హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RRB NTPC CBT-2: జనవరి 15న RRB NTPC CBT-1 ఫలితాలు.. ఫిబ్రవరిలో CBT-2 పరీక్షలు

RRB NTPC CBT-2: జనవరి 15న RRB NTPC CBT-1 ఫలితాలు.. ఫిబ్రవరిలో CBT-2 పరీక్షలు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

జనవరి 15న ఎన్​టీపీసీ సీబీటీ–1 ఫలితాలను వెల్లడిస్తామని ఆర్‌ఆర్‌బీ తెలిపింది. సీబీటీ–1లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఫిబ్రవరి 14 నుంచి 18 తేదీల్లో సీబీటీ–2 పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

నాన్​ టెక్నికల్ కేటగిరీ (ఎన్​టీపీసీ) పోస్టుల రిక్రూట్​మెంట్​కు సంబంధించి కీలక ప్రకటన చేసింది రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డ్ (ఆర్ఆర్​బీ). 2019లో విడుదలైన ఈ నోటిఫికేషన్​కు దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే మొదటి దశ కంప్యూటర్​ బేస్ట్ టెస్ట్ (సీబీటీ-1) పూర్తయింది. మొత్తం 7 ఫేజ్​లలో ఈ పరీక్షను నిర్వహించారు. అయితే కరోనా ఆంక్షల కారణంగా సీబీటీ-1 ప్రక్రియ పూర్తయ్యేందుకు దాదాపు రెండేళ్ల సమయం పట్టింది. ఎట్టకేలకు ఈ ఏడాది జులైలో సీబీటీ-1 ప్రక్రియను పూర్తి చేసింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు రెండో దశ కంప్యూటర్​ బేస్ట్ టెస్ట్ కోసం వేచి చూస్తున్నారు. అయితే సీబీటీ-1 పరీక్ష ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. దీనిలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మాత్రమే సీబీటీ-2 కు హాజరయ్యే అవకాశం ఉంటుంది.

ఈ పరీక్ష ఫలితాల కోసం వేచి చూస్తున్న వారికి గుడ్​న్యూస్​ చెప్పింది రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డ్​ (ఆర్​ఆర్​బీ). జనవరి 15న ఎన్​టీపీసీ సీబీటీ–1 ఫలితాలను వెల్లడిస్తామని తెలిపింది. సీబీటీ–1లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఫిబ్రవరి 14 నుంచి 18 తేదీల్లో సీబీటీ–2 పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అంటే ఫలితం ప్రకటించిన నెలలోపు సీబీటీ–2 పరీక్షలను ఆర్‌ఆర్‌బీ నిర్వహించనుంది. త్వరలోనే దీనికి సంబంధించి అడ్మిట్​ కార్డులను విడుదల చేస్తామని పేర్కొంది. అయితే ఈ పరీక్షల షెడ్యూల్​ దేశంలో కోవిడ్​–19 మహమ్మారి పరిస్థితులకు అనుగుణంగా ఉంటుందని, ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు లోబడి ఉంటుందని పేర్కొంది.

* కటాఫ్​ ఎలా ఉండనుంది?

రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డ్​లోని ప్రతి జోన్​కు కేటగిరీ వారీగా విడివిడిగా కటాఫ్​ నిర్ణయిస్తారు. జనరల్​ కేటగిరీ అభ్యర్థులకు 68 నుంచి 72 మార్కుల మధ్య కటాఫ్​ ఉండే అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థులకు 62 నుంచి 65 మధ్య, ఓబీసీ అభ్యర్థులకు 60 నుంచి 63, ఎస్సీ కేటగిరీకి 50 నుంచి 54, ఎస్టీ అభ్యర్థులకు 48 నుంచి 52 వరకు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

కాగా, జనవరి 15న విడుదలయ్యే సీబీటీ–1 ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు సీబీటీ–2 అడ్మిట్ కార్డులను విడుదల చేస్తారు. ఈ అడ్మిట్ కార్డ్​లను ఆర్​ఆర్​బీ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్​లోడ్​ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ వివరాలు ఎంటర్​ చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అయితే సీబీటీ-1 పరీక్ష ఫలితాలు, సీబీటీ-2 పరీక్ష షెడ్యూల్‌ కోసం అభ్యర్థులు అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Published by:Krishna Adithya
First published:

Tags: RRB

ఉత్తమ కథలు