హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RRB Group D Update: గ్రూప్ డీ ఫలితాలపై తాజా అప్ డేట్.. కట్ ఆఫ్ మార్కులు ఇలా.. 

RRB Group D Update: గ్రూప్ డీ ఫలితాలపై తాజా అప్ డేట్.. కట్ ఆఫ్ మార్కులు ఇలా.. 

RRB Group D Update: గ్రూప్ డీ ఫలితాలపై తాజా అప్ డేట్.. కట్ ఆఫ్ మార్కులు ఇలా.. 

RRB Group D Update: గ్రూప్ డీ ఫలితాలపై తాజా అప్ డేట్.. కట్ ఆఫ్ మార్కులు ఇలా.. 

RRB Group D Update: ఆర్ఆర్బీ గ్రూప్ డీకి(RRB Group D)కు సంబంధించి నార్మలైజేషన్ పై తాజాగా అధికారులు ఓ నోటీస్ విడుదల చేశారు. దీనిలో అభ్యర్థులు క్యాటగిరీ వారీగా మినిమం మార్కులు రావాలని.. వారు మాత్రమే మెరిట్ జాబితాలో ఉంటారని పేర్కొన్నారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ఆర్ఆర్బీ గ్రూప్ డీకి(RRB Group D)కు సంబంధించి నార్మలైజేషన్ పై తాజాగా అధికారులు ఓ నోటీస్ విడుదల చేశారు. దీనిలో అభ్యర్థులు క్యాటగిరీ వారీగా మినిమం మార్కులు రావాలని.. వారు మాత్రమే మెరిట్ జాబితాలో ఉంటారని పేర్కొన్నారు.  అంటే.. జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు నార్మటైజేషన్ తర్వాత 40 శాతం వచ్చి ఉండాలి. అంటే 100 మార్కులు 40 మార్కులు రావాలి. అలాగే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ 30 శాతం మార్కులు తెచ్చుకొని ఉండాలి. అంటే 100 కు 30 మార్కులు రావాలి. వీరిని మాత్రమే మెరిట్ జాబితాలో(Merit List) లిస్ట్ చేయడం జరుగుతుందన్నారు.

ఇదిలా ఉండగా.. పరీక్ష ఫలితాలను నేడో రేపో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరీక్ష ఫలితాలకు సంబంధించి లింక్ కూడా.. కొన్ని గంట్లో యాక్టవేట్ కానుంది. పరీక్ష ఫలితలు ఎప్పుడు విడుదల అవుతాయి.. అని ఎదురుచూసే అభ్యర్థులకు ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి.  రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్, RRB గ్రూప్ డి పరీక్షను ఆగస్టు 17 నుండి అక్టోబర్ 11 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. దీని ద్వారా రైల్వేలో గ్రూప్ డి 1,03,769 పోస్టులను భర్తీ చేయనున్నారు.

వివిధ మీడియా నివేదికల ప్రకారం.. RRB త్వరలో గ్రూప్ D ఫలితాలను ప్రకటిస్తుంది. అటువంటి సందర్భాలలో అభ్యర్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్ rrbcdg.gov.in ద్వారా ఫలితాలను తనిఖీ చేయవచ్చు. అభ్యర్థులు దిగువన ఉన్న వివిధ ప్రాంతాల వారీగా  కట్ ఆఫ్ జాబితాను ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇవి కేవలం జనరల్ కేటగిరీ కి సంబంధించి అంచనా మాత్రమే. ఈ స్కోర్లు నార్మలైజేషన్ చేసిన తర్వాత కట్ ఆఫ్ స్కోర్లు.

RRB Zoneకట్ ఆఫ్ మార్కులు(అంచనా)
అజ్మీర్72-76
ప్రయాగ్రాజ్73-77
అహ్మదాబాద్70-74
బెంగళూరు60-64
భోపాల్73-77
బిలాస్పూర్68-72
భువనేశ్వర్72-76
చండీగఢ్73-77
చెన్నై70-74
గోరఖ్‌పూర్72-76
గౌహతి75-79
కోల్‌కతా79-83
ముంబై66-70
పాట్నా75-79
రాంచీ74-78
సికింద్రాబాద్68-72

ఫలితాలతో పాటు, బోర్డు పరీక్ష యొక్క తుది జవాబు పత్రాన్ని కూడా విడుదల చేస్తుంది. అభ్యర్థులు ఇందులో అర్హత సాధించడానికి కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ స్కోర్ చేయాలి. ఫలితాల ప్రకటన తర్వాత, అభ్యర్థులను ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. ఈ మూడు దశల్లో విజయవంతంగా ఉత్తీర్ణులైన అభ్యర్థులు గ్రూప్ డి పోస్టులకు రిక్రూట్ చేయబడతారు. ఎంపికైన అభ్యర్థులు 7వ CPC పే మ్యాట్రిక్స్ ఆధారంగా నెలకు దాదాపు రూ.18,000 పొందుతారు. వీటితో పాటు. ఇతర అలవెన్స్ లు కలుపుకొని రూ.30వేల వరకు జీతం ఉంటుంది.

RRB నుంచి విడుదలైన నోటీస్ ఇదే.. ఇక్కడ క్లిక్ చేయండి.

First published:

Tags: Indian Railways, JOBS, Jobs in railway, Rrb group d

ఉత్తమ కథలు