రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నాన్ టెక్నికల్ పాలపులర్ కేటగిరీ (NTPC) నోటిఫికేషన్‌కు సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ 1) ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. సీబీటీ–1 పరీక్షను దాదాపు 7 లక్షల మంది క్లియర్ చేశారు. వీరంతా సీబీటీ–2 పరీక్ష కోసం ప్రిపేరవుతున్నారు. తాజాగా సీబీటీ–2కు సంబంధించిన పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. షెడ్యూల్ ప్రకారం, సీబీటీ–2 పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 19 వరకు జరగనున్నాయి. మొత్తం ఒకే దశలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. కంప్లీట్ షెడ్యూల్ కోసం అభ్యర్థులు www.rrbcdg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆర్ఆర్బీ కోరింది.
అభ్యర్థుల అడ్మిట్ కార్డ్‌లు, ఎగ్జామ్ సిటీ, ఎగ్జామ్ డేట్ వంటి వివరాలు పరీక్ష తేదీకి 4 రోజుల ముందు చెక్ చేసుకోవచ్చని తెలిపింది. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు తమ ఎగ్జామ్ సిటీ, ఎగ్జామ్ డేట్, ట్రావెలింగ్ అథారిటీ వంటి వివరాలను 2022 ఫిబ్రవరి 3లోపు అన్ని రీజినల్ ఆర్ఆర్బీ వెబ్సైట్ల ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
RRB Group D Exam: రైల్వే జాబ్ మీ కలనా.. సెలబస్ అండ్ 30 డేస్ ప్రిపరేషన్ ప్లాన్!
పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డులు..
‘‘7వ CPC పరిధిలోకి వచ్చే లెవల్ 2, 3, 4, 5, 6 పోస్టులకు వేర్వేరు తేదీల్లో సీబీటీ–2 పరీక్షలు ఉంటాయి. 7వ CPC ఒకే స్థాయి పరిధిలోకి వచ్చే అన్ని పోస్ట్‌లకు ఒకేసారి ఉమ్మడి పరీక్ష ఉంటుంది. వేర్వేరు లెవల్ పోస్టులకు సీబీటీ–-2 పరీక్ష కోసం హాజరయ్యే అభ్యర్థి ప్రతి పోస్టుకు వేర్వేరు తేదీల్లో ప్రత్యేక అడ్మిట్ కార్డ్‌లను జారీ చేస్తారు. అయితే, అభ్యర్థికి సంబంధించిన అన్ని పరీక్షలను ఒకే నగరంలో నిర్వహించేలా షెడ్యూల్ చేశారు. కానీ పరీక్ష కేంద్రం మాత్రం మారే అవకాశం ఉంది.” అని ఆర్ఆర్బీ నోటీసులో పేర్కొంది.
RRB Group D Exam: ఆర్ఆర్బీ గ్రూప్-డీ పరీక్షల్లో భారీ మార్పు.. ఒకటి కాదు.. రెండు పరీక్షలు!
పరీక్ష హాల్లోకి ప్రవేశించే ముందు అభ్యర్థుల ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందు కోసం అభ్యర్థులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ ఆధార్ కార్డును పరీక్ష కేంద్రానికి తీసుకురావాల్సి ఉంటుంది. కాగా, ఇటీవల NTPC 2019 రిక్రూట్మెంట్ కోసం మొత్తం ఖాళీల సంఖ్యను బోర్డు పెంచింది. ఎక్స్-సర్వీస్‌మెన్‌కు ప్రస్తుత నిబంధన ప్రకారం మొత్తం ఖాళీల్లో 10 శాతం పోస్టులు కేటాయించారు. సవరించిన నోటిఫికేషన్‌ను ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ www.rrbald.gov.inలో తనిఖీ చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Indian Railways, NTPC, Railway employee, Railway jobs