మూడేళ్లుగా దాదాపు లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్న పరీక్ష ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ గ్రూప్-డీ (RRB Group-D) పరీక్షలు. ఎట్టకేలకు రైల్వే బోర్డు ఈ పరీక్షలకు సంబంధించిన ఎక్జామ్ డేట్స్ విడుదల చేసింది. పరీక్షలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఎన్టీపీసీలో 30,000 ఉద్యోగాలు, గ్రూప్-డీలో లక్షకు పైగా ఉద్యోగాలను ఈ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇప్పటికే ఎన్టీపీసీ పరీక్షకు సంబంధించిన ప్రిలిమ్స్ పూర్తయ్యాయి కాబట్టి ఫలితాలు వచ్చాక కొద్ది మందే మెయిన్స్‌కు వెళ్తారు. ఇక మిగిలింది గ్రూప్-డీ పరీక్ష ఈ నేపథ్యంలో ఎక్కువ పోస్టులు తక్కువ పోటీ ఉండే ఈ ఎక్జామ్కి పక్కాగా ప్రిపేర్ (Prepare) అయితే జాబ్ మీ సొంతం. ఈ పరీక్ష సెలబస్ ఏంటీ? ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసుకోండి.
పరీక్ష విధానం..
పేపర్ | మార్కులు | ప్రశ్నలు |
జనరల్ సైన్స్ | 25 | 25 |
క్వాంటేటీవ్ ఆప్టిట్యూడ్/ మ్యాథమెటిక్స్ | 25 | 25 |
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ | 30 | 30 |
కరెంట్ అఫైర్స్ | 20 | 20 |
ఆర్ఆర్ బీ గ్రూప్ డీ పరీక్ష వంద మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు అంటే గంటన్నర. ప్రతీ ప్రశ్నకు ఒక్క నిమిషం కన్నా తక్కువ సమయం ఉంటుంది. పరీక్షలో నెగెటీవ్ మార్కులు ఉంటాయి కాబట్టి వేగం కచ్చితత్వం చాలా అవసరం.
మ్యాథమెటిక్స్ - నెంబర్ సిస్టమ్, BODMAS, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియో అండ్ ప్రపోరేషన్, పర్సెంటేజెస్, మెన్స్యూరేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యూలేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్, పైప్స్ ప్రాబ్లమ్‌లు ఉంటాయి.
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ - అనాలజీస్, ఆల్ఫబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిల్లాగిసమ్, జంబ్లింగ్, వెన్ డయాగ్రాం, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ సఫీషియెన్సీ, కన్‌క్లూజన్స్, డిసిషన్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్మెంట్, ఆర్గుమెంట్స్ అండ్ అజంప్షన్స్ టాపిక్స్ ఉంటాయి.
కరెంట్ అఫైర్స్ - ప్రస్తుతం జరుగుతున్న అన్ని అంశాలపై అవగాహన ఉండాలి. స్పోర్ట్ వేదికలు, అవార్డులు, పలు ప్రముఖ సంస్థల అధినేతలు, ఇటీవల అవార్డులు పొందిన వారి వివరాలు వచ్చి ఉండాలి.
జనరల్ అవేర్నెస్ - పదో తరగతి వరుకు ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీతోపాటు ప్రస్తుతం స్పోర్ట్స్, వివిధ రంగాల్లో దేశాభివృద్ధి, ఎకనమిక్స్, పాలిటిక్స్ అంశాలు చదవాలి.
ఎలా ప్రిపేర్ అవ్వాలి..
ప్రస్తుతం ఫిబ్రవరి 23, 2022 నుంచి పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో 60 రోజుల వ్యవధి ఉంది. ప్రతీ రోజు టైం టేబుల్ ప్రకారం సెలబస్లోని అన్ని అంశాలను ప్రాక్టీస్ చేయాలి. వారానికి రెండు లేదా మూడు మోడల్ పేపర్లు అభ్యాసం చేయడం వల్ల పరీక్ష సమయంపై పట్టు వస్తుంది. ఎందుకుంటే 100 ప్రశ్నలు 90 నిమిషాల్లోనే చేయాలి. కాబట్టి వేగం, కచ్చితత్వం రెండూ అవసరం. ఐదు టాపిక్స్‌కి రోజుకు రెండు లేదా నాలుగు గంటలు కేటాయిస్తే సులభంగా 70 మార్కుల వరుకు స్కోర్ చేయవచ్చు. ఈ సారి కట్ ఆఫ్ 65 నుంచి 70 మధ్యలో ఉంటుందని కోచింగ్ సెంటర్లు చెబుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Exams, India Railways, JOBS, Railway jobs, RRB