర్బీ పరీక్ష రాసిన అభ్యర్థులకు బోర్డు తీపి కబురు అందించింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు RRB NTPC పరీక్ష రాసిన వారికి ఫీజు రీఫండ్‌ను ప్రారంభించాయి. CEN 01/2019లో హామీ ఇచ్చినట్లుగా, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) CBT స్టేజ్ 1 పరీక్షకు హాజరైన అభ్యర్థులకు దరఖాస్తు రుసుమును తిరిగి చెల్లిస్తోంది. అభ్యర్థులు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలలో ఫీజు మొత్తాన్ని పొందుతారు. ఫీజు రీఫండ్ నోటీసులో వివిధ చెల్లింపు పద్దతులు ఇచ్చారు. అభ్యర్థులు తమ సంబంధిత ఖాతాలలో రైల్వే NTPC ఫీజు రీఫండ్ అందుకోవడానికి బ్యాంకు వివరాలను సమర్పించాలి. చాలామంది ఏదైనా ఇంటర్నెట్ సెంటర్లో అప్లికేషన్ ఫీజు చెల్లించి ఆర్ఆర్బీ పరీక్ష రాసి ఉంటారు. దీనిపై కూడా ఆర్ఆర్బీ క్లారిటీ ఇచ్చింది. ఒకే అకౌంట్ నుంచి చాలా మంది ఆర్ఆర్బీ పరీక్ష ఫీజు చెల్లించారని, అటువంటి అభ్యర్థులు తాజాగా వారి వివరాలతో కొత్త బ్యాంకు ఖాతా ఇవ్వొచ్చని పేర్కొంది. రీఫండ్ డబ్బులు తాజా అకౌంట్‌కు పంపించబడుతాయని తెలిపారు.
ఈ మేరకు ఆర్ఆర్బీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘CBT-1 కి హాజరైన అభ్యర్థులందరూ పరీక్ష ఫీజు రీఫండ్ పొందడానికి వారి బ్యాంక్ ఖాతా వివరాలను అందించాలి. వారి బ్యాంక్ ఖాతా నంబర్, పేరు, IFSC కోడ్ అందించాలి. అయితే ఒకసారి బ్యాంకు ఖాతా వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత బ్యాంక్ వివరాలను సవరించడం సాధ్యం కాదు ”అని ఆర్ఆర్బీ నోటీసులో పేర్కొంది. RRB అధికారిక వెబ్‌సైట్లలో ‘అప్‌డేట్ బ్యాంక్ అకౌంట్ లింక్’ అందించనున్నారు. ఇది ఆగస్టు 11వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 31 వతేదీ 11.59 PM వరకు అందుబాటులో ఉంటుంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు రీఫండ్‌కు వారి బ్యాంక్ ఖాతా వివరాలు అందించడానికి వారు గతంలో ఇచ్చిన ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌కు ఆర్ఆర్బీ SMS, ఈ మెయిల్ లింకు రూపంలో పంపుతుంది. బ్యాంకు ఖాతా వివరాలు ఎంటర్ చేయడంలో సమస్యలు ఎదురైతే అలాంటి వారు ఆర్ఆర్బీ హెల్ప్‌లైన్ సెంటర్లో సమస్యను పరిష్కరించుకోగలరు.
నియమ, నిబంధనలు..
Based Test (CBT-1) మొదటి దశ ఆర్ఆర్బీ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వారి పరీక్ష ఫీజు రీఫండ్ పొందడానికి అర్హులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.