RRB NTPC CANDIDATES DEMAND POSTPONEMENT OF RRB NTPC CBT 2 EXAM THIS IS THE REASON HERE GH VB
RRB NTPC: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సీబీటీ-2 పరీక్ష వాయిదాకు అభ్యర్థుల డిమాండ్.. కారణం ఇదే..!
ప్రతీకాత్మక చిత్రం
ఆర్ఆర్బీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC)లో పే లెవల్స్ 3, 5 కోసం పరీక్షను జూన్ 12న నిర్వహించనుంది. అయితే ఈ పరీక్ష తేదీని మార్చాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆర్ఆర్బీకి లేఖలు రాశారు.
ఇండియన్ రైల్వేస్‌లో(Indian Railways) ఉద్యోగం చాలా మంది విద్యార్థుల కల. ఆ లక్ష్యాన్ని అందుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తుంటారు. కరోనా కారణంగా గత రెండేళ్లలో ఆర్ఆర్బీ(RRB) ( రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు) నుంచి ఎటువంటి నోటిఫికేష(Notification) న్ విడుదల కాలేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో పలు పోస్టులను భర్తీ చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలో నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC)లో పే లెవల్స్ 3, 5 కోసం పరీక్షను జూన్ 12న నిర్వహించనుంది. అయితే ఈ పరీక్ష తేదీని మార్చాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆర్ఆర్బీకి లేఖలు రాశారు. అదే రోజు (జూన్12) యూపీఎస్సీ పీసీఎస్ ప్రిలిమినరీ పరీక్ష ఉందన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.
ఒకే రోజు రెండు ప్రధాన పరీక్షలు ఉండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో రెండింటికీ ఎలా సిద్ధం అవ్వాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరీక్ష కేంద్రం సుదూర ప్రాంతంలో ఉంటే ఒక పరీక్షను వదులుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఎన్టీపీసీ పరీక్షను వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
RRB.. పే లెవెల్స్ 4, 6 కోసం CBT-2 మే 9, 10 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా పే లెవెల్స్ 2, 3, 5కు షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల కోసం పరీక్ష తేదీలను ఆర్ఆర్బీ ప్రకటించింది. ఎన్టీపీసీ పరీక్షకు జాతీయ స్థాయిలో ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈ పరీక్ష ద్వారా దాదాపు 35,281 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఏడాది ఈ పరీక్షకు కోటికి పైగా దరఖాస్తులు వచ్చాయి. భారతీయ రైల్వేలోని వివిధ జోన్లు, తయారీ యూనిట్లలో గ్రాడ్యుయేట్ - అండర్ గ్రాడ్యుయేట్ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) పోస్టులకు ఈ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
NTPC పరీక్ష ద్వారా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.
అభ్యర్థులు పోస్టులకు ఎంపిక కావాలంటే అనేక దశలను దాటాల్సి ఉంటుంది. మొదటిదశలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT) ఉంటుంది. రెండవ దశలో టైపింగ్ స్కిల్ టెస్ట్, కంప్యూటర్-ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (పోస్ట్‌ను బట్టి) ఉంటుంది. ఆ తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ రౌండ్‌తోపాటు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
మరోవైపు ఎస్బీఐ, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ కూడా రిక్రూట్మెంట్ చేపడుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిటైర్డ్ సిబ్బంది నుండి కాంట్రాక్టు ప్రాతిపదికన 641 పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అధికారిక వెబ్సైట్ sbi.co.in ద్వారా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ జూన్ 7గా నిర్ణయించారు. మొత్తం 641 పోస్టులలో 503 ఛానల్ మేనేజర్ ఫెసిలిటేటర్ - ఎనీటైమ్ ఛానెల్స్ (CMF-AC) పోస్టులు, 130 ఛానల్ మేనేజర్ సూపర్వైజర్ ఎనీటైమ్ ఛానెల్స్ (CMS-AC) పోస్టులు, మిగిలిన 8 సపోర్ట్ ఆఫీసర్- ఎనీటైమ్ ఛానెల్స్ (SO-AC) పోస్టులు ఉన్నాయి.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) గేట్ -2022 ఆధారంగా ఇంజనీర్లు, ఆఫీసర్ల పోస్టుల భర్తీకి గ్రాడ్యుయేట్ల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అధికారిక వెబ్సైట్iocl.com ద్వారా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ మే 22గా నిర్ణయించారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.