హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RRB NTPC Exam: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్‌పై క్లారిటీ వచ్చినట్టేనా?

RRB NTPC Exam: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్‌పై క్లారిటీ వచ్చినట్టేనా?

National Recruitment Agency | నిరుద్యోగులకు శుభవార్త. త్వరలో మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేర్వేరుగా పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. ఒకే ఎగ్జామ్ రాస్తే చాలు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేయనుంది.

National Recruitment Agency | నిరుద్యోగులకు శుభవార్త. త్వరలో మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేర్వేరుగా పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. ఒకే ఎగ్జామ్ రాస్తే చాలు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేయనుంది.

National Recruitment Agency | నిరుద్యోగులకు శుభవార్త. త్వరలో మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేర్వేరుగా పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. ఒకే ఎగ్జామ్ రాస్తే చాలు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేయనుంది.

ఇంకా చదవండి ...

  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ ప్రసంగంలో నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ-NRA ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ప్రభుత్వ శాఖల్లో నాన్-గెజిటెడ్ పోస్టులన్నింటికీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించేందుకు నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకైతే అభ్యర్థులు వేర్వేరు ఉద్యోగాలకు పలు ఏజెన్సీలు జారీ చేసే నోటిఫికేషన్లకు వేర్వేరుగా దరఖాస్తు చేయాల్సి వస్తోంది. ప్రతీ ఉద్యోగానికి ఓ పరీక్ష రాస్తున్నారు. దీని వల్ల ఎగ్జామ్ ఫీజు, ప్రిపరేషన్, ప్రయాణ ఖర్చులన్నీ మళ్లీ మళ్లీ భరించాల్సి వస్తోంది. ఈ పద్ధతి కాకుండా నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఒకటి రాస్తే సరిపోతుంది. గ్రూప్ బీ, గ్రూప్ సీ, గ్రూప్ డీ లాంటి ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ చాలు. ఈ ఒక్క పరీక్ష రాసి బ్యాంకుల్లో, ప్రభుత్వ శాఖల్లో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు పోటీ పడొచ్చు.

  నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ స్వతంత్ర సంస్థగా పనిచేస్తుంది. ప్రభుత్వ శాఖల్లో, బ్యాంకుల్లో నాన్ గెజిటెడ్ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించడం నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ పని. ప్రస్తుతం పలు యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నీట్, జేఈఈ, జీమ్యాట్, జీప్యాట్, యూజీసీ నెట్ లాంటి పరీక్షలన్నింటినీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA నిర్వహిస్తున్నట్టు, నియామక పరీక్షల్ని నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ-NRA నిర్వహించనుంది. ప్రతీ జిల్లా కేంద్రంలో ఈ పరీక్షలు జరుగుతాయి. దీని వల్ల గ్రామీణ, మారుమూల ప్రాంతాల అభ్యర్థులు కూడా పోటీ పరీక్షలకు హాజరవొచ్చు.

  నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేయడం ద్వారా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు-RRB, స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC నిర్వహించే పలు పరీక్షలు ఇకపై ఉండకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-1 జరగాల్సి ఉంది. గత ఏడాది నోటిఫికేషన్ విడుదలైనా ఇప్పటివరకు పరీక్ష జరగలేదు. కోటి మందికి పైగా అభ్యర్థులు ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే కొత్త ఏజెన్సీకి పరీక్ష నిర్వహించే బాధ్యతను అప్పగిస్తారన్న వార్తలు చాలాకాలంగా వస్తున్నవే. బడ్జెట్‌లో నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ గురించి ప్రకటించడంతో ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీ 1 నిర్వహణ బాధ్యత ఈ ఏజెన్సీకే ఇవ్వొచ్చని భావిస్తున్నారు. దీంతో పాటు ఆర్ఆర్‌బీ గ్రూప్ డీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జేహెచ్‌టీ పరీక్షలన్నీ ఈ ఏజెన్సీనే నిర్వహించొచ్చు. అయితే ఇప్పటికే షెడ్యూల్ విడుదలైన నోటిఫికేషన్లకు కాకుండా కొత్త నోటిఫికేషన్లను నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ రిలీజ్ చేయొచ్చు.

  Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఇవి కూడా చదవండి:

  Andhra Pradesh Jobs: సచివాలయ ఉద్యోగాలకు అప్లై చేయనివారికి మరో ఛాన్స్

  Axis Bank: ఈ కోర్సు చేస్తే యాక్సిస్ బ్యాంకులో ఉద్యోగం గ్యారెంటీ


  Railway Jobs: రైల్వేలో 447 ప్యూన్, జూనియర్ క్లర్క్ పోస్టులు

  First published:

  Tags: CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION, RRB, Staff Selection Commission

  ఉత్తమ కథలు