RRB Exam: ఆర్ఆర్‌బీ జేఈ పరీక్షల వివరాలు విడుదల... చెక్ చేసుకోండి ఇలా

RRB JE Recruitment 2019 | అడ్మిట్ కార్డులను పరీక్షకు నాలుగు రోజుల ముందు వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

news18-telugu
Updated: August 19, 2019, 6:24 PM IST
RRB Exam: ఆర్ఆర్‌బీ జేఈ పరీక్షల వివరాలు విడుదల... చెక్ చేసుకోండి ఇలా
RRB Exam: ఆర్ఆర్‌బీ జేఈ పరీక్షల వివరాలు విడుదల... (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 19, 2019, 6:24 PM IST
ఇటీవల జూనియర్ ఇంజనీర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఫలితాలు విడుదల చేసిన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పరీక్ష తేదీలను ప్రకటించింది ఆర్ఆర్‌బీ. ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ 2 జరగనుంది. ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ 2 పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు మరిన్ని వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఆగస్ట్ 28, 29 తేదీల్లో పరీక్షలకు హాజరుకావాల్సిన అభ్యర్థుల వివరాలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది ఆర్ఆర్‌బీ. మిగతా అభ్యర్థుల వివరాలను త్వరలో రిలీజ్ చేయనుంది. సిటీ ఇంటిమేషన్, ఫ్రీ ట్రావెల్ పాస్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక అడ్మిట్ కార్డులను పరీక్షకు నాలుగు రోజుల ముందు వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆర్ఆర్‌బీ జేఈ మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు రెండో దశ పరీక్షకు సిటీ ఇంటిమేషన్, ఫ్రీ ట్రావెల్ పాస్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గతేడాది డిసెంబర్‌లో మొత్తం 13487 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేయగా 2 లక్షలకు పైనే అభ్యర్థులు రెండో దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కు అర్హత సాధించారని అంచనా. ఈ నోటిఫికేషన్‌లో 12,872 జూనియర్ ఇంజనీర్-JE, 227 డిపో మెటీరియల్ సూపరింటెండెంట్-DMS, 387 కెమికల్ అండ్ మెటల్లార్జికల్ అసిస్టెంట్-CMA పోస్టుల్ని భర్తీ చేయనుంది ఆర్ఆర్‌బీ. రెండో దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో అభ్యర్థుల సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించనుంది ఆర్ఆర్‌బీ.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Photos: రెడ్‌మీ కే 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో తళుక్కుమన్న బాలీవుడ్ తారలు




ఇవి కూడా చదవండి:

Railway Jobs: మీ దరఖాస్తు రిజెక్ట్ అయిందా? ఫిర్యాదు చేయమంటున్న ఆర్ఆర్‌బీ
Loading...
APSBCL Jobs: ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్‌లో 9267 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత

Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐటీ ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: August 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...