Home /News /jobs /

RRB NTPC CBT 2 GROUP D PROTESTS RAILWAYS EXPLAIN NEED FOR SECOND CBT GH VB

RRB Group D-NTPC: రైల్వే అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన రైల్వే అధికారులు.. ఏం చెప్పారంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డు ఇటీవల నాన్​ టెక్నికల్ పాపులర్​ కేటగిరీ (ఎన్​టీపీసీ) ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆందోళనలు నిర్వహించారు.

రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డు(RRB) ఇటీవల నాన్​ టెక్నికల్ పాపులర్​ కేటగిరీ (NTPC) ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆందోళనలు నిర్వహించారు. మరోవైపు, గ్రూప్​ డీ పరీక్షను పాత నోటిఫికేషన్​లో పేర్కొన్నట్లుగానే ఒకే దశలో నిర్వహించాలని డిమాండ్​(Demand) చేశారు. 2019లో విడుదల చేసిన గ్రూప్​ డీ నోటిఫికేషన్​(Notification)లో సీబీటీ–1, ఫిజికల్​ టెస్ట్​ మాత్రమే నిర్వహిస్తామని పేర్కొనగా.. తాజా నోటిఫికేషన్​లో మాత్రం సీబీటీ–1, సీబీటీ–2 నిర్వహిస్తామని బోర్డు తెలిపింది. ఇప్పుడు ఇదే వివాదాస్పదంగా మారింది. దీనిపై అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Telangana Govt Jobs: తెలంగాణలో ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఈ రోజు నుంచే దరఖాస్తులు ప్రారంభం.. ఇలా అప్లై చేసుకోండి

గ్రూప్​ డీ పరీక్షను సింగిల్ ఫేజ్​లోనే(Single Phase) నిర్వహించాలని.. మరో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)ని జోడించడం వల్ల అక్రమాలు జరిగే అవకాశం ఉందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీంతో, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్​ఆర్​బీ) ప్రస్తుతానికి గ్రూప్​ డీ పరీక్షల నిర్వహణను నిలిపివేసింది. సీబీటీ–2 ఎందుకు జోడించామనే దానిపై వివరణ ఇచ్చింది. గ్రూప్​ డీ పరీక్షకు దాదాపు కోటి మందికి పైగా దరఖాస్తు చేసుకున్న సందర్భంలో అభ్యర్థులను ఫిల్టర్​ చేయడానికి రెండు దశల్లో పరీక్ష నిర్వహించక తప్పదని రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డు వివరణ ఇచ్చింది.

సీబీటీ–2 నిర్వహించకూడదని ఆందోళనలు..
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ మాన్యువల్ ప్రకారం, మొదటి దశ కంప్యూటర్​ బేస్డ్ టెస్ట్​ ద్వారా అభ్యర్థులను ప్రాథమిక స్క్రీనింగ్ చేస్తారు. సీబీటీ–1 కటాఫ్​ మార్కుల ఆధారంగా సీబీటీ–2కు ఎంపిక చేస్తారు. సీబీటీ–2 మార్కుల ఆధారంగా ఫైనల్​ సెలక్షన్​ ఉంటుంది. ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ పరీక్షకు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇప్పటికే, ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ–1 పరీక్ష పూర్తై ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ప్రతి పోస్టుకు 20 మంది చొప్పున అభ్యర్థులను సీబీటీ–2కు షార్ట్​లిస్ట్​ చేశారు. ఇలా, దాదాపు 7 లక్షల మంది అభ్యర్థులు సీబీటీ–2కు హాజరుకానున్నారు.

DRDO Recruitment 2022: డీఆర్‌డీఓలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

ఇంత వరకు బాగానే ఉన్నా.. గ్రూప్​ డీ విషయంలో మాత్రం సీబీటీ–2 నిర్వహించకూడదని అభ్యర్థులు డిమాండ్​ చేస్తున్నారు. పదో తరగతి అర్హత గల గ్రూప్​ D పోస్టులకు రెండు దశల్లో పరీక్ష నిర్వహించడమంటే అభ్యర్థులను మోసం చేయడమేనని వాదిస్తున్నారు. పరీక్షలను రెండు దశల్లో నిర్వహించాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా రైల్వే ఉద్యోగ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కొందరు అభ్యర్థులు రైల్వే ట్రాక్​పై ఆందోళనలు నిర్వహించడంతో పాటు పలు రైల్​ కోచ్​లకు నిప్పు పెట్టారు. కాగా, మొత్తం 1,03,769 గ్రూప్​ డి పోస్టుల భర్తీకి 2019లో రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డు నోటిఫికేషన్​ విడుదల చేసింది. దీనికి దాదాపు 1.25 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Group d, India Railways, NTPC, Railway jobs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు