RRB GROUP D EXAMS FROM JULY FULL DETAILS ABOUT EXAM PATTERN GH VB
RRB Group D Exam: ఆ నెల నుంచే RRB గ్రూప్ D పరీక్షలు.. ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి పూర్తి వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
లక్షలాది మంది అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైల్వే గ్రూప్ డి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది. ఈ పరీక్షలను జూలై నుంచి వివిధ దశల్లో నిర్వహించేందుకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) సన్నాహాలు చేస్తుంది.
లక్షలాది మంది అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైల్వే గ్రూప్ డి(Railway Group D) పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది. ఈ పరీక్షలను జూలై(July) నుంచి వివిధ దశల్లో నిర్వహించేందుకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) సన్నాహాలు చేస్తుంది. 2019లోనే గ్రూప్ డి (Group D) నోటిఫికేషన్ (Notification) విడుదలైనప్పటికీ.. కరోనా కారణంగా పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ పరీక్షను నిర్వహించేందుకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(Railway Recruitment Board) కసరత్తు చేస్తుంది. ఈ పరీక్ష కోసం దాదాపు 1.15 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్(Document Verification), మెడికల్ ఎగ్జామినేషన్(Medical Examination) ద్వారా ఎంపిక చేస్తారు.
సింగిల్ స్టేజ్ సీబీటీ టెస్ట్ ప్రశ్నాపత్రంలో 100 ప్రశ్నలొస్తాయి. పరీక్షకు 90 నిమిషాల సమయం కేటాయించారు. స్క్రైబ్ సౌకర్యాన్ని ఉపయోగించుకునే దివ్యాంగ అభ్యర్థులకు 120 నిమిషాల సమయం ఉంటుంది. ఈ పరీక్ష షెడ్యూల్, అడ్మిట్ కార్డులు త్వరలోనే ఆయా ప్రాంతీయ వెబ్‌సైట్లలో అందుబాటులోకి రానున్నాయి. ఆర్ఆర్డీ గ్రూప్ డీ నోటిఫికేషన్ ద్వారా 7వ CPC పే మ్యాట్రిక్స్‌లోని లెవెల్ 1 కింద 1,03,769 పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా, ఆర్ఆర్బీ గ్రూప్ డీ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో మొత్తం 4 నాలుగు విభాగాలుంటాయి. ప్రతి విభాగానికి సంబంధించిన ప్రశ్నల సంఖ్య, మార్కుల గురించి తెలుసుకుందాం.
మొత్తం నాలుగు విభాగాలకు కలిపి 100 ప్రశ్నలొస్తాయి. పరీక్షలో అన్నీ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో క్వాలిఫై అయిన వారు మాత్రమే ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్‌కు హాజరయ్యేందుకు అర్హులు. అయితే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాలంటే.. ఆయా కేటగిరీల వారీగా కనీస అర్హత మార్కులు సాధించాలి. జనరల్ 40%, ఈడబ్ల్యూఎస్ 40%, ఓబీసీ (నాన్ క్రీమీలేయర్) 30%, ఎస్సీ 30%, ఎస్టీ 25% కనీస మార్కులు పొందాలి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.