హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RRB Group D Exam Results: గ్రూప్ D అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష ఫలితాలపై అప్ డేట్..

RRB Group D Exam Results: గ్రూప్ D అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష ఫలితాలపై అప్ డేట్..

RRB Group D Update: ఆర్ఆర్ బీ (RRB) Group D పరీక్షల తేదీలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

RRB Group D Update: ఆర్ఆర్ బీ (RRB) Group D పరీక్షల తేదీలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) చివరి ఫేజ్ పరీక్షల తేదీలను రైల్వే అధికారులు(Railway Officials) ప్రకటించారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను(RRC Hubli) సందర్శించడం ద్వారా పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) చివరి ఫేజ్ పరీక్షల తేదీలను రైల్వే అధికారులు(Railway Officials) ప్రకటించారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను(RRC Hubli) సందర్శించడం ద్వారా పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఈ రైల్వే పరీక్ష అనేక దశల్లో నిర్వహించబడుతుంది. RRB గ్రూప్ D ఫేజ్ 1 పరీక్ష 17 ఆగస్టు 2022 నుండి 25 ఆగస్టు 2022 వరకు జరిగాయి. దీనిలోనే సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డుకు(South Central Railway) దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష(Exam) నిర్వహించారు. ఫేజ్ 2 పరీక్షలు ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ మొదటి వారం వరకు నిర్వహించారు. ఇక ఫేజ్ 3 పరీక్షలు సెప్టెంబర్ 8 నుంచి మొదలయ్యాయి.

ఈ పరీక్షలు 19 సెప్టెంబర్ 2022 వరకు నిర్వహించారు. నాల్గవ దశ షెడ్యూల్ ప్రకారం.. 19 సెప్టెంబర్ నుండి 7 అక్టోబర్ 2022 వరకు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఈ దశకు సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయి. ఫేస్ 4లో ముంబయ్ కేంద్రంగా ఉన్న సెంట్రల్ రైల్వే, కోల్ కత్తా కేంద్రంగా ఉన్న ఈస్ట్రర్న్ రైల్వే , గోరఖ్ పూర్ కేంద్రంగా ఉన్న నార్త్ ఈస్ట్ రైల్వే బోర్డులకు సంబంధించి ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఇక తాజాగా ఫేజ్ 5 షెడ్యూల్ ను రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ ఫేజ్ లో ఆర్ఆర్బీ హుబ్లీతో పాటు.. ఫేజ్ 4లలో నిర్వహించని బోర్డులకు సంబంధించిన అభ్యర్థులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇక ఈ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 06 నుంచి ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

TSPSC Halltickets: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాలకు పరీక్ష తేదీ ఖరారు.. వివరాలిలా..

ఇదంతా ఇలా ఉండగా.. దాదాపు కోటికి పైగా అభ్యర్థులు గ్రూప్ డీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. 2018లో విడుదలైన ఈ నోటిఫికేషన్ 4 సంవత్సరాల తర్వాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న చాలా మంది అభ్యర్థులు ఈ నాలుగు సంవత్సరాల కాలంలో వేరే ఉద్యోగాలు చేసే వారు కొందరు ఉంటే.. బిజినెస్ పనులు చేసుకునే వారు మరి కొందరు ఉన్నారు. దీంతో అటెండెన్స్ పర్సెంటేజ్ చాలా వరకు తగ్గింది. దాదాపు 60 నుంచి 70 శాతం వరకు అభ్యర్థులు పరీక్షలు రాసినట్లు తెలుస్తోంది. చివరి ఫేజ్ 5 పరీక్షలు అనేవి అక్టోబర్ 11, 2022తో పూర్తి అవుతాయి.

Jobs In NAL: బీటెక్(B Tech), బీఎస్సీ(B.Sc) విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ 75 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండిలా.. 

ఈ నెల 20 తర్వాత అభ్యర్థులకు సంబంధించి రెస్పాన్స్ షీట్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెలలో అభ్యంతరాలు స్వీకరించి నవంబర్ మొదటి వారంలో ఈ పరీక్ష ఫలితాలు నవంబర్ మొదటి వారంలో విడుదల చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Constable Jobs 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 400 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

నవంబర్ మొదటి వారంలో ఈ ఫలితాలు విడుదలైతే.. అర్హత సాధించిన వారికి పీఈటీ పరీక్షలను డిసెంబర్ లో కంప్లీట్ చేయనున్నారు. ఇదే జరిగితే.. జనవరిలో మెడికల్ టెస్ట్ తో పాటు.. జనవరి చివరి వారంలోగా అభ్యర్థులు ఉద్యోగంలో కూడా జాయిన్ అవుతారు.

Published by:Veera Babu
First published:

Tags: India Railways, Indian, Jobs in railway, Railway jobs, Rrb group d, South Central Railways

ఉత్తమ కథలు