Home /News /jobs /

RRB GROUP D EXAM NOT ONE TWO EXAMS CHANGES IN RRB GROUP D EXAM PATTERN KNOW DETAILS EVK

RRB Group D Exam: ఆర్ఆర్‌బీ గ్రూప్‌-డీ ప‌రీక్ష‌ల్లో భారీ మార్పు.. ఒక‌టి కాదు.. రెండు ప‌రీక్ష‌లు!

ఆర్ఆర్‌బీ గ్రూప్‌-డీ ప‌రీక్ష‌

ఆర్ఆర్‌బీ గ్రూప్‌-డీ ప‌రీక్ష‌

RRB Group D Exam changes | మూడేళ్లుగా దాదాపు ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు ఎదురు చూస్తున్న ప‌రీక్ష ఆర్ఆర్‌బీ గ్రూప్‌-డీ (RRB Group-D) పరీక్ష‌లు. ఎట్ట‌కేల‌కు రైల్వే బోర్డు ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఎక్జామ్ డేట్స్ విడుద‌ల చేసింది. అయితే రైల్వే బోర్డు తాజాగా పరీక్ష విధానంలో పెద్ద‌మార్పు తీసుకొచ్చింది.  

ఇంకా చదవండి ...
    మూడేళ్లుగా దాదాపు ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు ఎదురు చూస్తున్న ప‌రీక్ష  ఆర్ఆర్‌బీ గ్రూప్‌-డీ (RRB Group-D) పరీక్ష‌లు. ఎట్ట‌కేల‌కు రైల్వే బోర్డు ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఎక్జామ్ డేట్స్ విడుద‌ల చేసింది. అయితే రైల్వే బోర్డు తాజాగా పరీక్ష విధానంలో పెద్ద‌మార్పు తీసుకొచ్చింది.  కొత్త విధానానికి సంబంధించిన నోటిఫికేష‌న్‌ను ఆర్ఆర్‌బీ చెన్నై అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. త్వ‌ర‌లో అన్ని రీజియ‌న్‌ల‌లో ఈ నోటిఫికేష‌న్ అందుబాటులో ఉండే అవ‌కాశం ఉంది. ఈ నోటిఫికేష‌న్ చూడాల‌నుకొనే వారు అధికారిక వెబ్‌సైట్‌ https://www.rrbchennai.gov.in/ ను సంద‌ర్శించాలి. గతంలో ఒక్క ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ టెస్ట్‌తో అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసేవారు. ఇప్పుడు ఈ నోటిఫికేష‌న్ ప్ర‌కారం అభ్య‌ర్థుల‌కు సీబీటీ-1, సీబీటీ-2 అని రెండు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు.

    RRB Group D Exam: రైల్వే జాబ్ మీ క‌ల‌నా.. సెల‌బ‌స్ అండ్ 30 డేస్ ప్రిప‌రేష‌న్ ప్లాన్!

    గ‌తంలో తెలిపిన నోటిఫికేష‌న్ ప్ర‌కారం సీబీటీ-1 (CBT-1) ప‌రీక్ష ఫిబ్ర‌వ‌రి 23, 2022 నుంచి ప్రారంభం అవుతుంది. ఆ ప‌రీక్ష‌కు సంబంధించిన విధివిధానాల్లో ఎటువంటి మార్పు లేద‌ని తెలిపింది. తాజా నోటిఫికేష‌న్ ప్ర‌కారం..

    Govt Jobs 2022: ఈ వారం మీరు అప్లై చేయాల్సిన టాప్ 5 ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు

    సీబీటీ-1  ప‌రీక్ష విధానం..




























    పేప‌ర్మార్కులుప్ర‌శ్న‌లు
    జనరల్ సైన్స్2525
    క్వాంటేటీవ్ ఆప్టిట్యూడ్‌/ మ‌్యాథ‌మెటిక్స్‌2525
    జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్3030
    కరెంట్ అఫైర్స్2020

    ఆర్ఆర్ బీ గ్రూప్ డీ ప‌రీక్ష వంద మార్కులకు ఉంటుంది. ప‌రీక్ష స‌మ‌యం 90 నిమిషాలు అంటే గంట‌న్న‌ర‌. ప్రతీ ప్ర‌శ్న‌కు ఒక్క నిమిషం క‌న్నా త‌క్కువ స‌మ‌యం ఉంటుంది. ప‌రీక్ష‌లో నెగెటీవ్ మార్కులు ఉంటాయి కాబ‌ట్టి వేగం క‌చ్చిత‌త్వం చాలా అవ‌స‌రం.

    Jobs in Wipro: ఫ్రెష‌ర్స్‌కు గుడ్ న్యూస్‌.. విప్రోలో ఉద్యోగాలు.. నెల‌కు రూ.29,000 వేతనం.. అప్లికేష‌న్ ప్రాసెస్‌

    సీబీటీ-2  ప‌రీక్ష విధానం..




























    పేప‌ర్మార్కులుప్ర‌శ్న‌లు
    జనరల్ సైన్స్3030
    క్వాంటేటీవ్ ఆప్టిట్యూడ్‌/ మ‌్యాథ‌మెటిక్స్‌3030
    జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్3535
    కరెంట్ అఫైర్స్2525

    ఆర్ఆర్ బీ గ్రూప్ డీ ప‌రీక్ష 90 మార్కులకు ఉంటుంది. ప‌రీక్ష స‌మ‌యం 90 నిమిషాలు అంటే గంట‌న్న‌ర‌. ప్రతీ ప్ర‌శ్న‌కు ఒక్క నిమిషం క‌న్నా త‌క్కువ స‌మ‌యం ఉంటుంది.

    సెల‌బ‌స్ వివ‌రాలు..

    మ్యాథమెటిక్స్ - నెంబర్ సిస్టమ్, BODMAS, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియో అండ్ ప్రపోరేషన్, పర్సెంటేజెస్, మెన్స్యూరేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్‌జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యూలేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్, పైప్స్ ప్రాబ్ల‌మ్‌లు ఉంటాయి.

    Jobs in Andhra Pradesh: నెల్లూరు జిల్లాలో ఉద్యోగాలు.. ప‌రీక్ష లేకుండా ఇంటర్వ్యూలు.. అర్హ‌త‌లు ఇవే!

     జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ - అనాలజీస్, ఆల్ఫబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్‌షిప్స్, సిల్లాగిసమ్, జంబ్లింగ్, వెన్ డయాగ్రాం, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ సఫీషియెన్సీ, కన్‌క్లూజన్స్, డిసిషన్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్‌మెంట్, ఆర్గుమెంట్స్ అండ్ అజంప్షన్స్ టాపిక్స్ ఉంటాయి.

    కరెంట్ అఫైర్స్ - ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అన్ని అంశాల‌పై అవ‌గాహ‌న ఉండాలి. స్పోర్ట్ వేదికలు, అవార్డులు, ప‌లు ప్ర‌ముఖ సంస్థ‌ల అధినేత‌లు, ఇటీవ‌ల అవార్డులు పొందిన వారి వివ‌రాలు వ‌చ్చి ఉండాలి.

    జనరల్ అవేర్‌నెస్ - ప‌దో త‌ర‌గ‌తి వ‌రుకు ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీతోపాటు ప్ర‌స్తుతం స్పోర్ట్స్, వివిధ రంగాల్లో దేశాభివృద్ధి, ఎకనమిక్స్, పాలిటిక్స్ అంశాలు చ‌ద‌వాలి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Exams, Indian Railways, Railway jobs, RRB

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు