Home /News /jobs /

RRB GROUP D EXAM RAILWAY JOB IS YOURS DREAM KNOW 30 DAYS PREPARATION PLAN AND SYLLABUS EVK

RRB Group D Exam: రైల్వే జాబ్ మీ క‌ల‌నా.. సెల‌బ‌స్ అండ్ 30 డేస్ ప్రిప‌రేష‌న్ ప్లాన్!

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

RRB Group D Exam Preparation | మూడేళ్లుగా దాదాపు ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు ఎదురు చూస్తున్న ప‌రీక్ష ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఆర్ఆర్‌బీ గ్రూప్‌-డీ పరీక్ష‌లు. ఎట్ట‌కేల‌కు రైల్వే బోర్డు ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఎక్జామ్ డేట్స్ విడుద‌ల చేసింది. ఈ ప‌రీక్ష‌ల‌కు ఇంకా కేవ‌లం నెల రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. 

ఇంకా చదవండి ...
    మూడేళ్లుగా దాదాపు ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు ఎదురు చూస్తున్న ప‌రీక్ష ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఆర్ఆర్‌బీ గ్రూప్‌-డీ (RRB Group-D) పరీక్ష‌లు. ఎట్ట‌కేల‌కు రైల్వే బోర్డు ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఎక్జామ్ డేట్స్ విడుద‌ల చేసింది. ఈ ప‌రీక్ష‌ల‌కు ఇంకా కేవ‌లం నెల రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది.  ఇప్ప‌టికే ఎన్‌టీపీసీ (NTPC)లో 30,000 ఉద్యోగాల‌కు రిజ‌ల్ట్ వ‌చ్చాయి. ఈ సారి క‌ట్ ఆఫ్ అంచ‌నాల‌కు మించి ఉంది. ఈ నేప‌థ్యంలో గ్రూప్‌-డీ కూడా అదే స్థాయిలో ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ నేప‌థ్యంలో ప్రిప‌రేష‌న్ ప‌క‌డ్బందీగా ఉండాలి.   గ్రూప్‌-డీ  ప‌రీక్షకు సంబంధించి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. అయితే ఈ సారి 1-1 ప‌ద్ధ‌తిలో ఎంపిక చేస్తారు కాబ‌ట్టి క‌ట్ ఆఫ్ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ప‌క్క ప్రిప‌రేష‌న్ ప్లాన్‌తో క‌నుక ప‌రీక్ష‌కు సిద్ధం అయితే ఈ సారి జాబ్ మీ సొంతం.

    Career and Courses: మంచి జాబ్ సాధించాల‌నుకొటున్నారా.. ఈ కోర్సులు ట్రై చేయండి


    ప‌రీక్ష విధానం..




























    పేప‌ర్మార్కులుప్ర‌శ్న‌లు
    జనరల్ సైన్స్2525
    క్వాంటేటీవ్ ఆప్టిట్యూడ్‌/ మ‌్యాథ‌మెటిక్స్‌2525
    జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్3030
    కరెంట్ అఫైర్స్2020

    ఆర్ఆర్ బీ గ్రూప్ డీ ప‌రీక్ష వంద మార్కులకు ఉంటుంది. ప‌రీక్ష స‌మ‌యం 90 నిమిషాలు అంటే గంట‌న్న‌ర‌. ప్రతీ ప్ర‌శ్న‌కు ఒక్క నిమిషం క‌న్నా త‌క్కువ స‌మ‌యం ఉంటుంది. ప‌రీక్ష‌లో నెగెటీవ్ మార్కులు ఉంటాయి కాబ‌ట్టి వేగం క‌చ్చిత‌త్వం చాలా అవ‌స‌రం.

    సెల‌బ‌స్ వివ‌రాలు..


    మ్యాథమెటిక్స్ - నెంబర్ సిస్టమ్, BODMAS, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియో అండ్ ప్రపోరేషన్, పర్సెంటేజెస్, మెన్స్యూరేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్‌జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యూలేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్, పైప్స్ ప్రాబ్ల‌మ్‌లు ఉంటాయి.

    GMRC Recruitment: మెట్రోలో 118 కాంట్రాక్టు ఉద్యోగాలు.. అప్లికేష‌న్‌కు వారం రోజులు చాన్స్‌.. అర్హ‌త‌లు ఇవే!

    జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ - అనాలజీస్, ఆల్ఫబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్‌షిప్స్, సిల్లాగిసమ్, జంబ్లింగ్, వెన్ డయాగ్రాం, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ సఫీషియెన్సీ, కన్‌క్లూజన్స్, డిసిషన్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్‌మెంట్, ఆర్గుమెంట్స్ అండ్ అజంప్షన్స్ టాపిక్స్ ఉంటాయి.

    కరెంట్ అఫైర్స్ - ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అన్ని అంశాల‌పై అవ‌గాహ‌న ఉండాలి. స్పోర్ట్ వేదికలు, అవార్డులు, ప‌లు ప్ర‌ముఖ సంస్థ‌ల అధినేత‌లు, ఇటీవ‌ల అవార్డులు పొందిన వారి వివ‌రాలు వ‌చ్చి ఉండాలి.

    జనరల్ అవేర్‌నెస్ - ప‌దో త‌ర‌గ‌తి వ‌రుకు ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీతోపాటు ప్ర‌స్తుతం స్పోర్ట్స్, వివిధ రంగాల్లో దేశాభివృద్ధి, ఎకనమిక్స్, పాలిటిక్స్ అంశాలు చ‌ద‌వాలి.

    ఎలా ప్రిపేర్ అవ్వాలి..


    - ప్ర‌స్తుతం ఫిబ్ర‌వ‌రి 23, 2022 నుంచి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నార‌ర‌.

    - ప‌రీక్ష‌కు సుమ‌రు 30 రోజుల స‌మ‌యం ఉంది.

    - ప్ర‌తీ రోజు టైం టేబుల్ ప్ర‌కారం సెల‌బ‌స్‌లోని అన్ని అంశాల‌ను ప్రాక్టీస్ చేయాలి.

    - వారానికి రెండు లేదా మూడు మోడ‌ల్ పేప‌ర్‌లు అభ్యాసం చేయ‌డం వ‌ల్ల ప‌రీక్ష స‌మ‌యంపై ప‌ట్టు వ‌స్తుంది.

    - ఎందుకుంటే 100 ప్ర‌శ్న‌లు 90 నిమిషాల్లోనే చేయాలి.

    - వేగం, క‌చ్చిత‌త్వం రెండూ అవ‌స‌రం. ప్రాక్టీస్ చేసే ముందు నిర్థిష్ట‌స‌మ‌యంలోనే ప్ర‌శ్న‌లు చేసేలా కృషి చేయండి. దాని వ‌ల్ల ప‌రీక్ష‌లో మెరుగైన మార్కులు సాధిస్తారు.

    - ఐదు టాపిక్స్‌కి రోజుకు రెండు లేదా నాలుగు గంట‌లు కేటాయిస్తే సుల‌భంగా 70 మార్కుల వ‌రుకు స్కోర్ చేయ‌వ‌చ్చు.

    - ఈ సారి క‌ట్ ఆఫ్ 75 నుంచి 80 మ‌ధ్య‌లో ఉంటుంద‌ని కోచింగ్ సెంట‌ర్లు చెబుతున్నాయి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Exams, Indian Railways, JOBS, Railway jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు