• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • RRB NTPC EXAM 2019 RAILWAY RECRUITMENT BOARD NTPC EXAM DATES WILL RELEASE AFTER RRB JE EXAM CHECK FOR NTPC POSTS AND SALARY DETAILS SS

RRB NTPC Exam 2019: త్వరలో ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్... పోస్టులు, వేతనాల వివరాలివే

RRB NTPC Exam 2019: త్వరలో ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్... పోస్టులు, వేతనాల వివరాలివే

RRB NTPC Exam 2019: త్వరలో ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్... పోస్టులు, వేతనాల వివరాలివే

RRB NTPC Exam 2019 | ఆర్ఆర్‌బీ జేఈ పరీక్షలు ముగిసిన నెలరోజుల్లోపే ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షల తేదీలు ప్రకటించే అవకాశముంది. కాబట్టి ఎన్‌టీపీసీ పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు అప్‌డేట్స్ విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది.

  • Share this:
    రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఇటీవల విడుదల చేసిన నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్-NTPC పరీక్షకు దరఖాస్తు చేశారా? అయితే మీకు శుభవార్త. త్వరలో ఎన్‌టీపీసీ మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది ఆర్ఆర్‌బీ. మొత్తం 35277 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఆర్ఆర్‌బీ. ఆ తర్వాత 69 పోస్టుల్ని తగ్గించింది. మళ్లీ 66 పోస్టుల్ని కలిపింది. ఈ పోస్టుల కోసం లక్షలాది మంది దరఖాస్తు చేశారు. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఎగ్జామ్స్ ఎప్పుడు అన్న స్పష్టత లేదు. అయితే మే 22 నుంచి ఆర్ఆర్‌బీ జూనియర్ ఇంజనీర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఆర్ఆర్‌బీ జేఈ పరీక్షలు ముగిసిన నెలరోజుల్లోపే ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షల తేదీలు ప్రకటించే అవకాశముంది. కాబట్టి ఎన్‌టీపీసీ పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు అప్‌డేట్స్ విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది.

    Read this: RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే...

    ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ రిక్రూట్‌మెంట్‌లో ఉద్యోగం సాధించినవారికి 7వ పే కమిషన్ వర్తిస్తుంది. వేర్వేరు జోనల్ రైల్వేస్, ప్రొడక్షన్ యూనిట్స్‌లో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్స్‌ని సెలెక్ట్ చేయనున్నారు. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పోస్టులు, వేతనాల వివరాలు ఇవే...

    RRB NTPC recruitment 2019: అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు, వేతనాలు


    జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 4300 పోస్టులు... వేతనం రూ.19900
    అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 760 పోస్టులు... వేతనం రూ.19900
    జూనియర్ టైమ్ కీపర్- 11 పోస్టులు... వేతనం రూ.19900
    ట్రెయిన్స్ క్లర్క్- 592 పోస్టులు... వేతనం రూ.19900
    కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్- 4940 పోస్టులు... వేతనం రూ.21700

    RRB NTPC recruitment 2019: గ్రాడ్యుయేట్ పోస్టులు, వేతనాలు


    ట్రాఫిక్ అసిస్టెంట్- 88 పోస్టులు... వేతనం రూ.25500
    గూడ్స్ గార్డ్- 5748 పోస్టులు... వేతనం రూ.29200
    సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్- 5638 పోస్టులు... వేతనం రూ.29200
    సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 2854 పోస్టులు... వేతనం రూ.29200
    జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్- 3147 పోస్టులు... వేతనం రూ.29200
    సీనియర్ టైమ్ కీపర్- 6 పోస్టులు... వేతనం రూ.29200
    కమర్షియల్ అప్రెంటీస్- 259 పోస్టులు... వేతనం రూ.35400
    స్టేషన్ మాస్టర్- 6865 పోస్టులు... వేతనం రూ.35400

    Job News: మరిన్ని జాబ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలను ఇక్కడ చెక్ చేసుకోండి


    ఇవి కూడా చదవండి:

    RRB: రైల్వే జాబ్‌కు అప్లై చేస్తున్నారా? ఆధార్ తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ

    Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి...

    RRB: రైల్వే జాబ్‌కు అప్లై చేశారా? జాగ్రత్త అంటున్న ఆర్ఆర్‌బీ

     
    First published: