RRB JE 2018 : RRB JE ఎగ్జామ్‌ తేదీలపై తప్పుడు వార్తలు..

ఆర్‌ఆర్‌బీ జేఈ పరీక్షల తేదీ, రిజల్ట్స్ విషయంలో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. అభ్యర్థులు అలాంటి న్యూస్‌ని నమ్మొద్దని అధికారులు సూచిస్తున్నారు.

Amala Ravula | news18-telugu
Updated: April 4, 2019, 3:39 PM IST
RRB JE 2018 : RRB JE ఎగ్జామ్‌ తేదీలపై తప్పుడు వార్తలు..
రైల్వే రిక్రూట్‌‌మెంట్ బోర్డు
Amala Ravula | news18-telugu
Updated: April 4, 2019, 3:39 PM IST
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు జేఈ పోస్టుల కోసం తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి ఎగ్జామ్ డేట్, మిగతా వివరాలు ఏం వెల్లడించలేదు. అయితే.. సోషల్ మీడియాలో మాత్రం ఎగ్జామ్ డేట్, మిగతా డేట్స్ అంటూ తప్పుడు వార్తలు సర్క్యూలేట్ అవుతున్నాయి. ఫేక్ నోటిఫికేషన్లో ఆర్ఆర్‌బీ జేఈ ఎగ్జామ్‌కి సంబంధించి మొదటి విడత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మే 27న ఉంటుందంటూ ఫేక్ వెబ్‌సైట్ ద్వారా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో.. అధికారులు అలాంటి వార్తలను నమ్మొద్దని అభ్యర్థులకు సూచిస్తున్నారు.
ఆర్‌ఆర్‌బీ జేఈ పరీక్షల కోసం ఎలాంటి ఎగ్జామ్ డేట్ ఇంకా రిలీజ్ చేయలేదు. ఈ మధ్యనే జేఈ పోస్టులకి అప్లై చేసిన అభ్యర్థుల వివరాలను వెల్లడించింది. ఆర్‌ఆర్‌బీ 13,487 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ గత సంవత్సరం డిసెంబర్‌లో రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈ సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో ఉండే అవకాశముంది. దీనికి సంబంధించిన వివరాలు, తేదీని త్వరలోనే వెల్లడించనుంది ఆర్‌ఆర్‌బీ.

ఇవి కూడా చదవండి..

ESIC Jobs : ESICలో 2,258 జాబ్స్.. పూర్తి వివరాలు ఇవే..

First published: April 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...