హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RRB Jobs: రైల్వేలో NTPC పోస్టులకు ఒక రోజు ఆలస్యంగా నోటిఫికేషన్

RRB Jobs: రైల్వేలో NTPC పోస్టులకు ఒక రోజు ఆలస్యంగా నోటిఫికేషన్

RRB NTPC 2019 Recruitment | మార్చి 1న NTPC పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్న RRB, పారామెడికల్ స్టాఫ్‌ పోస్టులకు మార్చి 4న, ఆర్ఆర్‌బీ మినిస్టీరియల్, ఇతర కేటగిరీల ఖాళీలకు మార్చి 8న, ఆర్ఆర్‌బీ లెవెల్-1 పోస్టులకు మార్చి12న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తుంది.

ఇంకా చదవండి ...

రైల్వే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. కొద్ది రోజుల క్రితం 1,30,000 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటన విడుదల చేసిన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్(RRB) NTPC పోస్టులకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ను మార్చి 1న విడుదల చేయనుంది. వాస్తవానికి ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ రావాల్సి ఉంది. కానీ ఒక రోజు ఆలస్యంగా నోటిఫికేషన్ వెలువడనుంది. RRB అధికారిక వెబ్‌సైట్‌లో డీటెయిల్డ్ నోటిఫికేషన్ చూడొచ్చు. indianrailways.gov.in వెబ్‌సైట్‌తో పాటు RRB రీజనల్ వెబ్‌సైట్లల్లో రిజిస్ట్రేషన్ లింక్ గురువారం యాక్టివేట్ అవుతుంది. అప్లికేషన్ ప్రక్రియ, చివరి తేదీ, పరీక్ష వివరాలు నోటిఫికేషన్‌లో ఉంటాయి.

Read this: పవర్ బ్యాంక్ కొంటున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు

ఈ ఏడాది మొత్తం 1,30,000 ఖాళీలను ఆర్ఆర్‌బీ భర్తీ చేయనుంది. అందులో 1,00,000 లెవెల్-1 పోస్టులు. మిగతా 30,000 వేర్వేరు కేటగిరీల పోస్టులు. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ(NTPC), పారామెడికల్ స్టాఫ్, మినిస్టీరియల్‌తో పాటు వేర్వేరు కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేయనుంది ఆర్ఆర్‌బీ. మార్చి 1న NTPC పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్న RRB, పారామెడికల్ స్టాఫ్‌ పోస్టులకు మార్చి 4న, ఆర్ఆర్‌బీ మినిస్టీరియల్, ఇతర కేటగిరీల ఖాళీలకు మార్చి 8న, ఆర్ఆర్‌బీ లెవెల్-1 పోస్టులకు మార్చి12న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తుంది.

Read this: Mobile Insurance: మీ స్మార్ట్‌ఫోన్‌కు ఇన్స్యూరెన్స్ ఉందా? బీమా ఎంత ముఖ్యం?

జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రెయిన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ అప్రెంటీస్, స్టేషన్ మాస్టర్‌తో పాటు ఇతర పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఇక పారామెడికల్ స్టాఫ్‌లో స్టాఫ్ నర్స్, హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్, ఫార్మాసిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ సూపరింటెండెంట్ లాంటి పోస్టులు, ఆర్ఆర్‌బీ మినిస్టీరియల్, ఇతర కేటగిరీల్లో స్టెనోగ్రాఫర్, చీఫ్ లా అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేటర్(హిందీ) పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు.

Photos: అమరవీరుల స్మృతి చిహ్నం 'నేషనల్ వార్ మెమోరియల్'

ఇవి కూడా చదవండి:

Indian Railways: భారతీయ రైల్వే లగేజీ రూల్స్ ఇవే...

Personal Finance: క్రెడిట్ కార్డులు ఎక్కువున్నాయా? సిబిల్ స్కోర్‌కు ముప్పేనా?

First published:

Tags: CAREER, EMPLOYMENT, Exams, JOBS, RRB