ఇటీవల విడుదలైన ఆర్‌ఆర్‌బి ఎన్‌టీపీసీ(NTPC), గ్రూప్ డి(Group D) ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తిన ఫిర్యాదులను పరిశీలించేందుకు భారతీయ రైల్వే కమిటీ(Indian Railway Committee) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ కమిటీ తన తుది నివేదికను రైల్వే శాఖకు సమర్పించింది. కమిటీ నివేదిక ప్రకారం, ఆర్ఆర్బీ ఎన్‌టీపీసీ మొత్తం ఖాళీల్లో ప్రతి ఖాళీకి 20 మంది చొప్పున అభ్యర్థులను సీబీటీ–2కి షార్ట్‌లిస్ట్ చేసింది. ఇప్పటికే, షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు క్వాలిఫైడ్‌గా(Qualified) కొనసాగుతారని తెలిపింది. వీరితో పాటు కొత్తగా మరింత మంది అభ్యర్థులను షార్ట్‌లిస్ట్(Short list) చేయనున్నట్లు తెలిపింది. ఈ అదనపు అభ్యర్థుల జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అంతకుముందు, ఆర్ఆర్బీ ఎన్టీపీ సీబీటీ–2 పరీక్షకు మొత్తం 7 లక్షల మంది అభ్యర్థులు ఎంపికైనట్లు బోర్డు ప్రకటించింది. అయితే, 7 లక్షల అభ్యర్థులకు బదులుగా 7 లక్షల రోల్ నంబర్‌లను బోర్డు ఎంపిక చేసిందని అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపారు.
Telangana Jobs: నిరుద్యోగులకు మరో శుభవార్త.. పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్
ఈ విధానం ద్వారా ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైతే ఇతరులకు అవకాశాలను తగ్గిస్తుందని వాపోయారు. దీనిపై బీహార్, ఉత్తరప్రదేశ్‌లో పలు చోట్ల ఆందోళనలు కూడా జరిగాయి. కొంత మంది నిరసనకారులు బీహార్‌లో ఓ రైలు బోగీకి నిప్పుపెట్టారు. దీంతో, అభ్యర్థుల ఆందోళనకు దొగొచ్చిన రైల్వే బోర్డు ఎన్‌టీపీసీ ఫలితాలపై కమిటీని నియమించింది.
ఈ కమిటీ ఎట్టకేలకు నివేదికను సమర్పించింది. “ఆర్ఆర్బీ ఎన్‌టీపీసీ సీబీటీ–2 పరీక్షలో ఒకే పే లెవల్ పోస్టులకు పోటీపడే అభ్యర్థులందరికీ ఒకే షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహిస్తాం. ఇది నార్మలైజేషన్ సమస్యను తొలగిస్తుంది. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల సింగిల్ షిఫ్ట్ సాధ్యం కాని చోట, పర్సంటైల్ ఆధారిత నార్మలైజేషన్ విధానాన్ని అనుసరిస్తాం.”అని తాజా నోటీసులో పేర్కొంది.
ఏప్రిల్ మొదటి వారంలో సీబీటీ–1 సవరించిన ఫలితాలు..
ఇంకా, ఎన్‌టీపీసీ సీబీటీ–1కు సంబంధించి అన్ని పే లెవర్స్లో సవరించిన ఫలితాలను ఏప్రిల్ మొదటి వారంలోగా అంటే ఏప్రిల్ 7 వ తేదీలోపు విడుదల చేయనున్నట్లు ఆర్ఆర్బీ ప్రకటించింది. లెవల్-1 పోస్టులకు సంబంధించిన సీబీటీ–2ని జూలై నుంచి నిర్వహించాలని ఆర్ఆర్బీ యోచిస్తోంది. పే లెవల్ 6 కోసం 2వ దశ సీబీటీ పరీక్షను మేలో నిర్వహించనుంది.
ఇతర పే స్కేల్లో గల పోస్టులను ఆ తర్వాతి నెలల్లో నిర్వహించనుంది. ఒకే పే లెవల్ గల అభ్యర్థులకు సింగిల్ షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహించనున్నందున.. ఎక్కువ పరీక్షా కేంద్రాల అవసరం ఏర్పడుతుంది. తద్వారా అదనపు మౌలిక సదుపాయాలు, వసతులు ఏర్పాట్లపై ఆర్ఆర్బీ దృష్టి సారించింది. ఎన్‌టీపీసీ సీబీటీ–2 పరీక్షను వీలైనంత త్వరగా నిర్వహించేందుకు ఆర్ఆర్బీ ఏర్పాట్లు చేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.