RPF Jobs: రైల్వేలో 9,000 ఖాళీల భర్తీ... 4,500 పోస్టులు మహిళలకే: పీయూష్ గోయల్

RPF Jobs | రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో మొత్తం 8619 కానిస్టేబుళ్లు, 1120 ఎస్సై పోస్టుల్ని భర్తీ చేస్తోంది భారతీయ రైల్వే. అందులో 4216 కానిస్టేబుల్, 201 ఎస్సై పోస్టుల్ని మహిళల కోసం కేటాయించడం విశేషం.

news18-telugu
Updated: June 28, 2019, 5:27 PM IST
RPF Jobs: రైల్వేలో 9,000 ఖాళీల భర్తీ... 4,500 పోస్టులు మహిళలకే: పీయూష్ గోయల్
RPF Jobs: రైల్వేలో 9,000 ఖాళీల భర్తీ... 4,500 పోస్టులు మహిళలకే: పీయూష్ గోయల్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారతీయ రైల్వేకు చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌-RPF విభాగంలో 9,000 ఖాళీలను భర్తీ చేస్తున్నామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అందులో 50 శాతం అంటే 4,500 పోస్టుల్లో మహిళా కానిస్టేబుళ్లను నియమించనున్నట్టు శుక్రవారం రాజ్యసభకు వివరించారు. ప్రస్తుతం ఆర్‌పీఎఫ్‌లో మహిళా కానిస్టేబుళ్లు 2.25 శాతం మాత్రమే ఉన్నారని, ఈ అంశంపై దృష్టిపెట్టాలని ప్రధానమంత్రి ఆదేశించారని, అందుకే మొత్తం ఖాళీల్లో 50 శాతం అంటే 4,500 మంది లేడీ కానిస్టేబుళ్లను నియమించుకోబోతున్నామని పీయూష్ గోయల్ తెలిపారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ భారతీయ రైల్వేలో భాగం. ఆర్‌‌పీఎఫ్‌లో భారీగా ఖాళీలున్నాయి. వాటి భర్తీ ప్రక్రియను గతేడాది చేపట్టింది కేంద్ర ప్రభుత్వం.

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో మొత్తం 8619 కానిస్టేబుళ్లు, 1120 ఎస్సై పోస్టుల్ని భర్తీ చేస్తోంది భారతీయ రైల్వే. అందులో 4216 కానిస్టేబుల్, 201 ఎస్సై పోస్టుల్ని మహిళల కోసం కేటాయించడం విశేషం. ఈ ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని, ఆ తర్వాత ఆర్‌పీఎఫ్‌లో లేడీ కానిస్టేబుల్, ఆఫీసర్ల సంఖ్య పెరుగుతుందని చెప్పారు రైల్వే మంత్రి పీయూష్ గోయల్. ఇక మహిళా కానిస్టేబుళ్లకు వాకీటాకీ అందించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. గవర్నమెంట్ రైల్వే పోలీస్-GRP శాంతిభద్రతల్ని పర్యవేక్షిస్తే, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్-RPF రైల్వే ఆస్తులకు రక్షణగా నిలుస్తాయన్నారు.

రైల్వేలో మొత్తం 2.32 లక్షల ఖాళీలున్నాయని, త్వరలో 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, రెండేళ్లలో మరో లక్ష మంది ఉద్యోగులు రిటైరౌతారని ఈ ఏడాది జనవరిలోనే ప్రకటించారు పీయూష్ గోయల్. ఇప్పటికే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ భారతీయ రైల్వేలో లక్షన్నరకు పైగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. త్వరలో మరిన్ని పోస్టులకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి రైల్వే ఉద్యోగం చేయాలనుకుంటే ఇప్పటినుంచే పరీక్షలకు సిద్ధమవడం మంచిది.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Photos: ఫ్యాషన్‌‌తో ఇన్‌స్టాగ్రామ్‌ స్టార్‌గా మారిన జపనీస్ తాత


ఇవి కూడా చదవండి:
Loading...
HCL Jobs: హెచ్‌సీఎల్‌లో 3000 ఫ్రెషర్స్‌కి ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ పాసైతే చాలు

SBI Loan: చదువుకోవడానికి ఎస్‌బీఐ లోన్... అప్లై చేయండి ఇలా

Jobs: ఆ రంగంలో కొత్తగా 1,49,000 ఉద్యోగాలు
First published: June 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...