RRB NTPC Jobs | గ్రాడ్యుయేట్ పోస్టులకు కనీస విద్యార్హత బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్ లాంటి పోస్టులకు దరఖాస్తు చేసినవారికి ఇంగ్లీష్ లేదా హిందీలో కంప్యూటర్లో టైపింగ్ తెలిసి ఉండాలి.
రైల్వే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త. 24,605 ఖాళీలను గ్రాడ్యుయేట్ పోస్టులుగా ప్రకటించింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్-RRB. మొత్తం 35208 పోస్టులకు కొన్ని నెలల క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది ఆర్ఆర్బీ. వాటిలో 24,605 పోస్టులను గ్రాడ్యుయేట్స్‌కి, మిగతా 10,603 పోస్టులను అండర్ గ్రాడ్యుయేట్స్‌కి కేటాయించింది ఆర్ఆర్బీ. గ్రాడ్యుయేట్ పోస్టుల్లో ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్, కమర్షియల్ అప్రెంటీస్, స్టేషన్ మాస్టర్ లాంటి పోస్టులున్నాయి. మరి ఏఏ పోస్టుకు ఎన్నెన్ని ఖాళీలున్నాయి? వేతనం ఎంత? లాంటి వివరాలు ఈ చార్ట్‌లో చూడండి.రైల్వే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త. 24,605 ఖాళీలను గ్రాడ్యుయేట్ పోస్టులుగా ప్రకటించింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్-RRB. మొత్తం 35208 పోస్టులకు కొన్ని నెలల క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది ఆర్ఆర్బీ. వాటిలో 24,605 పోస్టులను గ్రాడ్యుయేట్స్‌కి, మిగతా 10,603 పోస్టులను అండర్ గ్రాడ్యుయేట్స్‌కి కేటాయించింది ఆర్ఆర్బీ. గ్రాడ్యుయేట్ పోస్టుల్లో ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్, కమర్షియల్ అప్రెంటీస్, స్టేషన్ మాస్టర్ లాంటి పోస్టులున్నాయి. మరి ఏఏ పోస్టుకు ఎన్నెన్ని ఖాళీలున్నాయి? వేతనం ఎంత? లాంటి వివరాలు ఈ చార్ట్‌లో చూడండి.
పోస్ట్ పేరు
ఖాళీలు
వేతనం
స్టేషన్ మాస్టర్
6865
రూ.35400
గూడ్స్ గార్డ్
5748
రూ.29200
సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్
5638
రూ.29200
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్
3147
రూ.29200
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్
2854
రూ.29200
కమర్షియల్ అప్రెంటీస్
259
రూ.35400
ట్రాఫిక్ అసిస్టెంట్
88
రూ.25500
సీనియర్ టైమ్ కీపర్
6
రూ.29200
మొత్తం ఖాళీలు
24605
గ్రాడ్యుయేట్ పోస్టులకు కనీస విద్యార్హత బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్ లాంటి పోస్టులకు దరఖాస్తు చేసినవారికి ఇంగ్లీష్ లేదా హిందీలో కంప్యూటర్లో టైపింగ్ తెలిసి ఉండాలి. వయస్సు 2019 జూలై 1 నాటికి 18 నుంచి 33 ఏళ్లు ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2019 సీబీటీ-1 అడ్మిట్ కార్డ్ త్వరలో విడుదల కానుంది. పరీక్ష ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో జరిగే అవకాశముంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.