RRB JE: ఆర్ఆర్‌బీ జేఈ రీషెడ్యూల్ పరీక్షల తేదీలు ఇవే

RRB JE CBT-1 Admit Card | ఆర్ఆర్‌బీ జేఈ పరీక్ష రాయాల్సిన అభ్యర్థులు సంబంధిత ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆర్ఆర్‌బీ జేఈ రీషెడ్యూల్ పరీక్షలకు అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: June 18, 2019, 3:11 PM IST
RRB JE: ఆర్ఆర్‌బీ జేఈ రీషెడ్యూల్ పరీక్షల తేదీలు ఇవే
RRB JE: ఆర్ఆర్‌బీ జేఈ రీషెడ్యూల్ పరీక్షల తేదీలు ఇవే
  • Share this:
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB జూనియర్ ఇంజనీర్ పరీక్షలు గత నెలలో ప్రారంభమయ్యాయి. ఆర్ఆర్‌బీ జేఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-1 పరీక్షలు మే 25 నుంచి జూన్ 2 వరకు జరిగాయి. పలు కారణాల వల్ల కొన్ని చోట్ల పరీక్ష రద్దైంది. మరికొన్ని చోట్ల పరీక్ష వాయిదా పడింది. అప్పుడు పరీక్షలు రాయలేకపోయిన అభ్యర్థులకు జూన్ 26 నుంచి జూన్ 28 వరకు ఎగ్జామ్ నిర్వహిస్తోంది రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్. ఆర్ఆర్‌బీ జేఈ పరీక్ష రాయాల్సిన అభ్యర్థులు సంబంధిత ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆర్ఆర్‌బీ జేఈ రీషెడ్యూల్ పరీక్షలకు అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకోండి.

RRB JE CBT-1: అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా...



ముందుగా సంబంధిత అధికారిక ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
మొదటి పేజీలోనే RRB JE రీషెడ్యూల్ పరీక్షల లింక్ కనిపిస్తుంది.
ఆ లింక్ పైన క్లిక్ చేస్తే కొత్త పేజీ కనిపిస్తుంది.
కొత్త పేజీలో మొదటి లింక్ కాల్ లెటర్ డౌన్‌లోడ్ కోసం ఉంటుంది.
ఆ లింక్ క్లిక్ చేసి లాగిన్ వివరాలు ఎంటర్ చేసి అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.మీరు సికింద్రాబాద్ ఆర్ఆర్‌బీలో దరఖాస్తు చేసినట్టైతే RRB JE రీషెడ్యూల్ పరీక్షల అడ్మిట్ కార్డ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో


ఇవి కూడా చదవండి:

Railway Jobs: ఆగ్నేయ మధ్య రైల్వేలో 432 ఉద్యోగాలు

ISRO Jobs: ఇస్రోలో టెక్నీషియన్ పోస్టులు... రూ.69,100 వరకు జీతం

IBPS RRB Jobs: 12,000 పైగా ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
Published by: Santhosh Kumar S
First published: June 18, 2019, 3:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading