RRB: రైల్వే జాబ్‌కు అప్లై చేశారా? దరఖాస్తు స్టేటస్ చెక్ చేయండి ఇలా

RRB Level 1 Application Status | మొత్తం 1,03,769 పోస్టులకు లక్షల్లో దరఖాస్తులు వచ్చాయని అంచనా. వాటిని ఆర్ఆర్‌బీ పరిశీలించింది. పరీక్షకు ఎంపికైన అభ్యర్థులు, తిరస్కరణకు గురైన వారి జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపర్చింది.

news18-telugu
Updated: July 27, 2019, 3:52 PM IST
RRB: రైల్వే జాబ్‌కు అప్లై చేశారా? దరఖాస్తు స్టేటస్ చెక్ చేయండి ఇలా
RRB: రైల్వే జాబ్‌కు అప్లై చేశారా? దరఖాస్తు స్టేటస్ చెక్ చేయండి ఇలా
  • Share this:
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB లెవెల్ 1 నోటిఫికేషన్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేశారా? అయితే మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోండి. మొత్తం 1,03,769 లెవెల్ 1 పోస్టుల భర్తీ కోసం 2019 ఫిబ్రవరి 23న నోటిఫికేషన్ జారీ చేసింది ఆర్ఆర్‌బీ. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 12న ముగిసింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిర్వహించనుంది ఆర్ఆర్‌బీ. మొత్తం 1,03,769 పోస్టులకు లక్షల్లో దరఖాస్తులు వచ్చాయని అంచనా. వాటిని ఆర్ఆర్‌బీ పరిశీలించింది. పరీక్షకు ఎంపికైన అభ్యర్థులు, తిరస్కరణకు గురైన వారి జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. ఆర్ఆర్‌బీ లెవెల్ 1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవాళ్లు అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అప్లికేషన్ రిజెక్ట్ అయిన అభ్యర్థులకు ఎస్ఎంఎస్‌లో సమాచారం ఇస్తోంది ఆర్ఆర్‌బీ.

RRB Level 1 Recruitment: అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోండి ఇలా...



మీరు ఏ రీజియన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుంటే ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
సికింద్రాబాద్ రీజియన్‌లో దరఖాస్తు చేసినట్టైతే http://rrbsecunderabad.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
CEN No.RRC-01/2019 for Recruitment of various categories in Level 1 Posts ట్యాబ్ పైన క్లిక్ చేయండి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో Link to View Your Application Status లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేయండి.
మరో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ జోన్ ఎంచుకోండి.

తర్వాతి పేజీలో రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టిన తేదీ, సెక్యూరిటీకోడ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
మీరు లాగిన్ అయిన తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్ తెలుస్తుంది.
అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి లింక్ జూలై 25 నుంచి జూలై 31 వరకు యాక్టీవ్‌గా ఉంటుంది.
మీ అప్లికేషన్ స్టేటస్ నేరుగా తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

లెవెల్ 1 అప్లికేషన్ స్టేటస్ కోసం ఆర్ఆర్‌బీ జారీ చేసిన షార్ట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme X: రియల్‌మీ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే...

RRB Alert: రైల్వే ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు... ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ

Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి...
Published by: Santhosh Kumar S
First published: July 27, 2019, 3:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading