RRB Exam: మే 10న ఆర్ఆర్‌బీ ఏఎల్‌పీ పరీక్ష... పూర్తి వివరాలివే

RRB ALP CBT 3 2019 Exam | మే 10న శుక్రవారం జరగబోయే పరీక్షకు హాల్ టికెట్ రిలీజ్ చేసింది ఆర్ఆర్‌బీ. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

news18-telugu
Updated: May 8, 2019, 12:54 PM IST
RRB Exam: మే 10న ఆర్ఆర్‌బీ ఏఎల్‌పీ పరీక్ష... పూర్తి వివరాలివే
RRB Exam: మే 10న ఆర్ఆర్‌బీ ఏఎల్‌పీ పరీక్ష... పూర్తి వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: May 8, 2019, 12:54 PM IST
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ అసిస్టెంట్ లోకోమోటీవ్ పైలట్/టెక్నీషియన్ యాప్టిట్యూడ్ టెస్ట్ మే 10న జరగనుంది. తుఫాను కారణంగా ఒడిశాలో ఆర్ఆర్‌బీ ఏఎల్‌పీ, టెక్నీషియన్ పరీక్ష వాయిదా పడింది. దేశంలోని మిగతా ప్రాంతాల్లో పరీక్ష షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది. ఇప్పటికే ఈ పరీక్షకు క్వాలిఫై అయిన వారికోసం కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ మాక్ లింక్ యాక్టివేట్ చేసింది ఆర్ఆర్‌బీ. ఆర్ఆర్‌బీకి చెందిన అన్ని రీజనల్ వెబ్‌సైట్లలో మాక్ టెస్ట్ లింక్ చూడొచ్చు. ఆన్‌లైన్ పరీక్షపై అవగాహన పెంచుకోవాలనుకుంటే మాక్ టెస్ట్ అటెండ్ కావొచ్చు. ఇక మే 10న శుక్రవారం జరగబోయే పరీక్షకు హాల్ టికెట్ రిలీజ్ చేసింది ఆర్ఆర్‌బీ. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ట్రావెల్ పాస్, హాల్ టికెట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకోండి.

Read this: RRB: రైల్వే ఉద్యోగానికి అప్లై చేశారా? ఈ పుస్తకాలు చదవండి

ముందుగా ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

అడ్మిట్ కార్డ్ పైన క్లిక్ చేయండి.


మరో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
మీ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో లాగిన్ చేసి అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ కోసం ఈ లింక్ క్లిక్ చేయొచ్చు.
http://rrbalp.digialm.com/EForms/configuredHtml/1907/57281/login.html

Read this: Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి...

అభ్యర్థులు ఒక రోజు ముందుగానే అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడం మంచిది. అడ్మిట్ కార్డ్ లేకపోతే పరీక్షకు హాజరు అయ్యే అవకాశం ఉండదు. ఆర్ఆర్‌బీ గ్రూప్ సీ అసిస్టెంట్ లోకోమోటీవ్ పైలట్/టెక్నీషియన్ నోటిఫికేషన్ గతేడాది ఫిబ్రవరిలో రిలీజైంది. మొదట 25,500 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఆర్ఆర్‌బీ. ఆ తర్వాత 64,371 సంఖ్యకు పోస్టుల్ని పెంచింది.

Photos: గూగుల్ పిక్సెల్ 3ఏ, 3ఏ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్స్ ఎలా ఉన్నాయో చూశారా?

ఇవి కూడా చదవండి:

RRB: రైల్వే జాబ్‌కు అప్లై చేశారా? జాగ్రత్త అంటున్న ఆర్ఆర్‌బీ

Google Pixel 3a: గూగుల్ పిక్సెల్ 3ఏ, 3ఏ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్... ప్రత్యేకతలు ఇవే

Android Q: ఆండ్రాయిడ్ 10 క్యూ రిలీజ్ చేసిన గూగుల్... ఫీచర్స్ ఇవే
First published: May 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...