RRB NTPC CBT 2 ALERT TO RAILWAY CANDIDATES EXAM DATES RELEASED KNOW DETAILS EVK
RRB NTPC CBT 2: రైల్వే అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష తేదీలు విడుదల.. వివరాలు
ప్రతీకాత్మక చిత్రం
RRB NTPC CBT 2 | ఇండియన్ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్, RRB NTPC CBT 2 2022 పరీక్ష తేదీలపై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ను సంబంధిత రీజినల్ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచింది.
ఇండియన్ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్, RRB NTPC CBT 2 2022 పరీక్ష తేదీలపై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ను సంబంధిత రీజినల్ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచింది. ఈ నోటిస్ ప్రకారం పరీక్ష సీబీటీ-2 పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో వెల్లడించారు. ఇప్పటికే సీబీటీ-1 రివైజ్డ్ ఫలితాలను వెల్లడించారు. ఈ నోటీఫికేషన్ ప్రకారం ఎన్‌టీపీసీ సీబీటీ-2 పే లెవల్-4, లెవెల్-6 పరీక్షలు మే 9, 2022, మే 10, 2022 తేదీల్లో నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ కోసం తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ అధికారిక వెబ్‌సైట్ https://rrbsecunderabad.gov.in/ ను సందర్శించాలి. అంతే కాకుండా పే లెవెల్స్ 2,3,5 పరీక్షల షెడ్యూల్ కోసం త్వరలో నోటీసు ప్రకటించనున్నట్టు సమాచారం.
నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) పరీక్ష రాసిన అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న రివైజ్డ్ రిజల్ట్స్ ఇటీవల విడుదల చేశారు. రైల్వే ఎన్టీపీసీ కింద దాదాపు 35 వేల పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్ఆర్బీ 2019లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌కు నిరుద్యోగుల నుంచి మంచి స్పందన వచ్చింది. సుమారు కోటి మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం, దానికి కరోనా తోడవ్వడంతో పరీక్షల నిర్వహణ ఆలస్యం అయ్యింది. దీంతో, 2020 డిసెంబర్ 28 నుంచి 2021 జూలై 31 మధ్య దశల వారీగా పరీక్షలు నిర్వహించారు. అయితే జూలై 31న 7 ఫేజ్‌లలో దేశవ్యాప్తంగా ఈ ఎన్టీపీసీ సీబీటీ–1ను పూర్తి చేశారు.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌లోని ప్రతి జోన్‌కు కేటగిరీ వారీగా విడివిడిగా కటాఫ్ నిర్ణయిస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (సీబీటీ)–1లో అభ్యర్థి పొందాల్సిన కనీస అర్హత మార్కులనే కటాఫ్ మార్కులుగా పరిగణిస్తారు. తాజాగా ఫలితాలు వెలువడ్డ నేపథ్యంలో కటాఫ్ వివరాలు వెల్లడించాయి.
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్(RRB NTPC) లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రైల్వే రిక్రూట్మెంట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న లక్షలాది మంది ఆశావహులు ఇప్పుడు నిషేధాన్ని ఎత్తివేత్తి వేసి, నియామక ప్రక్రియను పునఃప్రారంభించాలని ప్ర భుత్వా న్ని కోరుతున్నారు. రైల్వే పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థుల నిరసనలు హింసాత్మకంగా మారడంతో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) గ్రూప్ D, NTPC నియామకాలను తాత్కాలికంగా నిలిపివేసింది. అనంతరం రివైజ్డ్ ఫలితాలను ప్రకటించింది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.