హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RRB Group D Update: గుడ్ న్యూస్.. ఆర్ఆర్ బీ (RRB) Group D పరీక్షల తేదీలు విడుదల..

RRB Group D Update: గుడ్ న్యూస్.. ఆర్ఆర్ బీ (RRB) Group D పరీక్షల తేదీలు విడుదల..

RRB Group D Update: గుడ్ న్యూస్.. ఆర్ఆర్ బీ (RRB) Group D పరీక్షల తేదీలు విడుదల..

RRB Group D Update: గుడ్ న్యూస్.. ఆర్ఆర్ బీ (RRB) Group D పరీక్షల తేదీలు విడుదల..

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గ్రూప్ D రిక్రూట్‌మెంట్ రాత పరీక్షల తేదీలను రైల్వే అధికారులు(Railway Officials) ప్రకటించారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను(RRC Hubli) సందర్శించడం ద్వారా పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గ్రూప్ D రిక్రూట్‌మెంట్ రాత పరీక్షల తేదీలను రైల్వే అధికారులు(Railway Officials) ప్రకటించారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను(RRC Hubli) సందర్శించడం ద్వారా పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ పరీక్ష అనేక దశల్లో నిర్వహించబడుతుంది. RRB గ్రూప్ D ఫేజ్ 1 పరీక్ష 17 ఆగస్టు 2022 నుండి 25 ఆగస్టు 2022 వరకు జరిగాయి. దీనిలోనే సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డుకు(South Central Railway) దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష(Exam) నిర్వహించారు. ఫేజ్ 2 పరీక్షలు ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ మొదటి వారం వరకు నిర్వహించారు. ఇక ఫేజ్ 3 పరీక్షలు సెప్టెంబర్ 8 నుంచి మొదలయ్యాయి.

ఈ పరీక్షలు 19 సెప్టెంబర్ 2022 వరకు నిర్వహించారు. నాల్గవ దశ షెడ్యూల్ ప్రకారం.. 19 సెప్టెంబర్ నుండి 7 అక్టోబర్ 2022 వరకు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఈ దశకు సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయి. ఫేస్ 4లో ముంబయ్ కేంద్రంగా ఉన్న సెంట్రల్ రైల్వే, కోల్ కత్తా కేంద్రంగా ఉన్న ఈస్ట్రర్న్ రైల్వే , గోరఖ్ పూర్ కేంద్రంగా ఉన్న నార్త్ ఈస్ట్ రైల్వే బోర్డులకు సంబంధించి ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఇక తాజాగా ఫేజ్ 5 షెడ్యూల్ ను రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ ఫేజ్ లో ఆర్ఆర్బీ హుబ్లీతో పాటు.. ఫేజ్ 4లలో నిర్వహించని బోర్డులకు సంబంధించిన అభ్యర్థులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇక ఈ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 06 నుంచి ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

TCS Jobs 2022: ఫ్రెషర్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన TCS.. ఆ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 11 వరకు ఈ షెడ్యల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం ఆర్ఆర్బీ గ్రూప్ డీ అనేది 5 ఫేజ్ లల్లో నిర్వహిస్తున్నారు. ఈ ఫేజ్ తో గ్రూప్ డీ పరీక్షలు కంప్లీట్ అయిపోతాయి. అదే సమయంలో.. పరీక్షకు సంబంధించి సిటీ వివరాలను సెప్టెంబర్ 27 ఉదయం 11 గంటలకు జారీ చేయబడుతుందని పేర్కొన్నారు.

Indian Railway jobs: రైల్వేలో ఉద్యోగాలు .. రాత పరీక్ష లేదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

SC మరియు ST కేటగిరీ అభ్యర్థులు కూడా సెప్టెంబర్ 27 సాయంత్రం 6 గంటల నుండి ఉచిత రవాణాకు సంబంధించి అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. RRB గ్రూప్ D రిక్రూట్‌మెంట్ పరీక్ష యొక్క ఐదవ దశ అడ్మిట్ కార్డ్‌లు పరీక్షకు నాలుగు రోజుల ముందు జారీ చేయబతాయి. 06వ తారీఖున పరీక్ష ఉన్న అభ్యర్థులకు అక్బోటర్ 02, 2022 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

ఈ నోటీస్ కు సంబంధించి PDF కొరకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, RRB, Rrb group d

ఉత్తమ కథలు