RRB NTPC Exam: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్ ఇప్పట్లో లేనట్టేనా?

RRB NTPC 2019 CBT 1 | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఇటీవల కొన్ని వార్తలొచ్చాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB నిర్వహించే పరీక్షలతో పాటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్-IBPS లాంటి సంస్థలు నిర్వహించే ఎగ్జామ్స్ అన్నింటికీ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-CET ఉంటుందన్న వార్తలొచ్చాయి.

news18-telugu
Updated: December 10, 2019, 3:29 PM IST
RRB NTPC Exam: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్ ఇప్పట్లో లేనట్టేనా?
RRB NTPC Exam: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్ ఇప్పట్లో లేనట్టేనా? (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB ఎన్‌టీపీసీ మొదటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎప్పుడు? ఈ ప్రశ్నకు జవాబు పెద్ద మిస్టరీగా మారింది. 35,000 పైగా పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ జారీ చేసిన అతిపెద్ద జాబ్ నోటిఫికేషన్ ఇది. 1,26,30,885 మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడం విశేషం. ఓ నోటిఫికేషన్‌కు ఈ స్థాయిలో దరఖాస్తులు రావడం ఇదే మొదటిసారేమో. అందుకే ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్‌పై నిరుద్యోగుల్లో భారీ ఆశలున్నాయి. షెడ్యూల్ ప్రకారం జూన్ నుంచి సెప్టెంబర్ లోగా జరగాల్సిన పరీక్షలపై ఎలాంటి స్పష్టత లేకపోవడం అభ్యర్థులను అయోమయానికి గురి చేస్తోంది. ఈ పరీక్ష వాయిదా పడిందని, రివైజ్డ్ షెడ్యూల్ ప్రకటిస్తామని కొంతకాలం క్రితం రైల్వే అధికారికంగా ప్రకటించింది. ఆ ఒక్క ప్రకటన తప్ప ఈ నియామక ప్రక్రియకు సంబంధించి ఎలాంటి స్పష్టత ఇప్పటివరకు లేదు. దీంతో అభ్యర్థులు రివైజ్డ్ షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. డిసెంబర్‌లోనే ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీ-1 ఉంటుందన్న ప్రచారం జరిగింది. కానీ... డిసెంబర్ మొదటివారం దాటిపోయినా ఎలాంటి అప్‌డేట్స్ లేవు. దీంతో ఇక ఈ ఏడాది ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీ-1 లేనట్టేనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వచ్చే ఏడాదే ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీ-1 పరీక్ష జరుగుతుందా అని అభ్యర్థుల్లో చర్చ జరుగుతోంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఇటీవల కొన్ని వార్తలొచ్చాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB నిర్వహించే పరీక్షలతో పాటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్-IBPS లాంటి సంస్థలు నిర్వహించే ఎగ్జామ్స్ అన్నింటికీ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-CET ఉంటుందన్న వార్తలొచ్చాయి. అంటే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-CET క్వాలిఫై అయిన వారిని రైల్వేతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టులకు ఎంపిక చేయడమే ఈ ప్రతిపాదన వెనుక అసలు ఉద్దేశం. అయితే ఇది ప్రతిపాదన మాత్రమే. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించి కార్యరూపం దాల్చేందుకు సమయం పడుతుంది. అందుకోసమే ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీ-1 నిర్వహించట్లేదా? లేక ఇతర కారణాలేవైనా ఉన్నాయా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ సందేహాలన్నింటికీ క్లారిటీ రావాలంటే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB అధికారులు ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్ష నిర్వహణపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇక అభ్యర్థులు మాత్రం ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్లలోనే అప్‌డేట్స్ ఫాలోకావాలి.

అదిరిపోయిన నోకియా 2.3 ఫీచర్స్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Government Jobs: ఇంటర్ పాసైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం... అప్లై చేయండి ఇలా

Railways Jobs: సదరన్ రైల్వేలో 3429 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివేRailway Jobs: ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 1216 ఉద్యోగాలు... ఆంధ్రప్రదేశ్‌లోనూ ఖాళీలు
Published by: Santhosh Kumar S
First published: December 10, 2019, 3:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading