Home /News /jobs /

ROM CHARGING LAKHS TO OFFERING PROXY CANDIDATES IS EXAM SCRIBE SERVICE TURNING INTO BUSINESS UMG GH

Exam Scribe: ఎగ్జామ్ స్క్రైబ్ సర్వీస్ ఒక బిజినెస్‌గా మారుతోందా..? న్యూస్18 పరిశీలనలో షాకింగ్ విషయాలు

ఎగ్జామ్ స్క్రైబ్ సర్వీస్ ఒక బిజినెస్‌గా మారుతోందా..?

ఎగ్జామ్ స్క్రైబ్ సర్వీస్ ఒక బిజినెస్‌గా మారుతోందా..?

దృష్టి లోపం ఉన్న విద్యార్థులు ఎగ్జామ్ రాయడంలో వాలంటరీగా కొంతమంది సహాయం చేస్తుంటారు. వీరిని స్క్రైబ్‌ అంటారు. అయితే ఇలా వాలంటరీగా అందించే సహాయం ప్రస్తుతం వ్యాపారంగా మారింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
దృష్టి లోపం ఉన్న విద్యార్థులు ఎగ్జామ్ రాయడంలో వాలంటరీగా కొంతమంది సహాయం చేస్తుంటారు. వీరిని స్క్రైబ్‌ అంటారు. అయితే ఇలా వాలంటరీగా అందించే సహాయం ప్రస్తుతం వ్యాపారంగా మారింది. ఒకవైపు అర్హులైన విద్యార్థులు స్క్రైబ్‌ను పొందడం కష్టంగా ఉండగా, మరోవైపు అనేక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు ప్రాక్సీ అభ్యర్థులను స్క్రైబ్‌గా పంపించి ఎగ్జామ్ రాయిస్తామని ఆఫర్లు ఇస్తున్నాయి. వీరు అభ్యర్థుల తరఫున ఎగ్జామ్ రాసి, అందుకు లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పరీక్షల ఆధారంగా అనేక మంది దృష్టి లోపం ఉన్న అభ్యర్థుల నుంచి స్క్రైబ్స్ రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు అడుగుతున్నారు. దీంతో సేవ అనేది ఒక వ్యాపారంగా మారింది. ఇది వాలంటరీ స్క్రైబ్ కోసం చూసే అభ్యర్థులకు, ముఖ్యంగా అల్ప ఆదాయ వర్గాల వారి భవిష్యత్తుకు ప్రతికూలంగా మారుతోంది.

* బహిరంగ రహస్యమే
దృష్టి లోపం ఉన్నవారికి పరిమిత సంఖ్యలో ఖాళీలు ఉండటంతో, చాలా మంది అక్రమ మార్గంలో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలామంది తమకు ఎగ్జామ్ రాయడంలో సహాయం చేయగలిగే ప్రాక్సీ అభ్యర్థులను స్క్రైబ్‌గా సెలక్ట్ చేసుకుంటున్నారు. ఇందుకు భారీగా డబ్బులు ఇస్తున్నారు. స్క్రైబ్ బిజిసెస్ ఇప్పుడు బహిరంగ రహస్యమని చెబుతున్నారు దృష్టిలోపం ఉన్న వ్యక్తుల హక్కుల కార్యకర్త, నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ సంస్థ కార్యదర్శి SK సింగ్. స్క్రైబ్ వనరులు లేకపోవడం, అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం కావడానికి తగినంత మెటీరియల్ అందుబాటులో లేకపోవడం, దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు తక్కువ ఉద్యోగ ఖాళీలు ఉండటం.. వంటి కారణాలు ఈ వ్యాపారం అభివృద్ధి చెందడానికి బాటలు వేశాయని సింగ్ పేర్కొన్నారు. ఈ ప్రాక్సీ అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యేందుకు 2,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు డిమాండ్ చేస్తారు. ఎక్కువ డబ్బు ఇస్తే, అభ్యర్థి తరపున ప్రిపేర్ అయ్యి, వీరే సొంతంగా ఎగ్జామ్ రాస్తున్నారని SK సింగ్ ఆరోపించారు.

