Home /News /jobs /

RRB GROUP D PREPARATION THE ONLY TEST FOR RRB GROUP D KNOW PREPARATION TIPS AND SYLLABUS DETAILS EVK

RRB Group D Preparation: ఆర్ఆర్‌బీ గ్రూప్‌-డికి ఒక్క‌టే ప‌రీక్ష‌.. ప్రిప‌రేష‌న్, సిల‌బ‌స్ వివ‌రాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

RRB Group D Preparation | రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ D పరీక్షల కోసం గతంలో విడుదల చేసిన మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. నోటీసు ప్రకారం CBT (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) సెకండ్ స్టేజ్‌ను RRB నిలిపివేసింది. ఇప్పుడు ఒకే దశలో మాత్రమే CBT పరీక్ష ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ప‌రీక్ష‌కు సంబంధించి సెల‌బ‌స్‌, ప్రిప‌రేష‌న్ టిప్స్‌

ఇంకా చదవండి ...
    రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ D పరీక్షల కోసం గతంలో విడుదల చేసిన మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. నోటీసు ప్రకారం CBT (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) సెకండ్ స్టేజ్‌ను RRB నిలిపివేసింది. ఇప్పుడు ఒకే దశలో మాత్రమే CBT పరీక్ష ఉంటుంది. అదనంగా EWS వర్గానికి చెందిన అభ్యర్థులు ఇప్పుడు నోటిఫికేషన్ తేదీ తర్వాత జారీ చేసిన సర్టిఫికేట్‌ను డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో సమర్పించవచ్చు.  ఈ నేప‌థ్యంలో అభ్య‌ర్థులు క‌చ్చితంగా ప్రిప‌రేష‌న్ ప్లాన్ ప‌రీక్ష‌కు స‌న్న‌ద్ధం అయితే.. త‌ప్ప‌కుండా మెరుగైన ఫ‌లితాల‌ను సాధిస్తారు అనడంలో సందేహం లేదు.

    ప‌రీక్ష విధానం..




























    పేప‌ర్మార్కులుప్ర‌శ్న‌లు
    జనరల్ సైన్స్2525
    క్వాంటేటీవ్ ఆప్టిట్యూడ్‌/ మ‌్యాథ‌మెటిక్స్‌2525
    జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్3030
    కరెంట్ అఫైర్స్2020

    ఆర్ఆర్ బీ గ్రూప్ డీ ప‌రీక్ష వంద మార్కులకు ఉంటుంది. ప‌రీక్ష స‌మ‌యం 90 నిమిషాలు అంటే గంట‌న్న‌ర‌. ప్రతీ ప్ర‌శ్న‌కు ఒక్క నిమిషం క‌న్నా త‌క్కువ స‌మ‌యం ఉంటుంది. ప‌రీక్ష‌లో నెగెటీవ్ మార్కులు ఉంటాయి కాబ‌ట్టి వేగం క‌చ్చిత‌త్వం చాలా అవ‌స‌రం.

    Govt Jobs 2022: ఈ వారం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌

    సెల‌బ‌స్ వివ‌రాలు..


    మ్యాథమెటిక్స్ - నెంబర్ సిస్టమ్, BODMAS, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియో అండ్ ప్రపోరేషన్, పర్సెంటేజెస్, మెన్స్యూరేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్‌జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యూలేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్, పైప్స్ ప్రాబ్ల‌మ్‌లు ఉంటాయి.

    జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ - అనాలజీస్, ఆల్ఫబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్‌షిప్స్, సిల్లాగిసమ్, జంబ్లింగ్, వెన్ డయాగ్రాం, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ సఫీషియెన్సీ, కన్‌క్లూజన్స్, డిసిషన్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్‌మెంట్, ఆర్గుమెంట్స్ అండ్ అజంప్షన్స్ టాపిక్స్ ఉంటాయి.

    Jobs in Telangana: కేంద్రీయ విద్యాల‌యంలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేత‌నం రూ.27,500

    కరెంట్ అఫైర్స్ - ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అన్ని అంశాల‌పై అవ‌గాహ‌న ఉండాలి. స్పోర్ట్ వేదికలు, అవార్డులు, ప‌లు ప్ర‌ముఖ సంస్థ‌ల అధినేత‌లు, ఇటీవ‌ల అవార్డులు పొందిన వారి వివ‌రాలు వ‌చ్చి ఉండాలి.

    జనరల్ అవేర్‌నెస్ - ప‌దో త‌ర‌గ‌తి వ‌రుకు ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీతోపాటు ప్ర‌స్తుతం స్పోర్ట్స్, వివిధ రంగాల్లో దేశాభివృద్ధి, ఎకనమిక్స్, పాలిటిక్స్ అంశాలు చ‌ద‌వాలి.

    Jobs in AP: నెల్లూరు జీఎంసీలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేత‌నం నెల‌కు రూ. 17,500.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ విధానం

    ఎలా ప్రిపేర్ అవ్వాలి..


    - ప్ర‌స్తుతం ఫిబ్ర‌వ‌రి 23, 2022 నుంచి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నార‌ర‌.

    - ప‌రీక్ష‌కు సుమ‌రు 30 రోజుల స‌మ‌యం ఉంది.

    - ప్ర‌తీ రోజు టైం టేబుల్ ప్ర‌కారం సెల‌బ‌స్‌లోని అన్ని అంశాల‌ను ప్రాక్టీస్ చేయాలి.

    - వారానికి రెండు లేదా మూడు మోడ‌ల్ పేప‌ర్‌లు అభ్యాసం చేయ‌డం వ‌ల్ల ప‌రీక్ష స‌మ‌యంపై ప‌ట్టు వ‌స్తుంది.

    - ఎందుకుంటే 100 ప్ర‌శ్న‌లు 90 నిమిషాల్లోనే చేయాలి.

    - వేగం, క‌చ్చిత‌త్వం రెండూ అవ‌స‌రం. ప్రాక్టీస్ చేసే ముందు నిర్థిష్ట‌స‌మ‌యంలోనే ప్ర‌శ్న‌లు చేసేలా కృషి చేయండి. దాని వ‌ల్ల ప‌రీక్ష‌లో మెరుగైన మార్కులు సాధిస్తారు.

    - ఐదు టాపిక్స్‌కి రోజుకు రెండు లేదా నాలుగు గంట‌లు కేటాయిస్తే సుల‌భంగా 70 మార్కుల వ‌రుకు స్కోర్ చేయ‌వ‌చ్చు.

    - ఈ సారి క‌ట్ ఆఫ్ 75 నుంచి 80 మ‌ధ్య‌లో ఉంటుంద‌ని కోచింగ్ సెంట‌ర్లు చెబుతున్నాయి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Exams, Indian Railways, Preparation, Railway jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు