ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సీబీటీ–2(RRB NTPC CBT-2)లో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షలో(Exam) మొత్తం 120 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 120 మార్కులు కేటాయించారు. తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది.
నాన్ టెక్నికల్ కేటగిరీ (NTPC) పోస్టులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB). 2019లో విడుదలైన ఈ నోటిఫికేషన్‌కు (Job Notification) దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT–1) పూర్తయ్యింది. కరోనా కారణంగా CBT–1 పూర్తయ్యేందుకు దాదాపు రెండేళ్ల సమయం పట్టింది. ఎట్టకేలకు ఈ ఏడాది జులైలో చివరి దశ CBT–1 ప్రక్రియను పూర్తి చేసింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. వారికి గుడ్‌న్యూస్ చెప్పింది ఆర్ఆర్బీ (RRB). జనవరి 15న సీబీటీ–1 ఫలితాలు విడుదల చేస్తామని తెలిపింది. పరీక్ష రాసిన మొత్తం అభ్యర్థులలో, దాదాపు 2.25 లక్షల మందిని సీబీటీ–2కు షార్ట్ లిస్ట్ చేస్తారు. వారు సీబీటీ–2 రాయాల్సి ఉంటుంది. ఆయా అభ్యర్థులకు ఫిబ్రవరి 14 నుంచి 18 మధ్య సీబీటీ–2 నిర్వహిస్తామని ఆర్ఆర్బీ పేర్కొంది.
సీబీటీ–2 పరీక్ష విధానం
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సీబీటీ–2లో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 120 మార్కులు కేటాయించారు. తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు, మ్యాథ్స్ నుంచి 35 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులు 90 నిమిషాల సమయంలో పరీక్షను పూర్తి చేయాలి. BEL Recruitment 2021: బీటెక్, ఎంటెక్ చేసిన వారికి శుభవార్త.. మచిలీపట్నం BELలో రూ.35 వేల వేతనంతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి
సీబీటీ–2 సిలబస్
మ్యాథ్స్ సెక్షన్ నుంచి నంబర్ సిస్టమ్స్, దశాంశాలు, భిన్నాలు, LCM, HCF, నిష్పత్తి, శాతాలు, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపోండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎలిమెంటరీ ఆల్జీబ్రా, జామెట్రీ వంటి టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సెక్షన్ నుంచి అనాలజీస్, అనలిటికల్, రీజనింగ్, సిలాజిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రమ్స్, పజిల్, డేటా సఫీషియన్సీ, నంబర్ అండ్ ఆల్ఫాబెటిక్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, రిలేషన్షిప్స్, స్టేట్మెంట్ కన్‌క్లూజన్, స్టేట్మెంట్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్, డెసిజన్ మేకింగ్, మ్యాప్స్, ఇంటర్‌ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్ మొదలైన టాపిక్స్ నుంచి ప్రశ్నలొస్తాయి. RRB NTPC CBT-2: జనవరి 15న RRB NTPC CBT-1 ఫలితాలు.. వివరాలివే
జనరల్ స్టడీస్ సెక్షన్ నుంచి జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రస్తుత సంఘటనలు, క్రీడలు, కళ & సంస్కృతి, సాహిత్యం, స్మారక చిహ్నం, భారతదేశంలోని ప్రదేశాలు, జనరల్ సైన్స్, చరిత్ర, భౌగోళికం, పాలిటీ గవర్నెన్స్, సైంటిఫిక్ డెవలప్మెంట్స్, బేసిక్ ఆఫ్ కంప్యూటర్, ఎకానమీ టాపిక్స్ నుంచి ప్రశ్నలొస్తాయి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.