రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (Railway Recruitment Board) ఎన్టీపీసీ(NTPC) సీబీటీ–1 ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. సీబీటీ–1 పరీక్షను దాదాపు 7 లక్షల మంది క్లియర్ చేశారు. వీరంతా సీబీటీ–2 పరీక్ష కోసం ప్రిపేరవుతున్నారు. సీబీటీ-1 పరీక్ష 2020 డిసెంబర్ 28 నుంచి 2021 జూలై 31 మధ్య వరకు మొత్తం ఏడు దశల్లో జరిగింది.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (Railway Recruitment Board) ఎన్టీపీసీ(NTPC) సీబీటీ–1 ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. సీబీటీ–1 పరీక్షను దాదాపు 7 లక్షల మంది క్లియర్ చేశారు. వీరంతా సీబీటీ–2 పరీక్ష కోసం ప్రిపేరవుతున్నారు. సీబీటీ-1 పరీక్ష 2020 డిసెంబర్ 28 నుంచి 2021 జూలై 31 మధ్య వరకు మొత్తం ఏడు దశల్లో జరిగింది. తాజాగా బోర్డు జారీ చేసిన నోటీసు ప్రకారం, రెండో దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT–2) ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు జరగనుంది. అంటే కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ తక్కువ సమయంలో సీబీటీ–2కు ఎలా ప్రిపేర్ (Prepare) అవ్వాలి..? ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది? సిలబస్ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం.
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సీబీటీ–2 పరీక్ష సరళి..
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT 2 పరీక్ష 90 నిమిషాల వ్యవధి కలిగి ఉంటుంది. దీనిలో జనరల్ అవేర్నెస్, మ్యాథమేటిక్స్, జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగాల నుంచి 120 ప్రశ్నలొస్తాయి. మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 ప్రశ్నలు చొప్పున, జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి మూడింట ఒక వంతు మార్కు కోత విధిస్తారు.
జనరల్ అవేర్నెస్..
జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రస్తుత సంఘటనలు, ఆటలు, క్రీడలు, భారతదేశ కళ, సంస్కృతి, భారతీయ సాహిత్యం, స్మారక చిహ్నాలు, భారతదేశంలోని ప్రదేశాలు, జనరల్ సైన్స్ మరియు లైఫ్ సైన్స్ (10వ తరగతి వరకు), భారతదేశ చరిత్ర, స్వాతంత్య్ర పోరాటం, భారత్తో పాటు ప్రపంచ సామాజిక ఆర్థిక భౌగోళిక శాస్త్రం, భారత రాజకీయాలు, పాలన- రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, ఐక్యరాజ్య సమితి, ఇతర ముఖ్యమైన ప్రపంచ సంస్థలు, అంతరిక్ష, అణు కార్యక్రమాలతో సహా సాధారణ శాస్త్ర, సాంకేతిక పరిణామాలు, భారతదేశం, ప్రపంచానికి సంబంధించిన పర్యావరణ సమస్యలు, ప్రాథమిక అంశాలు కంప్యూటర్లు, కంప్యూటర్ అప్లికేషన్లు, సాధారణ సంక్షిప్తాలు, భారతదేశంలో రవాణా వ్యవస్థలు, భారత ఆర్థిక వ్యవస్థ, భారతదేశంతో పాటు ప్రపంచంలోని ప్రసిద్ధ వ్యక్తులు, ప్రధాన ప్రభుత్వ కార్యక్రమాలు, భారతదేశంలోని వృక్షజాలం, జంతుజాలం, భారతదేశంలోని ముఖ్యమైన ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు మొదలైనవి.
సీబీటీ–2 కటాఫ్ మార్కులు..
సీబీటీ–2లో ఉత్తీర్ణత సాధించడానికి, అభ్యర్థులకు కనీస అర్హత మార్కుల సాధించాలి. అన్రిజర్వ్డ్ కేటగిరీ, EWS అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. ఓబీసీ (నాన్ క్రీమీ లేయర్) అభ్యర్థులకు కనీసం 30 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కనీసం 30 శాతం మార్కులు సాధించాలి. సీబీటీ–‘లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు టైపింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. సీబీటీ–2, టైపింగ్ టెస్ట్ మార్కుల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.