• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • RRB NTPC 7TH PHASE EXAM SCHEDULE NOT RELEASED YET GOVERNMENT FACT CHECK MK GH

RRB NTPC Exams: ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ షెడ్యూల్ విడుదల కాలేదు.. నకిలీ వార్తలు నమ్మొద్దంటున్న రైల్వే బోర్డు

(ప్రతీకాత్మక చిత్రం)

కరోనా కారణంగా పోటీ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో నాన్ టెక్నిక‌ల్ పాపుల‌ర్ కేట‌గిరి ( ఎన్‌టిపీసి) 7వ విడ‌త ప‌రీక్ష‌లను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వాయిదా వేసింది. అయితే తాజాగా ఈ పరీక్ష షెడ్యూల్ విడుదలైందంటూ సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది ఆర్‌ఆర్‌బీ.

  • Share this:
కరోనా కారణంగా పోటీ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో నాన్ టెక్నిక‌ల్ పాపుల‌ర్ కేట‌గిరి ( ఎన్‌టిపీసి) 7వ విడ‌త ప‌రీక్ష‌లను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వాయిదా వేసింది. అయితే తాజాగా ఈ పరీక్ష షెడ్యూల్ విడుదలైందంటూ సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది ఆర్‌ఆర్‌బీ. ప్రస్తుతం వైరల్ అవుతున్న పరీక్ష షెడ్యూల్ న‌కిలీద‌ని తెలిపింది. ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో ఫ్యాక్ట్స్ చెక్ సైతం దీన్ని ధ్రువీకరించింది. ప్ర‌స్తుతానికి రైల్వేబోర్డు ఈ కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయలేదని, అభ్య‌ర్థులు ఈ న‌కిలీ నోటిఫికేష‌న్‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని ఫ్యాక్ట్స్ చెక్ కోరింది.

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ప‌రీక్ష‌లు ద‌శ‌ల‌వారీగా జ‌రుగుతాయి. గ‌త ఏప్రిల్ 8న ఎన్‌టీపీసీ ప‌రీక్ష‌లు ముగిసిన తరువాత, ఇప్ప‌టిదాకా తదుపరి ఏడో విడత పరీక్షల కోసం ఎలాంటి నోటిఫికేష‌న్లు వెలువ‌డ‌లేదు. కోవిడ్ కార‌ణంగా వివిధ రాష్ట్రాల‌లో లాక్‌డౌన్ నిబంధ‌న‌లు అమ‌ల‌వుతున్నందువల్ల, పరీక్షలు వాయిదా వేస్తున్నామని మే 31న ఆర్ఆర్‌బీ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డిన త‌రువాత త‌దుప‌రి ప‌రీక్ష‌ల తేదీలు ప్ర‌క‌టిస్తామ‌ని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది.

ఆర్ఆర్బీ ఎన్‌టీపీసీ రిక్రూట్‌మెంట్‌లో 35,208 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో జూనియ‌ర్ క్ల‌ర్క్ క‌మ్ టైపిస్ట్‌, జూనియ‌ర్ టైమ్ కీప‌ర్‌, అకౌంట్స్ క్ల‌ర్క్ క‌మ్ టైపిస్ట్‌, సీనియ‌ర్ క్ల‌ర్క్ క‌మ్ టైపిస్ట్‌, జూనియ‌ర్ అకౌటెంట్ అసిస్టెంట్ క‌మ్ టైపిస్ట్‌, సీనియ‌ర్ టైమ్ కీప‌ర్ లాంటి పోస్టులు ఉన్నాయి. వీటికి 1.26 కోట్ల మంది అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇప్ప‌టిదాకా 95ల‌క్ష‌ల మందికి ప‌రీక్ష‌లు జ‌రిపామ‌ని ఆర్ఆర్బీ తెలిపింది. ఈ ప‌రీక్ష‌ల‌లో అర్హ‌త సాధించిన‌వారు త‌దుప‌రి కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష‌కు హాజ‌రు కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తదుపరి ప‌రీక్షకు సంబంధించిన న‌కిలీ నోటిఫికేష‌న్‌ను నమ్మవద్దని ఫ్యాక్ట్స్ చెక్ హెచ్చ‌రించింది. అధికారిక సమాచారం కోసం అభ్య‌ర్థ‌లు ఆర్ఆర్బీ వెబ్‌సైట్‌ను మాత్ర‌మే ఫాలో కావాల‌ని కోరింది. త‌ప్పుదోవ ప‌ట్టించే అన‌ధికారిక స‌మాచారాన్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని బోర్డు సైతం హెచ్చ‌రించించింది.
Published by:Krishna Adithya
First published: