హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RRB Group D: ఆర్ఆర్‌బీ గ్రూప్-డీ అభ్యర్థులకు అలర్ట్.. డిసెంబర్ 15న ఓపెన్ కానున్న‌ అప్లికేషన్ ఎడిట్ లింక్

RRB Group D: ఆర్ఆర్‌బీ గ్రూప్-డీ అభ్యర్థులకు అలర్ట్.. డిసెంబర్ 15న ఓపెన్ కానున్న‌ అప్లికేషన్ ఎడిట్ లింక్

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

RRB Group D: గ్రూప్‌-డీ పోస్టులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB). దరఖాస్తులు తిరస్కరణకు గురైన అభ్యర్థుల కోసం దరఖాస్తు ఫారం ఎడిట్ (Edit) చేసుకునే లింక్‌ను డిసెంబర్ 15 విడుదల చేస్తామని ప్రకటించింది.

ఇంకా చదవండి ...

గ్రూప్‌-డీ పోస్టులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (Railway Recruitment Board). దరఖాస్తులు తిరస్కరణకు గురైన అభ్యర్థుల కోసం దరఖాస్తు ఫారం ఎడిట్ చేసుకునే లింక్‌ను డిసెంబర్ 15 విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ లింకు  https://rrbsecunderabad.nic.in/  లేదా ఇతర రీజినల్ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డీ 2021 లెవల్  1 (RRB Group D Level 1) పరీక్ష తేదీ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దరఖాస్తులు తిరస్కరణకు గురైన అభ్యర్థులు డిసెంబర్ 15న విడుదలయ్యే కరెక్షన్ విండో ద్వారా మళ్లీ తమ అప్లికేషన్ ఫారం అప్‌డేట్ (Update) చేయవచ్చు.  ఈ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ (Registration Process)ను మార్చి 12, 2019న ఆర్‌ఆర్‌బీ (RRB) ప్రారంభించింది. అప్లికేషన్ ప్రాసెస్  ఏప్రిల్ 12, 2019న ముగిసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ (Recruitment Drive) ద్వారా ఆర్‌ఆర్‌బీ మొత్తం 16 రైల్వే జోన్‌లలోని 1,03,769 గ్రూప్‌-డీ పోస్టులను భర్తీ చేస్తుంది.

ఎప్పుడో నిర్వహించాల్సిన ఈ పరీక్ష కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తారా అని లక్షలాది మంది అభ్యర్థులు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌బీ తాజా అప్‌డేట్ అందించింది.

Jobs in Andhra Pradesh: శ్రీ‌కాకుళం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో 85 ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌


ఇన్వాలిడ్ ఫొటోగ్రాఫ్, సిగ్నేచర్ కారణంగా దరఖాస్తులు తిరస్కరణకు గురైన అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్ పారంను అప్‌డేట్ చేసుకోవడానికి వీలు ఉంటుందని ఆర్‌ఆర్‌బీ తెలిపింది. ఈ అభ్యర్థులు తమ దరఖాస్తును సవరించేందుకు స్పష్టంగా కనిపించే ఫొటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్‌లోడ్ చేసుకోవచ్చు.

అప్‌డేట్ కోసం ఏం చేయాలి..

Step 1 :  ఆర్‌ఆర్‌బీల వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉన్న సీఈఎన్ నంబర్ RRC-01/2019 స్పెసిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు స్కాన్ చేసిన తమ ఫొటోగ్రాఫ్, సంతకాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని ఆర్‌ఆర్‌బీ వెల్లడించింది.

Step 2 : ఈ అవకాశాన్ని వాడుకునేందుకు అభ్యర్థులు అప్లికేషన్ స్టేటస్ (Application Status) చెక్ చేయాల్సి ఉంటుంది. రీజనల్ వెబ్‌సైట్‌ల్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ అఫ్ బర్త్ నమోదు చేసి లొకేషన్ స్టేటస్ చెక్ చేయవచ్చు.

Step 3 : అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఆర్‌ఆర్‌బీలు/ఆర్‌ఆర్‌సీ అప్‌డేట్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే సందర్శించాలి.

IISC Online Course: డిజిటల్ హెల్త్​పై ఐఐఎస్సీ బెంగళూరు ఆరు నెలల ఆన్‌లైన్ కోర్సు.. అర్హత, ఫీజు వివరాలివే..


Step 4 :  చెల్లని ఫోటోగ్రాఫ్ లేదా సంతకం కారణంగా దరఖాస్తు రిజెక్షన్ కు గురైన అభ్యర్థులకు మాత్రమే ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చారు.

Step 5 :  ఇప్పటికే దరఖాస్తు యాక్సెప్ట్ అయిన అభ్యర్థులు సవరణ లింక్ ద్వారా మళ్లీ దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు.

Step 6 : మరిన్ని వివరాల కోసం ఆఫీషియల్ నోటీస్ లింకుపై https://rrbsecunderabad.nic.in/pdf/Notice%20for%20modification%20link-RRC.pdf క్లిక్ చేయండి.

పరీక్ష రాసేందుకు అభ్యర్థులు 12వ తరగతి పాసై ఉండాలి. అలాగే పరిమితి 18 నుంచి 30 లోపు ఉండాలి. RRB గ్రూప్ D పరీక్షను త్వరగా నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రైల్వే బోర్డు దీనిని త్వరలోనే నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Published by:Sharath Chandra
First published:

Tags: Indian Railway, JOBS, Railway jobs, RRB

ఉత్తమ కథలు