RRB: త్వరలో ఆర్ఆర్‌బీ అడ్మిట్ కార్డ్స్... డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా

RRB NTPC Admit Card | జేఈ పరీక్షలు పూర్తైన నెలరోజుల్లోనే ఎన్‌టీపీసీ పరీక్షలు నిర్వహిస్తారన్న వార్తలొచ్చాయి. పరీక్షకు కనీసం 15 రోజుల ముందే అడ్మిట్ కార్డులను విడుదల చేయనుంది ఆర్ఆర్‌బీ.

news18-telugu
Updated: June 3, 2019, 2:38 PM IST
RRB: త్వరలో ఆర్ఆర్‌బీ అడ్మిట్ కార్డ్స్... డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా
RRB: త్వరలో ఆర్ఆర్‌బీ అడ్మిట్ కార్డ్స్... డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ జారీ చేసిన నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్(NTPC) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త. త్వరలో ఎన్‌టీపీసీ పరీక్షలకు హాల్ టికెట్లు జారీ చేయనుంది ఆర్ఆర్‌బీ. ఈ వారంలోనే అడ్మిట్ కార్డ్స్ వచ్చే అవకాశముంది. మార్చి 1న 35,277 ఎన్‌టీపీసీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది ఆర్ఆర్‌బీ. ఆ తర్వాత 69 పోస్టుల్ని తగ్గించిన ఆర్ఆర్‌బీ మళ్లీ 66 పోస్టుల్ని కలిపింది. ఎన్‌టీపీసీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న లక్షలాది మంది అడ్మిట్ కార్డ్స్ కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్‌బీ జూనియర్ ఇంజనీర్ పరీక్షలు గత నెలలో ముగిశాయి. జేఈ పరీక్షలు పూర్తైన నెలరోజుల్లోనే ఎన్‌టీపీసీ పరీక్షలు నిర్వహిస్తారన్న వార్తలొచ్చాయి. అంటే ఈ నెలలోనే ఎన్‌టీపీసీ పరీక్షలు నిర్వహించే అవకాశముంది. పరీక్షకు కనీసం 15 రోజుల ముందే అడ్మిట్ కార్డులను విడుదల చేయనుంది ఆర్ఆర్‌బీ. ప్రస్తుతం అందుతున్న వార్తల ప్రకారం ఈ వారంలోనే ఎన్‌టీపీసీ పరీక్షల అడ్మిట్ కార్డ్స్ విడుదల చేసే అవకాశముంది. అడ్మిట్ కార్డ్స్ కోసం అభ్యర్థులు ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్‌లో అప్‌డేట్స్ చూస్తుండటం మంచిది. అడ్మిట్ కార్డ్ విడుదలైన తర్వాత ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకోండి.

Read this: RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే...

RRB NTPC: ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా


ముందుగా మీరు దరఖాస్తు చేసుకున్న రీజియన్ ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలోనే RRB NTPC Admit Card 2019 లింక్ కనిపిస్తుంది.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
మీ రిజిస్ట్రేషన్ ఐడీ, ఇతర వివరాలు ఎంటర్ చేస్తే అడ్మిట్ కార్డ్ ఓపెన్ అవుతుంది.అడ్మిట్ కార్డ్ ప్రింట్ అవుట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
పరీక్షకు వెళ్లేముందు ఆర్ఆర్‌బీ అడ్మిట్ కార్డులో నియనిబంధనలన్నీ పూర్తిగా చదువుకోవాలి.

Job News: మరిన్ని జాబ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi Note 7S: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7ఎస్ ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి...

Railway Jobs: డిగ్రీ ఉందా? ఎంఎస్ ఆఫీస్ వచ్చా? రైల్వేలో 95 ఉద్యోగాలు...

Railway Jobs: కోచ్ ఫ్యాక్టరీలో 992 అప్రెంటీస్ పోస్టులు... టెన్త్ పాసైనవారికీ అవకాశం
Published by: Santhosh Kumar S
First published: June 3, 2019, 2:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading