భారతీయ రైల్వే అతిపెద్ద నియామక ప్రక్రియలో మరో ముందడుగు వేయబోతోంది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్-NTPC నోటిఫికేషన్ ద్వారా 35,208 పోస్టుల భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మొదటి దశ పరీక్షల్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్-RRB నిర్వహిస్తోంది. డిసెంబర్ 28 నుంచి జనవరి 13 వరకు దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 జరగనుంది. పలు దశల్లో ఈ ఎగ్జామ్ జరగనుంది. 35,208 పోస్టులకు కోటీ 26 లక్షల మందికి పైగా అభ్యర్థులు అప్లై చేశారు. మొదటి దశలో 23 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాస్తారని అంచనా. వీరికి అడ్మిట్ కార్డ్స్ విడుదల కానున్నాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్-RRB రీజనల్ వెబ్సైట్లలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సీబీటీ 1 అడ్మిట్ కార్డ్స్ విడుదలౌతాయి. ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్లో దరఖాస్తు చేసినట్టైతే http://www.rrbsecunderabad.nic.in/ వెబ్సైట్లో అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.మరి అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకోండి.
ECIL Hyderabad Jobs: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
SSC CGL 2020-21: డిగ్రీ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్... నోటిఫికేషన్ వివరాలు ఇవే
అభ్యర్థులు ముందుగా ఏదైనా ఆర్ఆర్బీ రీజనల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు http://www.rrbsecunderabad.nic.in/ వెబ్సైట్ ఓపెన్ చేయొచ్చు.
హోమ్ పేజీలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ లింక్ క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో RRB NTPC admit card లింక్ ఉంటుంది. క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అభ్యర్థి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి.
లాగిన్ అయిన తర్వాత అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.
అడ్మిట్ కార్డులోని ఇన్స్ట్రక్షన్స్ పూర్తిగా చదవాలి.
నియమనిబంధనల్ని సరిగ్గా అర్థం చేసుకొని పరీక్షా కేంద్రానికి వెళ్లాలి.
IOCL Recruitment 2020: ఐఓసీఎల్‌లో 543 ఉద్యోగాలు... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీలు
OMPL Jobs 2021: ఓఎన్జీసీ సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షలు దశలవారీగా జరుగుతున్నాయి కాబట్టి అభ్యర్థులకు కూడా దశల వారీగానే అడ్మిట్ కార్డులు విడుదలౌతాయి. ఇక ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ ద్వారా 35,208 పోస్టుల్ని భర్తీ చేస్తోంది భారతీయ రైల్వే. కమర్షియల్ అప్రెంటీస్, స్టేషన్ మాస్టర్, ట్రైన్స్ క్లర్క్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, టైమ్ కీపర్, జూనియర్ టైమ్ కీపర్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ లాంటి పోస్టులున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Exams, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railway Apprenticeship, Railways, RRB