RRB NTPC Exams: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షలపై క్లారిటీ... ఎగ్జామ్స్ ఎప్పుడంటే

RRB NTPC CBT 1 Exam dates | మీరు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఎన్‌టీపీసీ పోస్టులకు దరఖాస్తు చేశారా? అయితే మీకు శుభవార్త. పరీక్ష తేదీలపై క్లారిటీ వచ్చింది.

news18-telugu
Updated: May 7, 2020, 1:18 PM IST
RRB NTPC Exams: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షలపై క్లారిటీ... ఎగ్జామ్స్ ఎప్పుడంటే
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్ష తేదీలను 2020 జూలై 1 కన్నా ముందే ప్రకటించే అవకాశం ఉందన్న వార్తలొస్తున్నాయి. అంటే జూన్ నెలాఖరులోగా పరీక్షలపై ప్రకటన వచ్చే అవకాశముంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB గతేడాది 35,000 పైగా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్-NTPC పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 జరగలేదు. 35,000 పైగా ఎన్‌టీపీసీ పోస్టులకు కోటీ 25 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేశారని అంచనా. వారంతా పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారు.

ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ నిర్వహించేందుకు ఆర్ఆర్‌బీ ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీని నియమిస్తోంది. ఇందుకోసం టెండర్ ప్రక్రియ కూడా ప్రారంభించింది. అంతా సవ్యంగా జరిగి ఉంటే ఈ పాటికి ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీని ఆర్ఆర్‌బీ ఎంపిక చేసేది. కానీ కరోనా వైరస్ సంక్షోభం కారణంగా టెండర్ ప్రక్రియలో జాప్యం తప్పలేదు. కానీ ఈ టెండర్ ప్రక్రియలో కదలిక వచ్చింది. జూన్ మొదటి వారంలోనే ఈ టెండర్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. అంటే నెల రోజుల్లోనే ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీని ఎంపిక చేయనుంది ఆర్ఆర్‌బీ. ఆ తర్వాత రెండు మూడు వారాల్లో అంటే జూన్ నెలాఖరులో ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ-ECA పరీక్ష తేదీలను ప్రకటించే అవకాశముంది.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే...

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 235 జాబ్స్... మే 9 లాస్ట్ డేట్

Govt Jobs: సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు... డిప్లొమా, డిగ్రీ పాసైతే చాలు
Published by: Santhosh Kumar S
First published: May 7, 2020, 1:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading