RRB NTPC 2019: ఎన్‌టీపీసీ పరీక్ష ఎప్పుడు? క్లారిటీ ఇవ్వని ఆర్ఆర్‌బీ

RRB NTPC 2019 | ఎన్‌టీపీసీ పరీక్షలకు సంబంధించి ఆర్ఆర్‌బీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.

news18-telugu
Updated: June 18, 2019, 4:15 PM IST
RRB NTPC 2019: ఎన్‌టీపీసీ పరీక్ష ఎప్పుడు? క్లారిటీ ఇవ్వని ఆర్ఆర్‌బీ
RRB NTPC 2019: ఎన్‌టీపీసీ పరీక్ష ఎప్పుడు? క్లారిటీ ఇవ్వని ఆర్ఆర్‌బీ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: June 18, 2019, 4:15 PM IST
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ కొంతకాలం క్రితం జారీ చేసిన నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్-NTPC పరీక్షల తేదీలపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. మొత్తం 35,277 ఎన్‌టీపీసీ పోస్టుల భర్తీ కోసం మార్చి 1న నోటిఫికేషన్ జారీ చేసింది ఆర్ఆర్‌బీ. మార్చి 31న దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. 69 పోస్టుల్ని తగ్గించి మళ్లీ 66 పోస్టుల్ని కలిపింది ఆర్ఆర్‌బీ. మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ పరీక్ష జూన్‌ నుంచి సెప్టెంబర్ మధ్య ఉండొచ్చని ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. గత నెలలో ఆర్ఆర్‌బీ జేఈ పోస్టులకు మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించింది ఆర్ఆర్‌బీ. జూన్‌లో ఎన్‌టీపీసీ పరీక్షలు ఉంటాయని అభ్యర్థులు ఎదురుచూశారు. కానీ ఎన్‌టీపీసీ పరీక్షలకు సంబంధించి ఆర్ఆర్‌బీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.

Read this: RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే...

ఆర్ఆర్‌బీ జేఈ పరీక్షలు ముగిసిన వెంటనే ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్ ఉండొచ్చని అనుకున్నారు. కానీ జూన్ 26 నుంచి జూన్ 28 వరకు జేఈ రీషెడ్యూల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. వీటి తర్వాత ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్ ఉండొచ్చని అంచనా. పరీక్షకు కనీసం 15-20 రోజుల ముందే అడ్మిట్ కార్డులు రిలీజ్ చేస్తుంది ఆర్ఆర్‌బీ. ఇప్పటి వరకు ఎన్‌టీపీసీ పరీక్షల అడ్మిట్ కార్డులకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ఇక జూన్‌లో పరీక్షలు ఉండకపోవచ్చని తెలుస్తోంది. జూలైలో ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఉండొచ్చని అభ్యర్థులు భావిస్తున్నా... దీనిపై ఆర్ఆర్‌బీ నుంచి క్లారిటీ మాత్రం లేదు.

35 వేలకు పైగా పోస్టులకు లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని అంచనా. రెండు దశల్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు నిర్వహించి అభ్యర్థుల్ని ఎంపిక చేయనున్నారు. ఆ తర్వాత మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.



Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Photos: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సిద్ధమవుతున్న ప్రపంచం

Loading...
ఇవి కూడా చదవండి:

IBPS RRB Jobs: 12,000 పైగా ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

ISRO Jobs: ఇస్రోలో టెక్నీషియన్ పోస్టులు... రూ.69,100 వరకు జీతం

Railway Jobs: ఆగ్నేయ మధ్య రైల్వేలో 432 ఉద్యోగాలు
First published: June 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...