ఇదీ చదవండి: BGMIపై సంచలన నిర్ణయం.. మొబైల్ గేమ్ నిషేధంపై కంపెనీ రియాక్షన్ ఇదే..!


* పాస్ అవ్వడం పక్కా..!
'ప్రాక్సీ స్క్రైబ్స్' గురించి తెలుసుకోవడానికి, వారిలో కొందరిని సంప్రదించడానికి ప్రయత్నించింది News18. ముంబైలో కోచింగ్ సెంటర్ నడుపుతున్న అలాంటి వ్యక్తి News18.comతో మాట్లాడుతూ.. “మాకు అకాడమీ ఉంది. మీరు మాకు సిలబస్ ఇచ్చి అభ్యర్థిని కలిసేలా చేయండి. పరీక్షలో ఉత్తీర్ణత గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో మాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఉపాధ్యాయుల నుంచి విద్యార్థుల వరకు.. మా అకాడమీలో అన్ని వయసుల అభ్యర్థులు, వివిధ పరీక్షల అభ్యర్థులు ఉన్నారు’ అని చెప్పారు. స్క్రైబ్‌గా ఉన్నందుకు వసూలు చేసే రుసుము పరీక్షపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.

“నాన్ టెక్నికల్ పరీక్షలకు ఫీజు తక్కువగా ఉండగా, టెక్నికల్ పరీక్షలకు ఎక్కువగా ఉంటుంది. కానీ ఫీజు గురించి చింతించకండి, వాయిదా పద్ధతి కూడా ఉంది. ఒక అభ్యర్థి ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఫీజు చెల్లించవచ్చు” అని ఆయన చెప్పారు.

* కంప్లైంట్స్ ఉండవు
అయితే పరీక్షల్లో ఎలాంటి ‘స్క్రైబ్ బిజినెస్’ జరుగుతోందన్న విషయం తమకు తెలియదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ కింద పనిచేసే వికలాంగుల సాధికారత విభాగాన్ని News18 సంప్రదించింది. పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక అధికారి మాట్లాడుతూ.. “ఇప్పటి వరకు మాకు 'స్క్రైబ్ బిజినెస్' గురించి ఎటువంటి ఫిర్యాదులు రాలేదు. భవిష్యత్తులో అలాంటి ఫిర్యాదులు వస్తే విచారణ చేపడతాం. ఈ విధానం దుర్వినియోగం అవుతోందని ఏవైనా నివేదికలు ఉంటే, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం దానిపై విచారణ చేయవచ్చు. అభ్యర్థుల అవసరాల కోసం స్క్రైబ్ విధానాన్ని రూపొందించాం. కానీ లొసుగులను ఉపయోగించుకునే వ్యక్తులు ఉన్నారు, అదే సమయంలో వీటిని పరిశీలించడానికి సంస్థలు ఉన్నాయి" అని తెలిపారు.

* అర్హత, స్క్రైబ్ లభ్యతపై కుదరని ఏకాభిప్రాయం
స్క్రైబ్ సదుపాయాల వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలను అమలు చేయడంలో అధికారులు ఏకాభిప్రాయానికి రావట్లేదు. సామాజిక న్యాయం, ఉపాధి మంత్రిత్వ శాఖ 2018 ఆగస్టులో బెంచ్‌మార్క్ వైకల్యాలున్న వ్యక్తుల కోసం మార్గదర్శకాలను ప్రచురించింది. అభ్యర్థులు తమ సొంత స్క్రైబ్స్‌ను తీసుకురావడానికి లేదా పరీక్ష నిర్వహణ సంస్థ నుంచి స్క్రైబ్‌ను కేటాయించమని అభ్యర్థించడానికి ఆప్షన్ ఇచ్చారు. అయితే అనేక సందర్భాల్లో అధికారులు స్క్రైబ్‌ను అభ్యర్థులకు అందించలేకపోయారు. సొంతంగానే స్క్రైబ్‌ను తీసుకురావాలని అభ్యర్థులను ఆదేశించారు.



