ఇటీవల రైల్వే గ్రూడ్ డీ(Railway Group D) పరీక్షలు దశల వారీగా నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ప్రాథమిక కీతో పాటు.. రెస్పాన్స్ షీట్ ను కూడా విడుదల చేశారు. అయితే ఇప్పటికే అభ్యర్థులు తమకు ఎన్ని మార్కులు వస్తాయో ఓ అంచనాకు అయితే వచ్చేశారు. అయితే ఫలితాల(Results) కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మంచి మెరిట్ మార్కులు(Marks) సాధించిన వారు.. పీఈటీ కొరకు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. తక్కువ మార్కులు వచ్చిన వారు మాత్రం నార్మలైజేషన్ స్కోర్ కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తంగా మూడేళ్ల నుంచి ఎదురు చూసిన పరీక్ష పూర్తి కాగా.. ఫలితాలను కూడా త్వరగా వెల్లడించాలని నిరుద్యోగులు(Un Employees) కోరుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. గ్రూప్ డీ పరీక్షలు ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కారణం.. Eastern railway (RRB Kolkata)కు సంబంధించి Asansol division ,Group D యొక్క physical efficiency test (PET) జనవరి 3 నుండి 7 తేదీల్లో జరగబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిపార్ట్ మెంట్ ఉద్యోగులు.. పీఈటీ కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని.. దానికి సంబంధించి ఓ నోట్ విడుదల చేశారు. ఆ నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నోట్ ప్రకారం.. జనవరి 3 నుంచి 7 వరకు ఆ డివిజన్ కు సంబంధించి పీఈటీ పరీక్షలను నిర్వహించనున్నారు. దీని ప్రకారం చూసుకుంటే.. ఫలితాలను డిసెంబర్ 09లోపు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని తర్వాత జనవరి 03 నుంచి పీఈటీ నిర్వహించున్నారు.
Eastern Railway (RRB Kolkata) లో Group Dకి సంబంధించి మొత్తం పోస్టులు 10,873 ఉన్నాయి. PET కి 1:3 నిష్పత్తిలో తీసుకోనున్నారు. దీని ప్రకారం.. అభ్యర్థులు 32,619 PET కి అర్హత సాధిస్తారు. Eastern Railway లో మొత్తం 4 డివిజన్స్ ఉన్నాయి. వీటిలో Asansol డివిజన్ లో సంబంధించి GROUP D PET జనవరి 3 నుండి 7 తేదీల్లో రోజుకి 1250 అభ్యర్థులకు జరగబోతుంది. మొత్తం ఈ డివిజన్లో 6250 అభ్యర్థులకు PET జరుగుతుంది. మిగిలిన అభ్యర్థులకు మిగిలిన 3 Divisions లో PET నిర్వహిస్తారు. ఇదేవిధంగా చూస్తే మన South Central Railway (Secunderabad) 6 డివిజన్స్ ఉన్నాయి.
ఈ 6 డివిజన్స్ లో PET జరగడానికి అవకాశం ఉంది. Physical efficiency test (PET) అనేది ఈసారి అందరి అభ్యర్థులకు ఒకే దగ్గర నిర్వహించే అవకాశం లేదు.. ఆ రైల్వే కి సంబంధించి అన్ని డివిజన్లో నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. దీన్నిబట్టి GROUP D PET అనేది చాలా తొందరగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. అభ్యర్థులు రైల్వే బోర్డు అధికారిక వెబ్సైట్ rrbcdg.gov.inలో ఫలితాలను తనిఖీ చేయవచ్చు. ఇక ఫైనల్ ఫలితాలు విడుదల చేసి.. అపాయింట్ మెంట్స్ అనేవి అభ్యర్థులకు ఏప్రిల్ 2023 నెలలో అందజేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India Railways, JOBS, Jobs in railway, Rrb group d