హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Jobs: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ, గ్రూప్ డీ ఎగ్జామ్స్ రాస్తున్నారా? ముందు ఈ రూల్ తెలుసుకోండి

Railway Jobs: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ, గ్రూప్ డీ ఎగ్జామ్స్ రాస్తున్నారా? ముందు ఈ రూల్ తెలుసుకోండి

Railway Jobs: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ, గ్రూప్ డీ ఎగ్జామ్స్ రాస్తున్నారా? ముందు ఈ రూల్ తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

Railway Jobs: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ, గ్రూప్ డీ ఎగ్జామ్స్ రాస్తున్నారా? ముందు ఈ రూల్ తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

RRB NTPC Group Exam Dates | రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB ఎన్‌టీపీసీ, గ్రూప్ డీ పోస్టులకు అప్లై చేశారా? ఎగ్జామ్ తేదీల గురించి తెలుసుకోండి.

సుమారు కోటి మందికి పైగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్న రైల్వే రిక్రూట్‌మెంట్ పరీక్షలకు కౌంట్‌డౌన్ మొదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB ఎన్‌టీపీసీ, గ్రూప్ డీ, మినిస్టీరియల్ అండ్ ఐసోలేడెట్ కేటగిరీ పోస్టులకు డిసెంబర్ 15 నుంచి పరీక్షలు మొదలు కానున్నాయి. డీటెయిల్డ్ ఎగ్జామ్ షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. అడ్మిట్ కార్డులు కూడా రిలీజ్ కాలేదు. పరీక్షలకు 10 రోజుల ముందు అభ్యర్థులకు ఎగ్జామ్ డేట్స్, అడ్మిట్ కార్డులకు సంబంధించిన సమాచారం అందనుంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్లలో ఈ వివరాలు అప్‌డేట్ అవుతాయి. కాబట్టి అభ్యర్థులు ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్స్ ఫాలో అవుతూ ఉండాలి. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, యాప్టిట్యూడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇక గ్రూప్ డీ పరీక్షలకు సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్, పర్ఫామెన్స్ టెస్ట్, టీచింగ్ స్కిల్ టెస్ట్, ట్రాన్స్‌లేషన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి.

SBI Jobs 2020: డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో 8500 అప్రెంటీస్ పోస్టులు... అప్లై చేయండి ఇలా

NTPC Recruitment 2020: ఎన్‌టీపీసీలో ఉద్యోగాలు... రూ.24,000 వేతనం

ఈ పరీక్షలు రాసే అభ్యర్థులు ముఖ్యమైన రూల్స్ తెలుసుకోవడం అవసరం. ఈ నోటిఫికేషన్లకు లక్షల్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాబట్టి పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఎక్కువ మంది పరీక్ష రాస్తారు కాబట్టి చాలామంది అభ్యర్థులకు సమానమైన మార్కులు వచ్చి టై అయ్యే పరిస్థితి తప్పనిసరిగా ఉంటుంది. మరి ఇలా ఇద్దరు అభ్యర్థులకు సమానమైన మార్కులు వస్తే ఎవరిని ఎంపికచేస్తారు? ఎవరికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు? అన్న సందేహాలు అభ్యర్థుల్లో ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ఆర్ఆర్‌బీ టై-బ్రేకింగ్ రూల్ పాటించనుంది. టై-బ్రేకింగ్ రూల్ ప్రకారం ఇద్దరు అభ్యర్థులకు సమానమైన మార్కులు వస్తే ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యత ఇస్తారు. ఒకవేళ వయస్సు కూడా సమానంగా ఉంటే ఆల్ఫబెటికల్ ఆర్డర్‌లో ఎవరి పేరు ముందు వస్తేవారికి ప్రాధాన్యత ఇస్తారు.

NPCIL Recruitment 2020: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో 206 ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే చివరి తేదీ

DRDO Scholarship: విద్యార్థులకు రూ.1,86,000 స్కాలర్‌షిప్... దరఖాస్తుకు డిసెంబర్ 31 వరకు గడువు

ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పోస్టులు 35,208 ఉంటే కోటి 26 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఆర్ఆర్‌బీ గ్రూప్ డీ పోస్టులు 1,03,769 ఉంటే కోటి 15 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేశారు. మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులు 1,663 ఉంటే లక్షకు పైగా అభ్యర్థులు అప్లై చేశారు.

First published:

Tags: CAREER, Exams, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railway Apprenticeship, Railways

ఉత్తమ కథలు