హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RRB NTPC Exam 2019: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్ డిసెంబర్‌లోనా? నిజమెంత

RRB NTPC Exam 2019: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్ డిసెంబర్‌లోనా? నిజమెంత

RRB NTPC Exam 2019: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్ డిసెంబర్‌లోనా? నిజమెంత
(ప్రతీకాత్మక చిత్రం)

RRB NTPC Exam 2019: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్ డిసెంబర్‌లోనా? నిజమెంత (ప్రతీకాత్మక చిత్రం)

RRB NTPC Exam 2019 | నవంబర్ చివర్లో అడ్మిట్ కార్డులు వస్తాయని, డిసెంబర్‌లో పరీక్షలు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి.

  రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB డిసెంబర్‌లో ఎన్‌టీపీసీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 నిర్వహించబోతోందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నవంబర్ చివర్లోగా అడ్మిట్ కార్డులను విడుదల చేసి, డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తుందని ఆ వార్తల సారాంశం. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీ 1 కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. 35,000 పైగా పోస్టులకు 1,26,30,885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ప్రస్తుతం వారంతా పరీక్ష కోసం ఎదురుచూస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం జూన్ సెప్టెంబర్‌లోగానే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 జరగాలి. ఇప్పుడు నవంబర్ మాసం సగం ముగిసింది. ఇంకా ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీ 1 సమాచారం లేదు. ఈ పరీక్ష వాయిదా పడిందని, రివైజ్డ్ షెడ్యూల్ ప్రకటిస్తామని ఆర్ఆర్‌బీ గత నెలలో అధికారికంగా తెలిపింది. ఎన్‌టీపీసీ పరీక్షకు సంబంధించి ఆర్ఆర్‌బీ నుంచి వచ్చిన అధికారిక సమాచారం అదొక్కటే. మిగతావన్నీ పుకార్లు, ఊహాగానాలే. ఇప్పుడు నవంబర్ చివర్లో అడ్మిట్ కార్డులు వస్తాయని, డిసెంబర్‌లో పరీక్షలు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు అభ్యర్థుల్లో ఆశల్ని చిగురింపజేస్తున్నాయి.

  నవంబర్ మాసం ముగియడానికి రెండువారాలు ఉంది. అడ్మిట్ కార్డులను ఈ నెలాఖరులో విడుదల చేసేట్టైతే ఆర్ఆర్‌బీ నుంచి ఇప్పటికే అధికారిక సమాచారం రావాలి. కానీ అలాంటి సమాచారం ఏమీ లేదు. ఆర్ఆర్‌బీ అధికారిక సమాచారం లేదు కాబట్టి ఈ వార్తలను నమ్మే పరిస్థితి లేదు. గతంలో కూడా ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షల గురించి అనేక వార్తలొచ్చాయి. పోస్టులు తగ్గించారన్న ప్రచారం కూడా జరిగింది. చివరకు అది ఫేక్ న్యూస్ అని తేలింది. అయితే డిసెంబర్‌లో ఎన్‌టీపీసీ పరీక్షలు నిర్వహిస్తారనడంలో వాస్తవమెంత అన్నది తెలియదు. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ స్పష్టతనిస్తే తప్ప అభ్యర్థుల్లో ఈ గందరగోళం తొలగిపోదు. అందుకే ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు అధికారిక సమాచారం కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌కు చెందిన అఫీషియల్ వెబ్‌సైట్స్ ఫాలో కావడం మంచిది. ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ వెబ్‌సైట్‌లో ఎన్‌టీపీసీ నోటిఫికేషన్ అప్‌డేట్స్ తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

  Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Redmi Note 8: రూ.9,999 ధరకే 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి

  ఇవి కూడా చదవండి:

  Jobs: ఇంటర్ పాసైన అమ్మాయిలకు గుడ్ న్యూస్... ఇండియన్ ఆర్మీలో చేరే అవకాశం

  Railway Jobs: దక్షిణ మధ్య రైల్వేలో 4103 జాబ్స్... దరఖాస్తు చేయండి ఇలా

  Jobs: విశాఖలోని నావల్ డాక్‌యార్డ్‌లో 275 జాబ్స్... పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Exams, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railways, RRB

  ఉత్తమ కథలు