RRB GROUP D RECRUITMENT CRITERIA CHANGED RAILWAYS REVEAL SELECTION CRITERIA FOR SINGLE EXAM HERE DETAILS NS GH
RRB Group D: ఆర్ఆర్బీ గ్రూప్-D అభ్యర్థులకు అలర్ట్.. మారిన ఎగ్జామ్ క్రైటీరియా, నిబంధనలు.. వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ D పరీక్షల కోసం గతంలో విడుదల చేసిన మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ D పరీక్షల కోసం గతంలో విడుదల చేసిన మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పోటీ పరీక్షకు సంబంధించిన రిక్రూట్మెంట్ (Recruitment) ప్రక్రియలో కొన్ని ప్రధాన మార్పులను ప్రకటిస్తూ నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నం.RRC-01/2019లో పేర్కొన్న కొన్ని “ఐటెమ్స్‌ను” కొత్త నోటిఫికేషన్ సవరించింది. ఏప్రిల్ 7, 2022 నాటి నోటిఫికేషన్.. EWS (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) రిజర్వేషన్, మల్టీ సెషన్ పేపర్ల మార్కుల నార్మలైజేషన్, పోస్ట్‌ల ప్రాధాన్యత, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి అంశాల్లో మార్పులను పేర్కొంది. వివిధ అంశాల్లో చేసిన మార్పులను తాజా నోటీస్‌లో బోర్డు ప్రస్తావించింది. అభ్యర్థులు వీటిని పరిశీలించాలని కోరింది.
మారిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ రూల్స్
డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలిచే అభ్యర్థుల సంఖ్యలో కూడా RRB మార్పులు చేసింది. గతంలో అభ్యర్థులు CBT, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)లో అర్హత సాధించిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలిచేవారు. ఖాళీల సంఖ్య కంటే 1.05 రెట్లు లేదా ఐదు శాతం ఎక్కువ సంఖ్యను ప్రామాణికంగా తీసుకునేవారని నోటీసులో పేర్కొన్నారు. అయితే ఇప్పటి నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలిచే అభ్యర్థుల సంఖ్య నోటిఫై చేసిన ఖాళీల సంఖ్యకు సమానంగా ఉంటుందని RRB ప్రకటించింది. Govt Jobs 2022: పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు.. వాక్ ఇన్ నిర్వహిస్తున్న సంస్థల వివరాలు
పర్సంటైల్ విధానంలోనూ..
ఇకనుంచి గ్రూప్ డీ పరీక్షలకు సంబంధించిన మార్కుల నార్మలైజేషన్.. పర్సంటైల్ ఆధారిత పద్ధతిపై (percentile-based method) ఆధారపడి ఉంటుందని తాజా నోటీసులో పేర్కొన్నారు. ఒకవేళ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఒకే నార్మలైజ్డ్ పర్సంటైల్ స్కోర్ సాధిస్తే, అభ్యర్థుల మెరిట్‌ను వయసు ఆధారంగా నిర్ణయించనున్నారు. అంటే.. ఇప్పుడు ఎవరైనా అభ్యర్థుల స్కోర్ సమానంగా వస్తే.. వయసు ఎక్కువ ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. వయసు కూడా సమానంగా ఉంటే.. వారి పేరు అక్షర క్రమాన్ని (alphabetical order) ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ పరీక్షలతో భర్తీ చేయనున్న అసిస్టెంట్ పాయింట్స్మన్ పోస్టు డెసిగ్నేషన్కు సంబంధించి బోర్డు కొన్ని మార్పులు చేసింది. కొత్త నోటిఫికేషన్ ప్రకారం ఈ డెసిగ్నేషన్‌ను 'పాయింట్‌మెన్' అని పిలుస్తారు. గ్రూప్ D పరీక్షను RRB ఈ ఏడాది జూలై నుంచి నిర్వహించనుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.