* తెలంగాణలో గందరగోళం
ఇటీవల తెలంగాణలో జరిగిన TS TET పరీక్షలో చాలా మంది అభ్యర్థులు పరీక్షలకు గంటల ముందు వరకు తమకు స్క్రైబ్ లభిస్తారో లేదో తెలియని గందరగోళ పరిస్థితులు ఎదుర్కొన్నారు. 40 శాతం వైకల్యం ఉన్న అభ్యర్థులు స్క్రైబ్‌లను ఏర్పాటు చేసుకోవచ్చని అడ్మిట్ కార్డులలో పేర్కొన్నారు. అయితే పరీక్ష నిర్వహణ సంస్థ అభ్యర్థులకు స్క్రైబ్‌ను కేటాయిస్తుందా లేదా విద్యార్థులు సొంతంగా వారిని అరేంజ్ చేసుకోవచ్చా అనే ప్రస్తావన లేదని అభ్యర్థులు చెప్పారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన TSTET హెల్ప్‌డెస్క్‌లు అభ్యర్థులకు విభిన్న సమాచారాన్ని అందించడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది.

దీంతో ఈ వివరాల ధ్రువీకరణ కోసం న్యూస్18 బృందం కొన్ని జిల్లా హెల్ప్‌డెస్క్ నంబర్‌లకు కాల్ చేయడానికి ప్రయత్నించింది. హైదరాబాద్ హెల్ప్‌డెస్క్‌కు చెందిన ఒక ఆపరేటర్ మాట్లాడుతూ, అభ్యర్థులు పరీక్షలకు ఒక రోజు ముందు పరీక్ష కేంద్రానికి వెళ్లి తమకు స్క్రైబ్ అవసరమని రిక్వెస్ట్ చేయాలని చెప్పారు. ఆ తర్వాత వారికి స్క్రైబ్ కేటాయిస్తారని తెలిపారు. ఖమ్మం హెల్ప్‌డెస్క్ నుంచి వేరే సమాచారం అందింది. అభ్యర్థులు సొంతంగా స్క్రైబ్‌ను పొందవచ్చని, అయితే వారు 9వ తరగతి మాత్రమే అర్హత కలిగి ఉండాలని పేర్కొంది. అయితే, హైదరాబాద్ హెల్ప్‌డెస్క్ మాత్రం.. అభ్యర్థులు తమ స్క్రైబ్‌ను సొంతంగా తీసుకురావడానికి వీల్లేదని, పరీక్షల నిర్వహణ సంస్థ అయిన పాఠశాల విద్యా విభాగం మాత్రమే వికలాంగ అభ్యర్థులకు స్క్రైబ్‌ను కేటాయిస్తుందని పేర్కొంది.

అభ్యర్థుల్లో గందరగోళం నెలకొందన్న వాదనలను టెట్ కన్వీనర్ రాధా రెడ్డి ఖండించారు. ఆమె New18తో మాట్లాడుతూ.. “ఈ పరీక్షలు ప్రతి సంవత్సరం జరుగుతాయి కాబట్టి అభ్యర్థులలో ఎటువంటి గందరగోళం ఉండకూడదు. అభ్యర్థులు సొంతంగా స్క్రైబ్‌ను పొందలేరు. వైకల్య ప్రమాణాలకు సరిపోయే వారికి పరీక్ష కేంద్రంలో అధికారులే స్క్రైబ్‌ను అందిస్తారు. అభ్యర్థులు రాసే ఎగ్జామ్‌ పేపర్‌ను బట్టి స్క్రైబ్‌ల విద్యార్హత 9వ తరగతి, ఇంటర్‌ మాత్రమే ఉంటుంది." అని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో దీనికి సంబంధించిన నియమాలు తరచుగా మారుతూ ఉంటాయి. అందుకే అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు.

* జాతీయ, రాష్ట్ర స్థాయి స్క్రైబ్ పూల్ కోసం డిమాండ్
ఏ అభ్యర్థైనా స్వచ్ఛంద ప్రాతిపదికన సర్టిఫైడ్ స్క్రైబ్‌లను తక్షణమే పొందగలిగేలా స్క్రైబ్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని వికలాంగ హక్కుల కార్యకర్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రాక్సీ స్క్రైబ్ బిజినెస్‌కు చెక్ పెడుతుందని చెబుతున్నారు.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, Exams, JOBS, Students

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు